హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన గజాలా హష్మి ఇప్పుడు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ అయ్యారు తండ్రి ఉద్యోగరీత్యా నాలుగేళ్ల వయసులో అమెరికాలోని జార్జియా లోకి వచ్చిన గజాలా అమెరికన్ లో పి.హెచ్.డి చేశారు తర్వాత ప్రొఫెసర్ గా పని చేశారు. సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ స్థాపించి పదవీ విరమణ చేసే వరకు డైరెక్టర్ గా కొనసాగారు. 2019లో రాజకీయాల్లో ప్రవేశించి రిపబ్లికన్ ఉన్న స్టేట్ సెనేటి సీట్ లో సంచలన విజయం పొందారు. 2024లో సెనేట్ ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ కమిటీకి చైర్ పర్సన్ గా ఎంపికయ్యారు. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ గా గెలిచారు. ఈ పదవికి ఎంపికైన తొలి ముస్లిం మహిళ తొలి భారత అమెరికన్ గజాలా.













