పక్షి ఈకల గ్రంథాలయం

పక్షి ఈకల గ్రంథాలయం

పక్షి ఈకల గ్రంథాలయం

బెంగళూరు లో పక్షి ఈకల లైబ్రరీ నడుపుతున్నారు ఈషా మున్షీ ఫెదర్ లైబ్రరీ పేరుతో నడిచే ఈ గ్రంథాలయంలో 160 రకాల పక్షుల ఈకలు 400 పక్షుల అవశేషాలు ఉన్నాయి.వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్ అయిన ఈషా ఆర్నిథాలజి (పక్షుల శాస్త్రం) చదివారు.పక్షుల పరిరక్షణ కు నడుము కట్టారు.బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్ లో పక్షుల విభాగానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. వాతావరణంలో ఇమడలేక మరణించిన పక్షుల ఈ కల అధ్యయనం ద్వారా ఆమె వాటి సమస్యను తెలుసుకోగలుగుతారు.దేశంలో పర్యావరణ శాస్త్రవేత్తలే కాక ఇతర దేశాల నుంచి కూడా 638 మంది ఈ  లైబ్రరీ లో పక్షుల గురించి చూసేందుకు వస్తారు.