మహిషాసుర మర్దిని విశ్వరూపం చూడాలనుకుంటే ఉత్తరప్రదేశ్ లోని బృందావనం వెళ్లాలి అమ్మ శక్తి రూపాలన్ని ఏకమై అవతరించిన మాత వైష్ణో దేవి. 141 అడుగుల నిలువెత్తు విగ్రహం చూడొచ్చు. అలాగే విగ్రహం కింద గుహ వంటి అమ్మ వారి మందిరంలో నవదుర్గలను చూడొచ్చు. నవరాత్రుల్లో వేలాది భక్తులు దర్శించే ఈ జగన్మాత గుడిలో పండుగ అట్టహాసంగా జరుగుతుంది.













