• జీవితంలో ఎప్పుడూ సంతోషాలే వుండవు. ఎన్నో సవాళ్లు అనుభవాలు అనుభూతుల సంగమం జీవితం. సినీ నటి త్రిష ఈ మధ్య కాలంలో హండ్రెడ్ హ్యాపీ డేస్ ఛాలెంజ్ తీసుకుందిట. ఈ ఛాలెంజ్ కు వప్పుకునే వంద రోజుల పాటు ఎలాంటి విషయానికీ బాధ పడకుండా ఎప్పుడూ సంతోషంగా కనిపించాలి. ప్రతి ఒక్కరితో సంతోషాన్ని ఆత్మ విశ్వాసాన్ని సానుకూల దృక్పధాన్ని పెంచే దృష్టితో హండ్రెడ్ హ్యాపీ డేస్ సంస్థ ఈ పోటీ ని నిర్వహిస్తోంది. అందరితో ప్రేమగా ఉత్సాహంగా ఉండాలని తీర్మానించుకుని ఈ ఛాలెంజ్ తీసుకున్నా అన్నారు త్రిష. గతంలో ఈమె నో మేకప్ ఛాలెంజ్ తీసుకుని చాలా రోజులపాటు మేకప్ లేకుండానే బయట కార్యక్రమాల్లో పాల్గొన్నారట. ఇలాంటి ఛాలెంజ్ లు వప్పుకుంటే జీవితంలో నిరాశ అన్న పదం కాస్త దూరం జరుగుతుందేమో !

    వంద రోజులు సంతోషంగా ఉంటా

    జీవితంలో ఎప్పుడూ సంతోషాలే  వుండవు. ఎన్నో సవాళ్లు అనుభవాలు అనుభూతుల సంగమం జీవితం. సినీ నటి త్రిష ఈ మధ్య కాలంలో హండ్రెడ్ హ్యాపీ డేస్ ఛాలెంజ్…

  • పిల్లల్ని సరదాగా ముద్దు పేర్లతో పిలుస్తాం. ఒక్కసారి ఆ ముద్దు పేర్లే అసలు పేర్లను డామినేట్ చేసి జీవితాంతం నిలబడిపోతాయి కూడా. మనందరికీ ఏవో ముద్దు పేర్లు వుండే ఉంటాయి.అలాగే మనం ఇష్టపడే సెలబ్రెటీస్ కూడా ముద్దు పేర్లున్నాయి. సమంతను ఏమాయచేసావే సిఎంమాలో నటించాక అందులో హీరోయిన్ పేరుతోనే జెస్సీ అని సామ్ అని పిలుస్తారట ఫ్రెండ్స్. హన్సిక కు తమిళ్ లో చిన్న ఖుష్భు అని పిలుస్తారు. అమలాపాల్ ని ఆమ్స్ ,ఆము , బ్రాట్ అని స్నేహితులంటారు. కాజల్ ని ఇంట్లో అందరూ కాజు అంటే త్రిష నయితే హానీ అంటారు. తమన్నా ని తమ్ము అనేస్తారు. ఇక అనుష్క అసలు పేరే స్వీటీ శెట్టి . తనను స్వీటీ అనే పిలుస్తారు. నయన తార ను కుటుంబ సభ్యులు మణీ అని స్నేహితులు నయన్ అని ఇలియానా ను ఇలూ అయింది. శ్రద్ధ దాస్ ని వాళ్ళ బామ్మ మాకడ్ అంటే కోతి ని ట్రిమ్ చేసి మాకూ అని పిలుస్తుందిట. సోనమ్ కపూర్ ని వాళ్ళ నాన్న జిరాఫీ అంటారట. ఐశ్వర్య రాయి ని ఇషూ , గోల్లు, ఐస్ అంటారట. కరీనా కపూర్ ని బెబో , ప్రియాంక చోప్రా ని మీమీ అంటారు. ఇంకెన్నో ఎందరో పేర్లు సరదాగా వినబడుతూనే ఉంటాయి.

