• ముంబాయిలో లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ 2016 కార్యక్రమంలో లక్స్ తన మోడలింగ్ తారలను అవార్డులతో సత్కరించింది. నాటి తార షర్మిలా టాగోర్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, కరీనాకపూర్ కు గ్లామర్ దివా అవార్డు, దీపికా కు ఐకానిక్ లుక్ అవార్డు ఇచ్చారు. పూజా హిగైకు బెస్ట్ డెబ్యు అవార్డు బహుకరించారు. లక్స్ మొట్టమొదట 1899 లో బ్రిటన్ లో ఒక లాండరీ షాప్ గా మొదలైంది. లక్స్ బ్రాండ్ ప్రచారంలో బ్లాక్ అండ్ వైట్ నాటి హీరోయిన్ సురయ్య దగ్గరనుంచి షర్మిల, హేమామాలిని నందా సాదన్, సైరా భాను, జయ ప్రాధ, శ్రీదేవి, ఐశ్వర్యా రాయ్ వంటి స్టార్ డమ్ వున్న హీరోయిన్లందరూ మోడల్ గా కనిపించరు.

    లక్స్ మోడల్స్ కు అవార్డుల తో సత్కారం

    ముంబాయిలో లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ 2016 కార్యక్రమంలో లక్స్ తన మోడలింగ్ తారలను అవార్డులతో సత్కరించింది. నాటి తార షర్మిలా టాగోర్ కు లైఫ్ టైమ్…

  • బీరు తాగటం లేదా బీరు లాంటి ఉత్పాదనలు అమ్మే షాపులు ఇవన్నీ పురుషుల ప్రత్యేక ప్రపంచానికి చెందినవి. కానీ బీరు తయారుచేసింది దాన్ని ఉపాధిగా చేసుకుంది మహిళలే. మెసపొటేమియా మహిళలు మొదటి;ఓ పదివేల సంవత్సరాలకు పూర్వం గుమ్మడి పండు చెరుకు పిప్పి అడవి తేనె తదితర వస్తువులతో ఇళ్లలో తయారుచేసుకునేవాళ్లట. ఆ ఆకాలంలో దాన్ని దేవత ప్రసాదంగా భావించి తీసుకునేవాళ్ళు. మహిళలు దాన్ని తయారు చేసి అమ్మి ఆ సొమ్ముతో ఇంటికి కావలిసిన వస్తువులు తెచుకునేవాళ్లట. అటు తర్వాత 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం తర్వాత బీరు తయారీలో ఎన్నో మార్పులు. తయారీ కోసం ఫ్యాక్టరీలు వచ్చాయి. ఇప్పుడు తాగితే తంతామంటారు కానీ తయారు చేసింది పాపం వాళ్లే.

    బీరు కనిపెట్టింది మహిళలే

    బీరు తాగటం లేదా బీరు లాంటి ఉత్పాదనలు అమ్మే షాపులు ఇవన్నీ పురుషుల ప్రత్యేక ప్రపంచానికి చెందినవి. కానీ బీరు తయారుచేసింది దాన్ని ఉపాధిగా చేసుకుంది మహిళలే.…

  • జుట్టు రాలిపోవడం ఇప్పుడు వందలో 99 మంది సమస్య. దువ్వుతుంటేనే రాలిపోతుంటాయి. వాతావరణం కాలుష్యం మొదటి కారణం అయితే మానసిక ఒత్తిడి రెండో కారణం. ఒక్కసారి అతి శ్రద్ధ తీసుకోవటం కూడా కారణం కావచ్చు. వాడే మంచి అనుకునే షాంపూలు నూనెలు ఆధునిక వైద్యలు ఇవన్నీ... ