• కాశ్మీరీఎనామిల్ పెయింటింగ్ కుక్ వేర్ ఇమేజస్ చూసారా? వంటింటి పాత్రల పైన కాశ్మీరీ కళాకారులు చేత్తో అద్దిన అద్భుత మైన ఆకట్టుకునే డిజైన్ ల తో డబ్బాలు, గ్లాసులు, పోపుల పెట్టి, వంటి స్టీల్ పాత్రలు వచ్చాయి. కాశ్మీరీ హస్తకళను పాత్రల పైన అద్దడం వీటి ప్రత్యేకత. టిఫిన్ బాక్స్ లు, టీ కేటిల్స్, బౌల్స్, ఆకట్టుకునే రూపంలో వున్నాయి. పెద్దపెద్ద సూపర్ మార్కెట్స్ లో కూడా ఇప్పుడివి కనిపిస్తున్నాయి. హస్త కళ ఇలా వంటింటికి చేరడం వంటింటి అందం రెట్టింపు చేసింది. శుభకార్యాలకు బహుమతులుగాను. రిటర్న్ గిఫ్ట్స్ గాను ఇచ్చేందుకు ఇవి చాలా బాగుంటాయి. స్టీల్ డబ్బాలకి అలవాటు పడ్డ వాళ్ళకి ఈ సరికొత్త డిజైనింగ్ వంట పాత్రలు సృజనాత్మకం గా కనిపిస్తాయి అనడంలో సందేహం లేదు. నవతరం లో, పడక గదుల్ని, గెస్ట్ రూముల్ని, డ్రాయింగ్ రూముల్ని అందంగా అందంగా అలంకరించుకున్నట్లే ఇప్పుడు వంటగదిని అలంకరించుకోవచ్చు

    వంటింటికి కాశ్మీరీ హస్తకళ

    కాశ్మీరీఎనామిల్ పెయింటింగ్ కుక్ వేర్ ఇమేజస్ చూసారా? వంటింటి పాత్రల పైన కాశ్మీరీ కళాకారులు చేత్తో అద్దిన అద్భుత మైన ఆకట్టుకునే డిజైన్ ల తో డబ్బాలు,…

  • వెండి అందం, బంగారపు రంగు సొగుని కలిపి వేసుకుని, చాలా చౌక ధరలు అందరి ఇళ్ళల్లో కనువిందు చేస్తుంది జర్మన్ సిల్వర్ పూజా సామాగ్రి నుంచి ఇంటి అలంకరణ వస్తువులన్నీ జర్మన్ సిల్వర్ తో నే నిశ్చితార్థం, వివాహం వంటి వేడుకల్లో చీర సారెలన్ని ఈ నికెల్ సిల్వర్ ప్లెట్ ల తో అలంకరిస్తున్నారు. ఈ జర్మన్ సిల్వర్ లో ఒక్క పోగు వెండి కూడా వుండదు. కాపర్, నికెల్, జింక్, లోహాల సమ్మేళనమె ఈ జర్మన్ సిల్వర్. ఇది అచ్చం వెండి లాగే మెరుస్తుంది. వెండి ఖరీదు కిలో నలబై వెలుంటే ఇది కేవలం వెయ్యి లోపే ఖరీదు చేస్తుంది. వెండి లా కనిపించే డిన్నర్ ప్లాట్లు, ఇంకెన్నో రాకాల గృహాలంకరణ వస్తువులు ఈ జర్మన్ సిల్వర్ తో తాయారు చేస్తున్నారు. ఈ జర్మన్ సిల్వర్ నే స్వర్ణ కారులు తమ కళా నైపుణ్యం తో రకరకాల అభారణాలు కుడా చేస్తున్నారు. వెండి వస్తువుల పైన ఇష్టం వుండి, అంత ఖరీదు అబ్బా వద్దు లే అనుకుంటే ఈ జర్మన్ సిల్వర్ ఒక్క సారి చూడొచ్చు. పూజా సామాగ్రి, విగ్రహాలు అయితే ఎంతో బాగున్నాయి. ఒక్క సారి ఇమగెస్ చూడండి.

    ఈ వస్తువులు ఎంతో కళాత్మకం

    వెండి అందం, బంగారపు రంగు సొగుని కలిపి వేసుకుని, చాలా చౌక ధరలు అందరి ఇళ్ళల్లో కనువిందు చేస్తుంది జర్మన్ సిల్వర్ పూజా సామాగ్రి నుంచి ఇంటి…

  • ఇంటి ముందు నలుగు పచ్చని మొక్కలుంటే అందమే అందం. అలాగే కొందరికి మొక్కల పెంపకం విపరీతమైన ఇష్టం. ఎంత ఇష్టమైనా రెండు రోజుల పాటు ఏదైనా ఊరెళ్ళినా, ఈ ఎండకు ఓ పూట నీళ్ళు పోయడం మర్చిపోయినా,సాయంత్రానికి మొక్కలు తలలు వాల్చేస్తాయి. మొక్కల పెంపకం ఇష్టం వుండి, హాడావిడిగా తిరిగే వుద్యోగాలున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా వచ్చాయి. ప్యారెట్ పాట్స్. ఈ కుండీలో రెండు పొరలుంటాయి. ఈ ప్యారెట్ పాట్ అడుగులో వుండే చిన్ని తొట్టెలో వారానికి ఒక సారి నీళ్ళు పోస్తే చాలు. మొక్క మొదట్లో తేమ తగ్గిపోవడం కుండీనే తెలుసుకుని కింద వున్న నీటిని సన్నని ధారగా అవసరమైనంత మేరకు మొక్కకు పోస్తుంది. స్పెంసర్ల ద్వారా పని చేసే ఈ కుండీ ఇలా తేమ శాతం గుర్తించడం, మొక్కకు సరైన పోషకాలండుతున్నాయా? కాంతి సరిపోతుందా? ఎక్కువవుతుందా? అన్న విషయాలు ఆప్ ద్వారా మన ఫోన్ కు పంపిస్తుంది. ఈ ఏర్పాట్లున్నాక మొక్కల పెంపకం ఈజీ అయిపోదూ?

    మొక్క గురించి ఈ కుండీ కి బాగా తెలుసు

    ఇంటి ముందు నలుగు పచ్చని మొక్కలుంటే అందమే అందం. అలాగే కొందరికి మొక్కల పెంపకం విపరీతమైన ఇష్టం. ఎంత ఇష్టమైనా రెండు రోజుల పాటు ఏదైనా ఊరెళ్ళినా,…

  • ఒక కళాకారుడి చేతిలో బండరాయి కూడా అపురూపమైన శిల్పం అయిపోతుంది. ఆ స్కిల్ వుంటే దేన్నెయినా ఏ రూపంలోకైనా తీసుకోవచ్చు. కళాకారుడి సృజనకు పరిశోధనలు ఉంటాయా? ఇప్పుడు ఎండల్లో పుచ్చకాయలు గుట్టలు గుట్టలుగా కాస్తాయి. రోడ్డు పక్కన ఎక్కడ చూసినా ఆ పుచ్చకాయలు అమ్మే టెంట్లే. కళ తెలిసిన వారి చేతిలో ఒక చాకుంటే పుచ్చకాయ ఎంతటి కళా కండంగా అయిపోతుందో వాటర్ మిలాన్ ఫుడ్ కార్వింగ్ ఇమగెస్ లో చూడండి. పుచ్చకాయ నవ్వుతుంది. పువ్వుల గుట్ట అయిపోతుంది. విషెస్ చెప్పుతుంది, రకరకాల జంతువుల రూపంలోకి మారిపోతుంది. పైన హెద్దింగ్ లేకుండా చూస్తే అది పుచ్చకాయను చెక్కి తాయారు చేసారంటే నమ్మడం కష్టం. వాటర్ మిలాన్ కార్వింగ్ కోసం కళాకారులు సన్నని చాకులు, ఇతర కార్వింగ్ టూల్స్ తో పుచ్చకాయను కొద్ది కొద్దిగా చెక్కుతూ అనుకున్న రూపంలోకి తెస్తారు. కొస్తే నీళ్ళు కారిపోయే పుచ్చకాయ గొప్ప కళాకండంగా కనిపిస్తుంది ఇమేజస్ చూడండి. పుచ్చకాయ నాకొద్దని మారాం చేసే పిల్లలకి ఇలాంటి రూపాల్లో ఇవ్వగలరేమో ట్రై చేయండి.

    దాహం తీర్చే కాయకొ సుందర రూపం

    ఒక కళాకారుడి చేతిలో బండరాయి కూడా అపురూపమైన శిల్పం అయిపోతుంది. ఆ స్కిల్ వుంటే దేన్నెయినా ఏ రూపంలోకైనా తీసుకోవచ్చు. కళాకారుడి సృజనకు పరిశోధనలు ఉంటాయా? ఇప్పుడు…

  • క్యారెట్ తినడం వల్ల ద్రుష్టి మేరుగవ్వుతుందనే మాట మాత్రం నిజం అంటున్నారు ఎక్ష్ పర్ట్స్ ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ లో రెండు స్పూన్ల తేనె కలుపుకుని తాగుతుంటే కంటి దృష్టి మేరుగు అవ్వుతుంది. అంతే కాక గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు పని చేసే వల్లకి కలిగే అలసటకు కూడా క్యారెట్ జ్యూస్ మంచి మందు. ప్రతి రోజు ఉదయం లేస్తూనే, వాష్ చేసిన ముందు నిలబడి ఐదు నిముషాలు కళ్ళ పై చిలకరించాలి. కళ్ళు ఇలా వాష చేయడానికి వేడి నీళ్ళను ఉపయోగించకూడదు. అలా చేస్తే కళ్ళు అలస్సి పోయి, నిద్ర నుంచి తేరుకుని తేటగా అవ్వుతాయి. రెండు అర చేతుల్ని ఆర నిమిషం పాటు రాపిడి చేసి ఆ వెచ్చ దనాన్ని కళ్ళపై వుంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ళకు మంచి పరిరక్షణ లభిస్తుంది. ఒక గ్లాసు నీళ్ళల్లో ఓ టీ స్పూన్ త్రిఫల పొడి వేసి రాత్రంతా అలా వుంచి ఉదయాన్నె వడకట్టి ఆ నీళ్ళతో కళ్ళు శుబ్రం చేసుకంటే మంచిది.

    కంటి ద్రుష్టి మెరుగు పడుతుంది.