    మీ ముద్దు పేరేమిటి

    పిల్లల్ని సరదాగా ముద్దు పేర్లతో పిలుస్తాం. ఒక్కసారి ఆ ముద్దు పేర్లే అసలు పేర్లను డామినేట్ చేసి జీవితాంతం నిలబడిపోతాయి కూడా. మనందరికీ ఏవో ముద్దు  పేర్లు…

  • అరటి ,సీతాఫలం, పనస ,సపోటా పై తోలు ఎలాగున్నా లోపల దాదాపు తెల్లగా గోధుమ రంగులతో ఉంటాయి కదా. కానీ ఇప్పుడు గజ్జి ప్రకాశవంతమైన రంగులో ఉంటే పోషకాలు పంట పండినట్లేనని లోపల మంచి రంగు ఉండే పండ్ల పెంపకం పై దృష్టిపెట్టారు రైతులు. మౌంటెన్ రోజ్ యాపిల్ కొరికి చుస్తే గులాబీ రంగులోనో ఎర్రగానో ఉంటుంది. క్యారెట్ ,బననా అయితే నారింజ రంగు గుజ్జు ఉంటుంది.ఇందులో బీటా కెరోటిన్లు వంద రెట్లు ఎక్కువ. అలాగే అనోనా రెటిక్యూ లేటా ,సీతా ఫలం మొత్తం పండు గుజ్జు రెండు ఎరుపే. మామే సపోటా లో కూడా ఎరుపు రంగు గుజ్జె.చెంబరాతి చెక్క లేదా చంద్ర హలసు పేరుతొ వుండే బ్లడ్ ఆరంజస్ ,ఆరెంజ్ గ్లో పేరుతో నారింజ పసుపు రంగుగల పుచ్చ ఇలా పండ్లే కాదు రకరకాల వాల్ నట్స్ కూడా రంగు మారిపోతున్నాయి. మరి రంగుల్లో పోషకాలుంటాయని డాక్టర్లు చెప్పేసారు కదా .

    పేర్లు సేమ్ రంగే రెడ్

    అరటి ,సీతాఫలం, పనస ,సపోటా పై తోలు ఎలాగున్నా లోపల దాదాపు తెల్లగా గోధుమ రంగులతో ఉంటాయి కదా. కానీ ఇప్పుడు గజ్జి ప్రకాశవంతమైన రంగులో ఉంటే…

  • ఎప్పుడూ ఆడవాళ్ళలో ఒక ఆందోళన ..... ఎవరేమనుకుంటారో ? అర్ధం చేసుకుంటారో లేదో ......... ఎలా నచ్చ జెప్పాలో ఏమో ? ఇవే ప్రశ్నలు. సమాధానం లేనివి. ఇలాంటి ఆందోళనలు ఉంటె ఒంటరిగా ప్రయాణాలు చేయండి. కొద్దీ రోజులే. పర్యటనలు మనకు ఆలోచించే సమయం ఇవ్వవు . రైలో ,బస్సో ,విమానమో, దాని టైం ప్రకారం మనం పట్టుకోవాలి. కొత్త చోట మన గురించి మనం బాధ్యత తీసుకోవాలి. అలాంటప్పుడే ధైర్యం వస్తుంది. మనం కొత్త ప్రదేశంలో ఎవ్వరికీ ఏ ప్రశ్నకు జవాబు ఇవ్వక్కరలేదు. భయపడక్కర్లేదు. ఇలాగే ఒకటి రెండు ఒంటరి ప్రయాణాలు చేయండి. అసలు మనసులో వచ్చే అనేకానేక ఆందోళనలకు, సమస్యలకు, భయాలకు జవాబులు దొరుకుతాయి అంటునాన్రు నిపుణులు. ఒక కొత్త చోటు ,కొత్త మనుషులు, కొత్త నిర్మాణాలు ప్రపంచంలో అందమైన ప్రదేశాలు ,ఇష్టమైతే గుళ్ళు ,గోపురాలు ఏవైనా సరే వివిధ జీవనశైలులు భాషలు ఆ సమయంలో ఎదురయ్యే చిన్న ఇబ్బందులు మనల్ని దృఢంగా చేస్తాయి నిజం. ఆందోళనలు మాయం కావాలంటే స్థిరంగా ఆలోచించే ధైర్యం కావాలంటే ఒంటరి ప్రయాణాలు చేయండి.

