• ఈ రోజుల్లో అన్నీ డిజైనర్ వెరైటీస్ చివరకు పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ తో సహా నిశ్చితార్ధం నుంచి రెసెప్షన్ వరకు వాడే వస్తువులతో పాటు సారెలు హారతి పళ్ళాలు కొబ్బరిబొండాం ,కళాశాలు ,పీటలు , అన్ని రంగుల రాళ్లతో డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు డిజైనర్ కొబ్బరి బొండాం పట్టుకుని పెళ్లి మాటకొస్తే లేసు దారాలతో అల్లిన వెండి చెంబుతో కాళ్లు కడుగుతారన్నమాట. పూలు, పండ్లు ,మిఠాయిలు, పసుపు ,కుంకుమ నగలు ఉంచిన ట్రేలు కూడా డిజైనర్ వే. హారతి పళ్ళాలు అలివేణి కుందులు కాశీ యాత్రలో కనిపించే కావిళ్ళు, చెంబులు, గొడుగులు , సర్వం సర్వాలంకారాలతో దర్శనం ఇస్తున్నాయి. పెళ్లి జ్యూవెలరీ పెళ్లి సంప్రదాయ వస్తువులు ఈ డిజైనర్ ఐటమ్స్ ఆన్ లైన్లో హాయిగా చూడచ్చు. పోనీ జాగరీ డిజైన్ ఫర్ వెడ్డింగ్ అని కొట్టి చూడండి

    డిజైనర్ కల్యాణ సామాగ్రి

    ఈ రోజుల్లో అన్నీ డిజైనర్ వెరైటీస్ చివరకు పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ తో సహా నిశ్చితార్ధం నుంచి రెసెప్షన్ వరకు వాడే వస్తువులతో పాటు సారెలు  హారతి…

  • ఎన్టీఆర్ స్టేడియం లో భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సి.ఎం. కె.సి.ఆర్. దంపతులు పాల్గొన్నారు.నిర్వాహకులు కైలాసాన్ని తలపించే ఏర్పాట్లు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఇంద్ర కరణ్ రెడ్డి, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి ఎల్.వి. రమణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు, పీఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    కోటి దీపోత్సవంలో కె.సి.ఆర్. దంపతులు

    ఎన్టీఆర్ స్టేడియం లో భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సి.ఎం. కె.సి.ఆర్.…

  • పుట్టుకతోనే గొంతుదాకా మునిగిపోయిన ఊబి లాంటిది దామిని సేన్ జీవితం. పుట్టుక తోనే రెండు చేతులు లేవు. చత్తీస్ ఘడ్ లోని రాయపూర్ కు చెందిన దామిని సేన్ ను అందరూ వింతగా చూస్తే వాళ్ళ అమ్మానాన్న మేమే ఆమె రెండు చేతులూ అన్నారు. ఆమెను గురుకుల పాఠశాలలో చేర్చారు. పదవ తరగతిలో దామిని సేన్ 80 శాతం మార్కులు సాధించింది. చక్కగా బొమ్మలేస్తుంది. కాలి వేళ్ళతో ఒక గంటలో 38 బొమ్మలు గీసి గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించింది. కాలి గోటితోనే ఎన్నెన్నో రికార్డులు సాధించింది. ఇంటి పనుల్లో తల్లికి సాయం చేస్తుంది. అన్ని అవయవాలు చక్కగా ఉన్నా చివరికి బాగా చదివేందుకు కూడా బద్దకించే ఎంతో మంది అమ్మాయిలు 12వ తరగతి చదువుతున్న దామిని సేన్ ను స్పూర్తిగా తీసుకోవాలి.