    క్యారెట్ తినడం వల్ల ద్రుష్టి మేరుగవ్వుతుందనే మాట మాత్రం నిజం అంటున్నారు ఎక్ష్ పర్ట్స్ ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ లో రెండు స్పూన్ల తేనె కలుపుకుని…

  • పింక్ సౌండ్స్ అంటే ఉదాహరణకు నెమ్మదిగా జలపాతం ప్రవహిస్తున్న శబ్దం, నీరు మెల్లగా శబ్దం చేస్తూ ప్రవహిస్తున్న శబ్దం, నెమ్మదిగా తూగే గాలి శబ్దం, చెక్కని మెల్లని ఆలాపన తో జోల పాట హుమ్మింగ్, ఎవన్నింటినీ పింక్ సౌండ్స్ అంటారు. ఇవన్నీ విశ్రాంతినిస్తాయి. నిశ్శబ్దంగా వున్న చొట ఇవే చెవుల దగ్గర హాయిగా వినిపిస్తాయి. ఈ శబ్దాలు వింటూ హాయిగా నిద్ర పోవొచ్చు. అని చెపుతున్నారు శాస్త్రవేత్తలు. ఇది చాలా వినూత్నమైన పద్దతి. ఎటువంటి మందులు పరికరాల సాయం లేకుండా హాయిగా నిద్ర పడుతుంది. ఘాడంగా నిద్ర పోవడానికి జ్ఞాపక శక్తికి సంబంధం వుందనిపరిశోధకులు ఏ నాడో గుర్తించారు. మధ్య వయస్సు వచ్చేసరికి నిద్ర తగ్గుతూ వస్తుంది. ఒక వ్యక్తి పడుకునే సమయంలో అతని మెదడు లోని న్యురాన్లు పంపే సంకేతాలని శస్త్రవేత్తలు రికార్డు చేసారు. న్యురాన్లు సంకేతాలు వచ్చే సమయంలో పింక్ సౌండ్ వినిపిస్తేనే ఆ వ్యక్తి గాఢమైన నిద్ర పోగాలడట. ఇది నిద్ర లేమికి సరైన పరిష్కారమే అనిపిస్తుంది.

    ఇలాంటి శబ్దాలు వింటే నిద్రొస్తుంది.

    పింక్ సౌండ్స్ అంటే ఉదాహరణకు నెమ్మదిగా జలపాతం ప్రవహిస్తున్న శబ్దం, నీరు మెల్లగా శబ్దం చేస్తూ ప్రవహిస్తున్న శబ్దం, నెమ్మదిగా తూగే గాలి శబ్దం, చెక్కని మెల్లని…

  • మంచి కాఫి తాగితే మనకెంతో ఉత్సాహం వస్తుంది సరే. మరి వాడిన కాఫి పొడి మొక్కలకు వేస్తె అవి ఎంతో ఆరోగ్యంగా పెరుగుతాయి. మొక్కలకు తాయారు చేసే సహజ ఎరువులో కాఫి పొడి కలిపితే వాటికి నత్రజని లోపం రాకుండా వుంటుంది. అంటే కానీ నత్తలు, చిన్ని చిన్ని పురుగులు చేరవు మొక్క మొదట్లో కాఫి పొడి వేస్తె ఆ వాసనకి పిల్లులు మట్టిని తవ్వకుండా వుంటాయి. గులాబీ మొక్కలు చేక్కగా ఎదగాలంటే మట్టిలో ఆమ్ల స్వభావం వుండాలి. కాఫి పొడి మట్టికి ఆ గుణాన్ని ఇస్తుంది. దీన్ని మొక్క కుదురులో చల్లాలి. రెండు కప్పుల వాడేసిన కాఫి పొడిని ఒక బకేట్ నీళ్ళల్లో కలిపి రాత్రంతా అలా వదిలేసి ఆ నీటిని తెల్లారి మొక్కల పై జల్లితే క్రిమి నాసనిగా ఉపయోగ పడతాయి. మట్టిలో కాఫి పొడిని బాగా కలిపి మొక్కలకు వేస్తె కలుపు మొక్కలు రావు. ఎండాకాలంలో తేమ పోగోట్టుకుని మొక్కలు వాడిపోకుండా కూడా కాఫి పొడి కాపాడుతుంది.

    మట్టి లో ఆమ్ల స్వభావం పెంచే కాఫి పొడి

    మంచి కాఫి తాగితే మనకెంతో ఉత్సాహం వస్తుంది సరే. మరి వాడిన కాఫి పొడి మొక్కలకు వేస్తె అవి ఎంతో ఆరోగ్యంగా పెరుగుతాయి. మొక్కలకు తాయారు చేసే…

