పావురాళ్లు నగర జీవితంలో ఒక భాగం బాల్కనీ లు,ఎయిర్ కండిషనర్ యూనిట్ల దగ్గర గూళ్ళు కట్టుకొనే ఈ పావురాళ్ళ విసర్జకాలతో అనేక అనారోగ్యాలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పావురాళ్లు బాల్కనీలో గుళ్ళు పెట్టకుండా ఒకటి రెండు అద్దాలు గోడకు బిగిస్తే అలా ప్రతిఫలించే వస్తువుల జోలికి పావురాలు రావంటున్నారు. అలాగే తలుక్కున మెరిసే పాత సీడీలు కూడా వేలాడదీయచ్చు. ఘాటు వాసన వచ్చే లవంగ నూనె పుదీనా తో తయారు చేసిన స్ప్రే లు కూడా పావురాలను రానివ్వవు. పావురాళ్లతో పాటు వాటి వెంట ఇన్ఫెక్షన్ కలిగించే పరాన్న జీవులు ఇంట్లోకి వచ్చేస్తాయని గుర్తుపెట్టుకోవాలి.