    కాలి వేళ్ళతో గంటలో 38 బొమ్మలు

    పుట్టుకతోనే గొంతుదాకా మునిగిపోయిన ఊబి లాంటిది దామిని సేన్ జీవితం. పుట్టుక తోనే రెండు చేతులు లేవు. చత్తీస్ ఘడ్ లోని రాయపూర్ కు చెందిన దామిని…

  • చిన్న చిన్న అకేషన్లతో వన్ గ్రామ్ గోల్డ్ వీ ఫంకీ నగలు బహుమతిగా ఇస్తూవుంటాం. అలా సాదాసీదాగా ఒక చిన్న బహుమతే ఇది తెలిసేలా ఇచ్చే పనిలేదు. ఫంకీ నగల్లాగే ఫంకీ జ్యూవెలరీ బాక్స్ లు బోలెడన్ని రకాలున్నాయి. మాములు పెట్టెల్లో బదులు రకరకాల రూపాల్లో వస్తున్నాయి. ఫంకీ డిజైనర్ గిఫ్ట్ బాక్స్ లో పెట్టి ఇస్తే చూసేందుకు బావుంటుంది. ఇవన్నీ షోకేస్ లో పెట్టుకునేంత బావున్నాయి మంచి గులాబీ పువ్వులాగా చక్కని గిటార్ లాగా ముచ్చటగా కనిపించి జంతువుల బొమ్మల్లాగా ఇలా డిజైనర్ బాక్స్ ల్లాగా ఎన్నో వెరైటీస్ వస్తున్నాయి. అంటే పెట్టె లోపలి కానుక కంటే పెట్టే అందంగా ఉంటుందన్నమాట!

    ఫంకీ నగల పెట్టలున్నాయి

    చిన్న చిన్న అకేషన్లతో వన్ గ్రామ్ గోల్డ్ వీ ఫంకీ నగలు బహుమతిగా ఇస్తూవుంటాం. అలా  సాదాసీదాగా ఒక చిన్న బహుమతే ఇది తెలిసేలా ఇచ్చే పనిలేదు.…

  • ఆరోగ్యం కోసం ఏం తినచ్చో ఏం తాగచ్చో నిరంతరం సలహాలు వింటూనే వుంటాం. కానీ వీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాపడితే అలా తినకూడదు అంటారు డైటీషియన్లు. నట్స్ లో పీచు, ప్రోటీన్లు, ఖనిజాలు ఎక్కువే. కానీ వీటిని తీపి పదార్ధాలతో కలిపి తీసుకోకూడదు. పండ్లతో కలిపి, ఓట్స్ తో కలిపి తినాలి. పండ్లు జీవ క్రియల వేగాన్ని మెరుగుపరుస్తాయి. కానీ వీటిని ఉదయం వేళ అల్పాహారంతోనో, మధ్యాహ్నం భోజనం అయ్యాక తినాలి. భోజనానికి ముందు తినకూడదు. నెయ్యి భోజనానికి రుచి ఇస్తుంది.కానీ నేతితో బ్రెడ్, పరోటాలు కాల్చకూడదు. అప్పుడు దానిలోని పోషక విలువలు పోతాయి. చపాతీలు, పరోటాలు కాల్చాక వాటిపై రాస్తే రుచి, ఆరోగ్యం. సాంబారు, పప్పు తాలింపుగా నెయ్యి వాడితే వాటికి అదనపు రుచి వస్తుంది.

    కొన్నింటిని అన్నింటితో కలపద్దు

    ఆరోగ్యం కోసం ఏం తినచ్చో ఏం తాగచ్చో నిరంతరం సలహాలు వింటూనే వుంటాం. కానీ వీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాపడితే అలా తినకూడదు అంటారు డైటీషియన్లు.…