  • లంఖణం పరమౌషదం అంటారు ఆయుర్వేద నిపుణులు. అలాగే చాలా మందికి ఎంతో మంది దేవుళ్ళ పేరిట ఒక్కపూట ఉపవాస నియమం వుంటుంది. ఇక పూజల్లో భాగంగా చేసే ఉపవాసాలు సరేసరి. భారతీయ జీవన విధానం లో ఉపవాసం నియమం గా ఉంది. ఇప్పుడు కొత్త పరిశోధనలు ఇది నియమంగా చేసిన, ఆరోగ్యం కోసం చేసిన మంచి ఫలితాలే వున్నాయంటున్నాయి. తక్కువ మొత్తంలో ఆహారం, ఉపవాసం దీక్ష లో తీసుకునే పళ్ళు పాలు శరీరానికి ఉపయోగం అంటున్నారు. వరం లో కనీసం ఒక్క రోజైనా పూర్తిగా ఏమీ తినక పొతే శరీరం కాస్త తనను, తన వ్యావస్థను వాగు చేసుకుంటుంది అని, నిజానికి ఉపవాసం వున్నా ఉదయం తేలికగా వుండటం, నీరసంగా వుండటం గమనిన్చుకోమని చెప్పుతున్నాయి. ఇలా ఉపవాస కారణంగా, ఆరోగ్యంగా యవ్వనం తో కూడా ఉంటారని వాళ్ళ రిపోర్టు. ఒక్క పూట తినకపోతే ఆ సమయం శరీరం ఉపయోగించుకుంటుందని , కేవలం నీళ్ళు మాత్రం తాగటం వల్ల చెర్మం తేటగా ఉంటుందని చెపుతున్నారు. ఏ విధంగా చుసినా,ఇటు భక్తి తో చేసినా, ఆరోగ్యం కోసం చేసినా ఉపవాసం వల్ల లాభమే.

    ఉపవాసం తో యవ్వనం

    లంఖణం పరమౌషదం అంటారు ఆయుర్వేద నిపుణులు. అలాగే చాలా మందికి ఎంతో మంది దేవుళ్ళ పేరిట ఒక్కపూట ఉపవాస నియమం వుంటుంది. ఇక పూజల్లో భాగంగా చేసే…

  • ఎన్నో పెళ్ళిళ్ళకు హాజరవుతాం. వందల రకాల భోజన పదార్ధాలు. ఏది తినాలో అర్ధం కానన్ని వెరైటీస్, ఎంతో వ్యర్ధం. కామార్స్ లో పీ.జీ తీసుకున్న శ్యామలా సురేష్ ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ విభాగంలో పని చేస్తున్నారు. ఆమె కూడా అద్భుతమైన పెళ్ళిళ్ళు, అందులో వృధా అయ్యె పదార్ధాలు ప్లాస్టిక్ ఉత్పత్తుల గురించి బాధ పడి ఎకో ఫ్రెండ్లీ మారేజస్ కి శ్రీకారం చుట్టారు. ఇవి అన్ని పెళ్ళిళ్ళ మాదిరిగానే వుంటాయి. ఈ గ్రీన్ మ్యారేజ్ కళ్యాణ మండపం లో ప్లాస్టిక్ గ్లాసులు వుండవు. గాజు గ్లాసులు, తళ తళా మెరిసే స్టీలు కంచాలు, పచ్చని అరటి ఆకులు. అంతా క్లీన్ అండ్ గ్రీన్. పోస్టర్లు అంటించి ఆహారం వృధా చేయొద్దని చెపుతారు. చిన్నా చితకా వ్యర్ధాలు కనిపిస్తే తడి పొడి పద్దతి లో వేరు చేస్తారు. కంపోస్ట్ బావుల నిర్వాహకులే చేస్తారు. కుదరక పొతే బయో గ్రీన్ ప్లాంట్లకు తరలిస్తారు. పచ్చని పందిరిలో ముచ్చటైన ఎకో ఫ్రెండ్లీ మ్యారేజస్ అంటే చాలా మంది ఆసక్తి చూపిస్తారు. పర్యావరణ హితం కోరె శ్యామలా రమేష్ బెంగుళూరు వాసి.

    పచ్చని పందిట్లో ముచ్చటైన పెళ్ళి

    ఎన్నో పెళ్ళిళ్ళకు హాజరవుతాం. వందల రకాల భోజన పదార్ధాలు. ఏది తినాలో అర్ధం కానన్ని వెరైటీస్, ఎంతో వ్యర్ధం. కామార్స్ లో పీ.జీ తీసుకున్న శ్యామలా సురేష్…

  • ఎప్పుడు ఒకేలా వుంటే పిల్లలు ఎప్పుడు మెచ్చారు. నోటికి రుచిగా ఉంటుందని వాళ్ళకు తెలనెంత అనుభవం లేదు కనుక కళ్ళకు బావుంటే అది మెచ్చుతారు. సాధారణంగా మనకు మైదా,గుడ్ల వున్న దిబ్బ రొట్టె లాగా కనిపించే కేక్స్ తెలుసు. సాధారణంగా గుండ్రంగా ఐసీగా అలాగే కదా వుండేది. కానీ ఇప్పుడు జెల్లీ కేక్స్, షుగర్ ఫ్లేవర్ కేక్స్, గ్రావిటీ కేక్స్, ఫాండెంట్ కేక్, ఒక్క సారి ఇలాంటి కేక్స్ కోసం ఆన్లైన్ లో చుస్తే అబ్బో ఎన్ని రకాలో. గాల్లో తేలిపోయే గులాబీ పువ్వు, వేలాడే ఆకులతో, మల్లె పువ్వులు, మొగ్గలు విచ్చుకున్న గులాబీ రెండు ఆకులు ఇవన్నీ షుగర్ ఫ్లవర్ కేక్స్ అందాలు. ఇవి తయారు చేసే విధానం, వాటి కోసం ఉపయోగించే జెల్లీలు, పరికరాలు అన్ని వివరంగా వుంటాయి. వీడియోలు కూడా వున్నాయి.