    ఒంటరి ప్రయాణాలలో ఆందోళన మాయం

    ఎప్పుడూ  ఆడవాళ్ళలో ఒక ఆందోళన ….. ఎవరేమనుకుంటారో ? అర్ధం చేసుకుంటారో లేదో  ………  ఎలా నచ్చ జెప్పాలో ఏమో ? ఇవే ప్రశ్నలు. సమాధానం లేనివి.…

  • మేకప్ ట్రెండ్ మారిపోతూ వుంటుంది. ఫ్యాషన్ నిలకడగా నిలబడేది కాదు. ప్రతి నిమిషం ఒక కొత్త పోకడ ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రత్యేకత నిలుపుకోవాలి అంటే కొత్తదనం కోసం పరుగులు తీస్తూనే ఉండాలి. అందుకు తగ్గట్లే దుస్తులు అలంకరణ వస్తువులు క్షణికో ఫ్యాషన్ ట్రెండ్ లో ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి. డ్రెస్ కి మ్యాచయ్యే గోళ రంగు వేసుకోవాలి అనుకుంటారు అమ్మాయిలు. ఇప్పుడు ఆ మ్యాచింగ్ కలరే పెదవుల పైకి రావాలంటే ! ఇదిగో క్షణాల్లో దిగుమతి అయిపోయింది. మ్యాచింగ్ వెతుక్కునే పని లేకుండా ఒకే షేడ్ లో వుండే లిప్ స్టిక్ ,నెయిల్ పాలిష్ తయారు చేసారు కొన్ని సంస్థలు. ఇక అమ్మాయిలు సంతోషించరా ? డ్రెస్ కి యాక్సెసరీస్ మ్యాచింగ్ అలాగే లిప్ స్టిక్ కి నెయిల్ పాలిష్ కి మ్యాచింగ్. మొత్తంగా ఫుల్ మ్యాచింగ్!

    అన్నీ మ్యాచింగ్ మ్యాచింగ్

    మేకప్ ట్రెండ్ మారిపోతూ వుంటుంది. ఫ్యాషన్ నిలకడగా నిలబడేది కాదు. ప్రతి నిమిషం ఒక కొత్త పోకడ ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రత్యేకత నిలుపుకోవాలి అంటే కొత్తదనం…

  • ఏదైనా రంగంలో తమదైన ముద్ర వేసిన వాళ్ళ పేర్లను నాసా కొత్తగా కనిపెట్టే గ్రహాలకు పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆ గౌరవం పొందిన వాళ్లలో ఇద్దరు భారతీయ యువతలున్నారు. పూణే కు చెందిన హంస పద్మనాభన్ పేరుతో పైన ఓ చిన్న గ్రహం పేరు హంస 21575. హంస అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో జరిగిన సైన్స్ ఫెయిర్ లో ఫిజిక్స్ లో అయస్కాంత శక్తికి సంబంధించిన కొన్ని అంశాల గురించి చెప్పిన విషయాలు అక్కడ మహా మహా శాస్త్ర వెతల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఆ ప్రతిభ కు గుర్తింపుగా అంతరిక్షంలోని చిన్న గ్రహానికి ఆమె పేరు పెట్టారు. ఇక హీతల్ వైష్ణవ్ అనే అమ్మాయి రీసైకిల్ చేసేందుకు కూడా పనికిరాని కవర్లను ప్రయోగాలుచేసి కొన్ని రసాయనాలతో కలిపి మళ్ళీ ప్యాకింగ్ కు ఉపయోగపడేలా చేసింది. ఆమె పేరు ఫ్రేహం 25636 వైష్ణవ్.

