ఒకప్పుడు సాంప్రదాయ నృత్యాలలో కళాకారిణులు ధరించే చెంపసరాలు తర్వాత వధువు అలంకరణ లో భాగం అయ్యాయి పెళ్లి సమయంలో బంగారం, కెంపులు ముత్యాలతో చేసే చెంపసరాలు ధరించటం ముఖ్యమైన అలంకరణ గా మారింది. ఆధునిక జీవనశైలిలో చీరలకంటే మోడ్రన్ డ్రెస్ లకే ప్రాధాన్యత కావటంతో ఈ చెంపసరాలు ఉపయోగించే వారి సంఖ్య తగ్గింది కానీ ఇప్పుడు మళ్లీ ప్రతి వేడుక, పండగలకు పట్టు చీరలు ఇతర నగలతో పాటు చెంప సరాలు కూడా ప్రత్యేకంగా అలంకరించి కుంటున్నారు అమ్మాయిలు. వజ్రాలు కెంపులతో తయారవుతున్న ఈ చెవి ఆభరణాలు ఎంతో అందంగా వస్తున్నాయి.