    పువ్వల్లెవాలి, ముచ్చటగా విచ్చుకునే కేక్స్

    ఎప్పుడు ఒకేలా వుంటే పిల్లలు ఎప్పుడు మెచ్చారు. నోటికి రుచిగా ఉంటుందని వాళ్ళకు తెలనెంత అనుభవం లేదు కనుక కళ్ళకు బావుంటే అది మెచ్చుతారు. సాధారణంగా మనకు…

  • ఇది ఇవాల్టి న్యూస్ కాకపోయినా ఇంటరెస్టింగ్ గా ఉంది. ఇన్స్పిరేషన్ ఇచ్చేలా ఉంది. ఒక రోజు రాత్రి తెల్లారే సరికి రంగు రంగుల బొమ్మలతో తెరచిన పుస్తకాల్లా కనిపించే బెంచీలు వీధుల్లో వెలిసే సరికి లండన్ వాసులు ఆశ్చర్యపోయారట. అసలు ఇలాంటి బెంచీలు ఎందుకు పుట్టుకొచ్చాయి అంటే లండన్ నగర సాహిత్య వారసత్వ సంపద గురించి ప్రజలకు తెలియజేసి వాళ్ళలో పుస్తక పఠనం పైణ ఆసక్తి పెంచటానికేనట. అందులో భాగంగానే పబ్లిక్ ఆర్ట్ ప్రాజెక్ట్ పేరుతో పిల్లలకు, పెద్దలకు సబంధించిన మంచి పుస్తకాలు పేరుపొందిన పుస్తకాల, సంకలనాల నమూనాలతో బెంచీలు తయారు చేయించి నగరంలో అక్కడక్కడా ఏర్పాటు చేయించిందట. స్థానిక నేషనల్ లిటరరీ సంస్థ. ఫోటోల్లోచూడండి పేజీలు  తెరిచిన పుస్తకాలు అచ్చు కూర్చునే బెంచీల్లా తయారుచేసి వాటి పైన పుస్తకాల పేర్లు అందులో పాత్రలూ, రచయితల బొమ్మలూ పెట్టేశారు. ఇలా మన దేశంలో కూడా తెస్తే బావుండు. కనీసం వాటిని చూసయినా ఒక మంచి పుస్తకం చదవాలని అనిపిస్తుందేమో....

    ఇవి కూర్చునే పుస్తకాలు

    ఇది ఇవాల్టి న్యూస్ కాకపోయినా ఇంటరెస్టింగ్ గా ఉంది. ఇన్స్పిరేషన్ ఇచ్చేలా ఉంది. ఒక రోజు రాత్రి తెల్లారే సరికి రంగు రంగుల బొమ్మలతో తెరచిన పుస్తకాల్లా…

  • కొన్నింటిని ఆనందించాలంటే వెతుక్కుంటూ వెళ్ళాలి. పురాతనమైనవి. ఎంతో ప్రత్యేకమైనవి, అరుదైనవి మ్యుజియంలో పెడతారు. ఎప్పటి దాకా, చరిత్ర, జీవన విధానం తెలుసుకోవడానికి ఉపయోగ పడతాయి. ఈ మ్యుజియం ఎంత ఉపయోగ పడతాయి. కెమేరా మ్యుజియం, ఐస్ క్రీం మ్యుజియం, రాళ్ళ మ్యుజియం, ఇప్పుడు ఇంకో ప్రత్యేక మైన ఎంతో సరదా వేసే మ్యుజియం వెంట్ హీవెన్ మ్యుజియం. కెంటకిలో వుందీ మ్యుజియం. ఇది మాట్లాడే బొమ్మల కొలువు. వెంట్రిలాక్విజం తో మాట్లాడే బొమ్మలతో వినోదం పంచె కళ. వెంట్రిలాక్విస్ట్ లు బొమ్మల్ని చేత్తో పట్టుకుని, పేదలు కదలకుండా మాట్లాడుతూ బొమ్మే మాట్లాడినట్లు, నవ్వినట్లు బ్రమ కలిగిస్తారు. విలియం షెక్స్ పియర్ చెర్గర్ అన్న వ్యక్తి 1973 లో వెంట్ హెవెన్ మ్యుజియం ప్రారంభించాడు. 60 ఏళ్ళ పాటు సేకరించిన వేలాది ఫోటోలు, పుస్తకాలు, బొమ్మలు ఇతర వివరాలు ఇక్కడ చూడొచ్చు. రకరకాల వేషధారనలు, అలంకరణలతో ఈ బొమ్మలు ఆకర్షిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా దేశ విదేశాలకు సంబందించిన బొమ్మలివి.