  • మనం తీసుకొనే ఆహారం ఎప్పుడూ మనం చేసే పనిపైనే బాలన్స్ అవుతూవుంటుంది. స్త్రీల జీవన సరళిలో ఇంటి పని, చేస్తే ఉద్యోగం, పిల్లల్ని కనడం, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడం వంటి అనేక పనులు కలిసి వుంటాయి. అలా తీరిక లేని పనులు చేసే స్త్రీలు వాళ్ళు తీసుకునే ఆహారం, చేయాల్సిన వ్యాయామం పట్ల దృష్టి పెట్టరు. సమయం పాటించని ఆహారపు అలవాట్లు, శరీరానికి తగినంత పోషణ, వ్యాయామం ఇవేవీ వుండని కారణంతోనే వాళ్ళు ఫిట్ నెస్ తో వుండరు. పెళ్ళయి పిల్లలున్న చాలామంది ఆడవాళ్ళు బరువు పెరిగే కనిపిస్తుంటారు. అందుకే డైట్ లో ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. వయసు కనిపించకుండా ఉండాలంటే నిత్యం వ్యాయామాలు కూడా చేయాలి. ఆఫీస్ లో పని మధ్యలో కాసేపు నడవడం, మెట్లు ఎక్కి దిగటం, స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు చేయడం చాలా అవసరం. తరచూ స్పా కు వెళ్ళటం, క్రమం తప్పని హెల్త్ చెకప్స్, మంచి పుస్తకం చదువుకోవడం, పచ్చని ప్రకృతిలో కాసేపు నడవటం ఇవన్నీ చేస్తేనే ఫిట్ గా వుంటారు.

    ఫిట్ నెస్ మంత్రాన్ని మర్చిపోతున్నారు

    మనం తీసుకొనే ఆహారం ఎప్పుడూ మనం చేసే పనిపైనే బాలన్స్ అవుతూవుంటుంది. స్త్రీల జీవన సరళిలో ఇంటి పని, చేస్తే ఉద్యోగం, పిల్లల్ని కనడం, ఇంట్లో పెద్దవాళ్ళని…

  • టొమాటోలు మన రెగ్యులర్ ఫుడ్ లో ముఖ్యంగా ఉంటాయి. కానీ అవి చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయి అంటున్నారు నిపుణులు. కొందరికి మోహంలో చర్మ గ్రంధులు పెద్దవిగా అవుతాయి. రెండు స్పూన్ల నిమ్మరసంలో రెండు చెంచాల టొమాటో రసం కలిపి ముఖం పైన రాసుకుంటే ఈ సమస్య పోతుంది. ఎండాకాలం కమిలిపోయిన చర్మానికి కూడా టొమాటో రసంలో మజ్జిగ కలిపి మర్దన చేస్తే చర్మం మెరుస్తుంది. టొమాటో ని ముద్దగా చేసి ముఖంపై రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేసి మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మొటిమలు పోతాయి. చర్మం నిగారింపు కోసం టొమాటో గుజ్జు తేనే కలిపి చర్మానికి రాసి పది నిముషాలు ఆరనిచ్చి కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది,

    చర్మ రక్షణకు టొమాటో

    టొమాటోలు మన రెగ్యులర్ ఫుడ్ లో ముఖ్యంగా ఉంటాయి. కానీ అవి చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయి అంటున్నారు నిపుణులు. కొందరికి మోహంలో చర్మ గ్రంధులు పెద్దవిగా…

  • 1916లో ఒక నర్స్ గా పనిచేస్తున్న మార్గరెట్ శాంగర్ ని కొన్ని కరపత్రాలు పంచిన కారణంగా అరెస్ట్ చేశారు.జైల్లో పెట్టారు. కానీ అదే కరపత్రాల్లోని విషయాలు జైల్లో అందరికి బోధించారు. ఇంతకీ ఆ కరపత్రాల్లో ఏముందంటే కుటుంబ నియంత్రణ సలహాలున్నాయి. ఆ రోజుల్లో అలాంటి విషయాలు చెప్పటం నేరం. కానీ శాంగర్ ధైర్యంగా ప్లాన్డ్ పేరెంట్ హుడ్ అన్న సంస్థని స్థాపించింది. ఆ కేంద్రం ప్రపంచ వ్యాప్త ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమం మొదలై అక్టోబర్ నేలతో వందేళ్ళు. శాంగర్ ఉద్యమం చేపట్టడానికి కారణం ఆమె తల్లి 22 సార్లు గర్భం ధరించి తీవ్రమైన అనారోగ్యంతో 49 ఏళ్లకే చనిపోయిందట. శాంగర్ ఆ పిల్లల్లో ఆరో అమ్మాయి. ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేపట్టి శాంగర్ భారతదేశం వచ్చి మహాత్మాగాంధీ తోనూ సమావేశమైంది. ప్లాన్డ్ పేరెంట్ హుడ్ ప్రస్తుత అధ్యక్షులు సిసిలీ రిచర్డ్స్. ఇప్పటికీ చాలా మంది నిరుపేద మహిళలకు ఈ ఉద్యమం అందలేదంటుంది సిసిలీ రిచర్డ్స్.

