ఈ అమ్మాయి మెకానిక్

ఈ అమ్మాయి మెకానిక్

ఈ అమ్మాయి మెకానిక్

మహారాష్ట్ర కు చెందిన 14 ఏళ్ల కార్తీక రాయల్ ఎన్ ఫీల్డ్ మెకానిక్. ఆ వయసు పిల్లల లాగా ఆమె ఆటల్లో కాలక్షేపం చేయకుండా స్థానిక గ్యారేజ్ లో పనిచేసేది. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటూ తన కుటుంబానికి కాస్త ఆసరాగా ఉండేందుకు ఆమె గ్యారేజ్ పనిలో చేరింది. ఇంజన్ ఫిక్సింగ్ చేయటం నుంచి బైక్ సమస్యలు పరిష్కరించటం వరకు ఆమె అనుభవం ఉన్న మెకానిక్ లాగా పనిచేయగలదు. ఎంతోమంది మెకానిక్ లు ఎన్ ఫీల్డ్ ను బాగు చేయటం సవాల్ అనుకుంటారు కానీ కార్తీక ఈ రిపేరింగ్ కళలో ప్రావీణ్యం సంపాదించింది. చక్కగా చదువుకుంటుంది కూడా.