    కొలువు తీరిన మాట్లాడే బొమ్మలు

    కొన్నింటిని ఆనందించాలంటే వెతుక్కుంటూ వెళ్ళాలి. పురాతనమైనవి. ఎంతో ప్రత్యేకమైనవి, అరుదైనవి మ్యుజియంలో పెడతారు. ఎప్పటి దాకా, చరిత్ర, జీవన విధానం తెలుసుకోవడానికి  ఉపయోగ పడతాయి. ఈ మ్యుజియం…

  • కొబ్బరి నూనెలో ఉండే ఔషద గుణాలు ఇంకే నూనె లోనూ లేవని పరిశోధనలు చెప్పుతున్నాయి. వర్క్ఔట్స్ చేసాక చాలా మంది క్రీడాకారులు కోకోనట్ ఆయిల్ కలిపిన పానీయాలు తాగుతారు. ఇది త్వరగా ఏ వైరస్ ను శరీరంపైకి దాడి చేయనీయదు. ఇది యాంటి ఫంగల్, యాంటి బాక్టీరియల్, యాంటి వైరల్ గా పైచేస్తుంది. కొబ్బరి నూనె తో కేరలీయులు వంటలు చేసుకుంటారు. ఈ నూనె శరీరంలోకి వెళ్ళాక కొవ్వు పెరుకోదు. నేరుగా కాలేయానికి చేరుకొని శక్తి ఉత్పత్తి మొదలు పెడుతుంది. తల్లి పాలల్లో వుండే సత్గుణాలు అన్ని కొబ్బరి నూనె లో వున్నాయి. శరీరంలోకి చేరిన వెంటనే శక్తి పుట్టించే కీటోన్స్ ఉత్పత్తి చేస్తుంది. మెదడు పనితీరును మెరుగు పరచడమే కాకుండా మెదడుకు సంబందించిన కొన్ని వ్యాధులు అంటే ఎపిలెప్సి,అల్జిమర్స్, సిజర్స్ వంటి వాటిని తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొవ్వు ఉత్పత్తి పెంచుతుంది. అందరికి తలిసినట్లే చర్మం జుట్టు సౌందర్యాన్ని కాపాడటంలో తిరుగులేనిది.

    కొబ్బరి నూనె ఎంత మంచిదో

    కొబ్బరి నూనెలో ఉండే ఔషద గుణాలు ఇంకే నూనె లోనూ లేవని పరిశోధనలు చెప్పుతున్నాయి. వర్క్ఔట్స్ చేసాక చాలా మంది క్రీడాకారులు కోకోనట్ ఆయిల్ కలిపిన పానీయాలు…

  • హీల్స్ వేసుకోవడం పైన క్రేజ్ ఎంతకీ వదులుకోరు అమ్మాయిలు. ఎత్తును కవర్ చేసుకోవడానికి పనికి వస్తాయి హీల్స్. అందుకే నొప్పులోస్తాయని తెలిసినా వీటికి ప్రాధాన్యత ఇస్తూనే వుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్రాన్స్ కు చెందిన ఒక స్టార్ట్ అప్ కంపనీ రెండు రకాల స్మార్ట్ హీల్స్ ను తాయారు చేసింది. ఒక రకం హీల్స్ ను కావాల్సిన సైజుకు అర్జుస్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ సాయింతో స్మార్ట్ ఫోన్ కు హీల్స్ కనెక్ట్ అవ్వుతాయి. యాప్ సాయంతో 1.7 అంగుళాల నుంచి 3.1 అంగుళాల వరకు ఎత్తు మార్చవచ్చు.రెండో వారానికి హిటెడ్ ఇన్సోల్ వుంటుంది. ఈ రెండు రకాల హీల్స్ ఫిట్నెస్ ఫ్యాక్టర్స్ గా ఉపయోగ పడతాయి. ధరకాస్త ఎక్కువే వుంటుంది. దగ్గరగా 20 వేల వరకు వుండవచ్చు.

    స్మార్ట్ హీల్స్

    హీల్స్ వేసుకోవడం పైన క్రేజ్ ఎంతకీ వదులుకోరు అమ్మాయిలు. ఎత్తును కవర్ చేసుకోవడానికి పనికి వస్తాయి హీల్స్. అందుకే నొప్పులోస్తాయని తెలిసినా వీటికి ప్రాధాన్యత ఇస్తూనే వుంటారు.…

  • కరెంటు అక్కరలేని ఫ్రిజ్ ఎప్పుడైనా చూసారా? సహజమైన రీఫ్రిజిరేటర్ రంపపు పొట్టు, ఇసుక కలిపిన మట్టితో పాటు చేయడం వల్ల సహజంగా చల్లగా వుంటుంది. కుండలో పోసినట్లు ఈ ఫ్రిజ్ లోనూ నీళ్ళు పోస్తే కూరగాయలు, పండ్లు వారం రోజుల పాటు తాజాగా వుంటాయి. ఈ మట్టి ఫ్రిజ్ లే కాదు మట్టి కూల్ వాటర్ బొట్టెల్లు, క్లే డిన్నర్ సెట్లు, కడాయిలు, కర్రీ కప్స్, పెనం వంటి ఖరీదైన వంటింటి సామగ్రిని మట్టి తో తయారు చేసి పేద వాళ్ళకు ఇవ్వాలనుకున్నాడు గుజరాత్ కు చెందిన మన్ సుచ్ భాయ్. కానీ ప్రస్తుత వాతావరణం లో ఎక్కడ చుసినా సేంద్రియ మంత్రమే ఆరోగ్యకరమైన ఆహారాన్ని పట్టుకు పోయి పోషకాలన్నీ పోయేలా రసాయిన పూరితమైన పాత్రల్లో వండితే లాభమేంటి. ఈ ప్రశ్నలోచ్చాయి కనుకనే మిట్టి కూల్ పాత్రలన్నీ పర్యావరణ ప్రక్రియల్ని ఆకట్టుకుంటున్నాయి. ఒక సారి నెట్ లో చూడండి పాత్రలెంత చెక్కగా వున్నాయో, మనకు తెలుసు పూర్వ కాలం లో మట్టి కుండల్లో పిడకల పొయ్యి పైన పాలు మరిగేలా కాచి తోదేస్తే ఆ పెరుగు కమ్మగా రాయి లాగా తోడుకునేది ఇప్పుడాఅనుభవం కావాలంటే ఓ కర్ట్ పాట్ కొనుకొచ్చి చూడండి. పెరుడు బాగుంటుంది.