    శాంగర్ ఉద్యమానికి వందేళ్ళు

    1916లో ఒక నర్స్ గా పనిచేస్తున్న మార్గరెట్ శాంగర్ ని కొన్ని కరపత్రాలు పంచిన కారణంగా అరెస్ట్ చేశారు.జైల్లో పెట్టారు. కానీ అదే కరపత్రాల్లోని విషయాలు జైల్లో…

  • అనన్య జాతీయ స్థాయి ఆర్చరీ ఛాంపియన్. జర్నీ, అఆ వంటి సినిమాల్లో నటించిన అనన్య రెండు సార్లు కేరళ ఆర్చరీ ఛాంపియన్ గా బంగారు పతకాలు అందుకుంది. ఓ సారి బండి పైనుంచి పడి, ఇంకో ప్రమాదంలో మోచేతికి గాయమై ఈ విలు విద్య క్రీడకు దూరమైంది. కానీ ఇప్పుడు సినీ రంగoలో బిజీ అయ్యాక కుదన్ అనన్య కు విలువిద్య పైనున్న ఇష్టం తగ్గలేదు. ఎర్నాకులం జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో బరిలోకి దిగింది. మహిళల రిజర్వ్ విభాగంలో మరో బంగారు పతకం సాధించి నేషనల్ ఛాంపియన్ షిప్ కు అర్హత పొందింది. దీపికా కుమారి వంటి ఒలింపిక్ ఛాంపియన్స్ తో పోటీ పడటం విశేషం. ఫోటో షూట్స్ లో కనిపించే ఈ అమ్మాయి స్పోర్ట్స్ పేజీలో కనిపించడం విశేషం. అనన్య అసలు పేరు అయిల్య గోపాలకృష్ణన్ నాయర్.

    క్రీడాకారిణి ఈ హీరోయిన్

    అనన్య జాతీయ స్థాయి ఆర్చరీ ఛాంపియన్. జర్నీ, అఆ వంటి సినిమాల్లో నటించిన అనన్య రెండు సార్లు కేరళ ఆర్చరీ ఛాంపియన్ గా బంగారు పతకాలు అందుకుంది.…

  • సమాజం గురించి ఒక్క నిమిషమైనా ఆలోచించడం, అవసరంలో ఉన్నవారికి సాయపడటం సామాజిక భాద్యత. కాకినాడలో ఉన్న కొందరు గృహిణులు ‘ తపన హెల్పింగ్ హ్యాండ్స్’ సంస్థను స్థాపించారు. కొన్ని సంస్థలను కలిశారు. అక్కడ వుండే పిల్లలకు, టీచర్లకు ఎన్నో రకాల సాయాలు చేస్తారు. పిల్లల కోసం పుస్తకాలు కొంటారు, భోజనాలు పెడతారు. టీచర్స్ కు ఇంకొంత జీతం ఇస్తారు. మానసిక వికలాంగుల పాఠశాలకైతే చాలా అందిస్తారు. పది మందీ పది చేతులు వేసి వికలాంగులకు చక్రాల కుర్చీలు, విస్తరాకులు కుట్టే యంత్రాలు వంటివి అందిస్తారు. ఈ సంస్థలో వంద మంది సభ్యులున్నారు. బంధు మిత్రుల సాయంతోనే విరాళాలు పోగు చేసి చేతనైన సాయం చేస్తూ సమాజానికి తమ వంతు సాయం చేస్తున్నారు.

    తలో చేయి వేస్తారు

    సమాజం గురించి ఒక్క నిమిషమైనా ఆలోచించడం, అవసరంలో ఉన్నవారికి సాయపడటం సామాజిక భాద్యత. కాకినాడలో ఉన్న కొందరు గృహిణులు ‘ తపన హెల్పింగ్ హ్యాండ్స్’ సంస్థను స్థాపించారు.…