కేక్ కళాకారిణి ప్రాచి ధబల్ దేబ్. కేక్ తయారీని కథలు చెప్పే సాధనంగా మలుచుకున్నారు.పెద్ద కట్టడాలు కోటలు అచ్చంగా ఆ శిల్ప శైలి లోని నిలువెత్తుగా తయారు చేస్తారామె. ‘డ్యూమో డి మిలానో’ ఇటాలియన్ కేథడ్రల్ బార్బీ రెప్లిక 6.4 అడుగుల ఎత్తులో 46 అడుగుల వెడల్పు తో చేసే అది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నది. 2021 లో ప్రాచీ స్వదేశ్ సమ్మాన్ పురస్కారం అందుకున్నారు. ఆమె తయారు చేసే తీయని కేక్స్ ప్రాచీన కాలం నాటి తీపి గుర్తులు, సాంప్రదాయ కళల సమ్మేళనాలు కూడా.













