వయసు 52. ఎత్తు మూడడుగులు. పిల్లలకు ప్రభావంతంగా తరగతులు చెప్పాలని ఉద్దేశం తో బెంచ్ ఎక్కి నిలబడి పాఠాలు చెబుతారు ఈ పంతులమ్మ ఆమె పేరు రీటా రాణి. పదేళ్లు ప్రైవేట్ టీచర్ గా పని చేసిన తర్వాత 2010 లో ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది బీహార్ లోని గాయా జిల్లా ధన్ బాద్ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసే రీటా రాణి స్టూడెంట్స్ లో చాలామంది, అధికారులు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు. ఆవిడ బోధన శైలి పిల్లల పట్ల ఆమె చూపే ప్రేమ శ్రద్ధకు అక్కడివారు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు.