    ఫ్రిజ్ నుంచి వాటర్ బాటిల్ దాకా అన్ని మట్టివే

    కరెంటు అక్కరలేని ఫ్రిజ్ ఎప్పుడైనా చూసారా? సహజమైన రీఫ్రిజిరేటర్ రంపపు పొట్టు, ఇసుక కలిపిన మట్టితో పాటు చేయడం వల్ల సహజంగా చల్లగా వుంటుంది. కుండలో పోసినట్లు…

  • ఇంటి ముందు పువ్వుల తోట బాగుంటుంది. అదే కూరగాయాల్ని పువ్వులుగా పండిస్తే........... ఇలాంటివే క్యాబేజి పువ్వులు. అర్నమెంటల్ క్యాబేజిలుగా పిలిచే ఇవి తోట ఒక ప్రత్యేకమైన అందం. క్యాబేజిని తెలుపు, ఆకుపచ్చ, వంగపండు, గోధుమ, ఎన్ని రకాల వర్ణాలు వుంటాయి. క్యాబేజి మొక్కలో చుట్టూ ఆకులుండి మధ్యలో బంతి పువ్వు విచ్చుకున్నట్లు కనిపిస్తుంది. అలా విచ్చుకునే రేఖలో మనం నాటిన రకాన్ని బట్టి వివిధ రంగుల్లో వస్తాయి. విచ్చుకున్నాక వరం రోజుల పాటు చెక్కగా ఉంటాయి. తోటలో వరుసలో నాటితే వాటి చుట్టూ ఆకుపచ్చని ఆకుల మొక్కలుంటే తోట ఆకర్షనియంగా వుంటుంది. కొన్ని ముద్దుగా బంతి పువ్వులో కొన్నింటి కోణలు వంకర టింకరగా చూసేందుకు చెక్కగా వున్నాయి అర్నమెంటల్ క్యాబేజిలు.

    ఇవి నిజంగా క్యాబేజి పువ్వులు

    ఇంటి ముందు పువ్వుల తోట బాగుంటుంది. అదే కూరగాయాల్ని పువ్వులుగా పండిస్తే……….. ఇలాంటివే క్యాబేజి పువ్వులు. అర్నమెంటల్ క్యాబేజిలుగా పిలిచే ఇవి తోట ఒక ప్రత్యేకమైన అందం.…

  • బిడ్డ కోసం తల్లి పాడే లాలి పాట పైన మియామి యూనివర్సిటీ పరిశోధనలు చేసారు. ఈ పాట వల్ల ఎన్నో లాభాలున్నాయట. పసి పిల్లలకు పది రకాల గొంతులతో పాటలు, మాటలు వినిపించారట. అందులో తల్లి పాడే పాటకే బిడ్డ మెదడు స్పందించిందట. ఆ పాట వింటున్న పసి బిడ్డలో ఆ సమయం లో మెదడు చురుకుగా ఉంటుందిట. అలంటి లాలిపాట తల్లి లో కూడా ఆరోగ్యం అంటున్నారు. బిడ్డను తీరికగా లాలిస్తూ తన చేతుల్లోకి ప్రేమగా తీసుకుని తన స్పర్స ని బిడ్డ శరీరానికి తాకిస్తూ పాట పాడుతుంటే తల్లికి స్వాంతన రావడం గుర్తించారు పరిశోధకులు. అలాగే బిడ్డ చాలా బద్రంగా ఫీల్ అవుతూ తల్లి గొంతును, స్పర్శ ద్వారా దొరికే బాధ్రతను అందుకుంటూ, తల్లిని హత్తుకుని నిశబ్ధంగా పాట వినడం ఆ పాటని ప్రేమకు పరవసులై నిద్రపోవడం గమనించారు. తల్లి గొంతులో మాధుర్యం వుందా, ఆమె అద్భుతంగా పడుతుందా అన్న ప్రేస్నే లేదు. తల్లి గొంతు లోంచి వచ్చే ఆ అలవాటైన గొంతు పలికే పాటకి పిల్లలు స్పందిస్తారంతే.

    లాలీ పాట తల్లి బిడ్డలకు ఆరోగ్యం

    బిడ్డ కోసం తల్లి పాడే లాలి పాట పైన మియామి యూనివర్సిటీ పరిశోధనలు చేసారు. ఈ పాట వల్ల ఎన్నో లాభాలున్నాయట. పసి పిల్లలకు పది రకాల…

