పిలాంథ స్ విర్గాటస్ అనే శాస్త్రీయ నామం తో పిలిచే ఉబ్బి ఉసిరి మొక్క ఆకుల్లో బంగారు కణాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు గుబురుగా పెరిగే ఈ మొక్క ఎర్రని పువ్వులు చిన్న కాయలు ఉంటాయి మొదట పచ్చగా ఉన్న కాయలు పండిన తర్వాత బ్రౌన్ రంగులో ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ మొక్కను చర్మ సంబంధిత సమస్యలకు పరిష్కారం గా వాడుతారు కొత్తగా ఆకుల్లో నానో బంగారు కణాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు మొక్కను పెంచుకునేందుకు పెద్దగా నీళ్ల అవసరం కూడా ఉండదు