    మన అమ్మాయిల పేర్లతో గ్రహాలు

    ఏదైనా రంగంలో తమదైన ముద్ర వేసిన వాళ్ళ పేర్లను నాసా కొత్తగా కనిపెట్టే గ్రహాలకు పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆ గౌరవం పొందిన వాళ్లలో ఇద్దరు భారతీయ…

  • అన్ని విషయాల్లో స్వేచ్చ కావాలి అమ్మాయిలకు. అలాగే డ్రెస్ విషయంలో కూడా. స్టేట్ మెంట్స్ ఇలా ఉంచితే నిజంగానే రెక్కలోచ్చినట్టు ఆ రెక్కలతో హాయి గా విహరిస్తున్నట్లు కనిపించే బటర్ ఫ్లై స్లీవ్స్ టాప్ లు వచ్చాయి మార్కెట్లోకి. ఏ కుర్తినో కమీజ్ వేసుకుంటే వంటికి చెక్కగా వచ్చేయాలి అంటారీ అమ్మాయిలు లేదా మోడ్రన్ టాప్స్ లో వేస్తే వదులుగా ఈజీ గా వుండాలి అంటారు. అందుకే డిజైనర్లు ఈజీగా కనిపెట్టేసారు. స్లీవ్స్ టాప్స్ ని పొడవు చేతుల కుర్తిలు, అనార్కలి ఫ్యాషన్ తో విసిగిపోయిన అమ్మాయిలకు రెక్కల డిజైన్ తో పెద్ద ప్రింట్ల తో ఈ టాప్ లు తెగ నచ్చేస్తున్నాయిట.

    అచ్చం సీతాకోకచిలుకల్లాగే

    అన్ని విషయాల్లో స్వేచ్చ కావాలి అమ్మాయిలకు. అలాగే డ్రెస్ విషయంలో కూడా. స్టేట్ మెంట్స్ ఇలా ఉంచితే నిజంగానే రెక్కలోచ్చినట్టు ఆ రెక్కలతో హాయి గా విహరిస్తున్నట్లు…

  • 70 ఏళ్ళ ఇడి, ప్రోన్ కు పెళ్లి అయ్యి 52 సంవత్సరాలు. పెళ్ళి అయ్యాక ఇద్దరు ఒకే రకం డ్రెస్సులు ప్రతి రోజు వేసుకుందాం అనుకున్నారంట. ఇద్దరు కలసి బయటకు వెళ్ళినా బయట ఫ్రెండ్స్, బంధువులతో కలిసినా సేమ్ డ్రెస్ తోనే కనిపిస్తారు. ఈ విషయాన్ని 17 సంవత్సరాల వాళ్ళ మనుమడు ఆంటోని పోస్ట్ చేస్తే 38000 మంది షేర్ చేసారట. ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయి, నేషనల్ మీడియా ఇంటర్వ్యూ చేసిందట. ఆ భార్య భర్తలు ఒకే రకమైన డ్రెస్సులో క్యుటగా వుంటారు. వాళ్ళ ప్రేమ అనురాగం అలా కనపడతంలోనే తెలుస్తుంది అని ఆంటోని ఇంటర్వ్యూ ల్లో చెప్పారట. 52 సంవత్సరాల పాటు ఇలా ఒకే లాంటి డ్రెస్లో కనిపించడం సరదాగా లేదు.