  • ద్రాక్ష పండు మీద తెల్లని పూత చూసి అదేదో క్రిమి సంహారక మందు అనుకోవద్దు. ఇది సహజమైంది. దిన్ని బ్లూమ్ అంటారు. పండ్లలోని తేమ పాడవకుండా ఫంగస్ చేరకుండా ఈ బ్లూమ్ తోర్పడుతుంది. ఆరోగ్యం కోసమే కాదు, సౌందర్యం కోసం ద్రాక్ష ఎంతో మేలు. రోజు అందరిలో ద్రాక్ష తింటే చర్మం నిగారింపు తో ఎప్పటికి వృద్దాప్య ఛాయల్ని రానీయకుండా అడ్డుకుంటుందని సౌందర్య నిప్పునులు చెప్పారు. ద్రాక్ష గుజ్జు మొహం పైన రాస్తే, 20 నిమిషాల పాటు దాన్ని మర్దన చేస్తే ముడతలు, నల్లమచ్చలు తగ్గుతాయి. ద్రాక్ష గింజల నూనె అద్భుతమైన మాయిస్చురైజర్. పచ్చ ద్రాక్ష జీవక్రియను మెరుగు పరచి చర్మాన్ని కాంతివంతంగా వంచేందుకు సయం చేస్తుంది. రంగు ఎంత ఘాడంగా వుంటే అంత మంచివి, తెలుపు, లేతాకు పచ్చ ద్రక్షలో కెటబిన్స్ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఇది మంచి ఆరోగ్య ఔషద ఫలం. పడుకునే ముందు ద్రాక్ష రసం తాగితే పగలంతా పడిన ఒత్తిడి పోయి హాయి గా నిద్రపడుతుంది.

    ఇది ఆరోగ్య సౌందర్య ఫలం

    ద్రాక్ష పండు మీద తెల్లని పూత చూసి అదేదో క్రిమి సంహారక మందు అనుకోవద్దు. ఇది సహజమైంది. దిన్ని బ్లూమ్ అంటారు. పండ్లలోని తేమ పాడవకుండా ఫంగస్…

  • ఏ మందులకు జలుబు తగ్గదు. అది ఏ వాతావరణ ప్రభావంతో ఎలా వచ్చిందో అలాగే పోతుంది అంటారు. కానీ జలుబుకు విటమిన్-డి అన్ని మందుల కన్నా బాగా పని చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. జలుబు సాధారణ సమస్యగా పైకి కనపడుతుంది. కొన్ని సందర్భాలలో ప్రనంతకంగా మారే అవకాసం వుంది. జలుబు నుంచి విముక్తి కి విటమిన్-డి వాడండి అంటున్నారు. క్వీన్ యూనివర్సిటీ పరిశోధకులు 14 దేశాలల్లో 11 వేల మంది పైన ఈ పరిశోధన జరిగింది. తీవ్రమైన జలుబు తో బాధ పడే వారికి క్రమం తప్పకుండా విటమిన్-డి సప్లిమెంట్స్ ఇచ్చారు. క్రమేపి జలుబు తగ్గిపోతుంది. కొంతసేపు ఎండలో తిరిగితే విటమిన్-డి అందుతుంది అంటారు. కానీ దాని వల్ల లాభం లేదని విటమిన్-డి సప్లిమెంట్స్ తీసుకోవాలి అని చెప్పుతున్నారు. సో జలుబు వస్తే ఈ విటమిన్ గురించి గుర్తు చేసుకోవాలి.

    జలుబుకు విటమిన్-డి

    ఏ మందులకు జలుబు తగ్గదు. అది ఏ వాతావరణ ప్రభావంతో ఎలా వచ్చిందో అలాగే పోతుంది అంటారు. కానీ జలుబుకు విటమిన్-డి అన్ని మందుల కన్నా బాగా…

  • వయసొచ్చిన అమ్మాయిలతో అమ్మలకు చాలా కష్టం. హడావుడిగా తిరిగేస్తూ ఏమీ తినమంటారు. అందమంటే సన్నగా ఉండటం అనుకుని స్ట్రిక్ట్ గా వుంటున్నామనుకుని చిరు తిళ్ళ పై పడిపోతారు. అసలు ఇలా చేస్టన్ సరైన పోషకాహారం అందక బరువు పెరుగుతారు . హార్మోన్ల మార్పులతో నెలసరి క్రమం తప్పటం జుట్టు ఊడిపోవటం చాలా చిరాకులోస్తాయి. డాక్టర్లు గట్టిగ పోషకాహారాలు రికమెండ్ చేస్తున్నారు. ఆకు కూరలు తృణ ధాన్యాలు పాల పదార్ధాలు అన్నీ అందాలంటున్నారు. వెన్న లేని పాలు ఇష్టం లేకపోతే పెరుగు తినాలంటున్నారు. నట్స్ నువ్వులు తప్పనిసరి . ముదురురంగుతో వుండే ఆకుకూరలతో పాటు పప్పు ధాన్యాలు సెనగలు రాజ్మా ఉలవలు బొబ్బర్లు గోంగూర పుదీనా మెంతికూర సి విటమిన్ కోసం జామ ఉసిరి నిమ్మ బొప్పాయి కమలా ద్రాక్ష వంటివి శరీరానికి కావలిసిన పోషకాలు ఇస్తాయని సప్లిమెంట్ల జోలికి వెళ్ళద్దనీ మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంగా ఉండమంటున్నారు.

    ఇలా చేస్తేనే అందం ఆరోగ్యం

    వయసొచ్చిన అమ్మాయిలతో అమ్మలకు చాలా కష్టం. హడావుడిగా తిరిగేస్తూ ఏమీ తినమంటారు. అందమంటే సన్నగా ఉండటం అనుకుని స్ట్రిక్ట్ గా వుంటున్నామనుకుని చిరు తిళ్ళ పై పడిపోతారు.…