    వాళ్ళిద్దరూ ఒకేలా

    70 ఏళ్ళ ఇడి, ప్రోన్ కు పెళ్లి అయ్యి 52 సంవత్సరాలు. పెళ్ళి అయ్యాక ఇద్దరు ఒకే రకం డ్రెస్సులు  ప్రతి రోజు వేసుకుందాం అనుకున్నారంట. ఇద్దరు…

  • మంచి పార్టీలకు పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు అమ్మాయిలు మెరిసే పర్సులు తీసుకుని వెళ్తూ వుంటారు. ఇప్పుడు కొత్తగా ఫింగర్ రింగ్ క్లచెస్ వచ్చాయి. ఈ పర్స్ గనుక చేతిలో పట్టుకుంటే చేతులకి ఉంగరాలు పెట్టుకునే పని లేదు. అచ్చం వేళ్ళకు ఉంగరాలు పెట్టుకునట్లే ఈ క్లచెస్ వుంటాయి. ఒక ఉంగరం మొదలు నాలుగు ఉంగరాల వరకు వుండే ఈ క్లచెస్ లో రత్నాలు పొదిగినవి, బంగారం, ప్లాటినం ఉంగరాలు బ్యాగ్ కే కనక్టయి వుంటాయి. ఇలాంటి ఖరీదైన క్లచెస్తో పాటు పుర్రల్లాంటి ఫంకీ డిజైన్లు కూడా వున్నాయి అనుకోండి కానీ డ్రెస్ ని బట్టి అందమైన ఖరీదైన పర్సులు, దాని పైన వున్న వేళ్ళతో మార్చుకుంటే మెరిసి పోయే వజ్రాలు రత్నాలు వున్న ఈ ఉంగరాల పర్సులు మార్కెట్లో వున్నాయి.

    ఉంగరాల పర్సులోచ్చాయి

    మంచి పార్టీలకు పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు అమ్మాయిలు మెరిసే పర్సులు తీసుకుని వెళ్తూ వుంటారు. ఇప్పుడు కొత్తగా ఫింగర్ రింగ్ క్లచెస్ వచ్చాయి. ఈ పర్స్ గనుక చేతిలో…

  • తెల్ల ద్రాక్ష ,నల్ల ద్రాక్ష రంగేదైనా కానివ్వండి తినేందుకు ఎంత బావుంటాయి సౌందర్య పోషణలో అంతే కీలకపాత్ర పోషిస్తున్నాయి. ద్రాక్ష పండ్లు సహజ క్లీన్సర్లుగా పనిచేసి చర్మం పై ఉండే మురికి పోగొడతాయి. కాబట్టి సౌందర్య నిపుణులు చర్మ రక్షణలో భాగంగా అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ఎండలో ముఖం వాడిపోతే కప్పు ద్రాక్షపండు గుజ్జులో టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసుకుంటే పది పదిహేను నిమిషాల్లో మొహం తేటగా అయిపోతుంది. వయసు పెరగటం వాళ్ళ వచ్చే మడతల్ని కూడా ఈ ద్రాక్ష గజ్జి మాయం చేస్తుంది. ప్రతి రోజూ రాసుకున్నా నష్టం ఏవీ లేదు. ద్రాక్ష గుజ్జులో పెరుగు తేనె కలిపి మాస్క్ వేసుకున్నా ముఖం మృదువుగా కనిపిస్తుంది. పొడి చర్మం గలవాళ్ళు ద్రాక్ష గుజ్జులో పచ్చి సోనా కలిపి మాస్క్ వేసుకుంటే మొహం తేమగా ఉంటుంది.

    అందానికి రక్ష ద్రాక్ష

    తెల్ల ద్రాక్ష ,నల్ల ద్రాక్ష రంగేదైనా కానివ్వండి తినేందుకు ఎంత బావుంటాయి సౌందర్య పోషణలో అంతే కీలకపాత్ర పోషిస్తున్నాయి. ద్రాక్ష పండ్లు సహజ క్లీన్సర్లుగా పనిచేసి చర్మం…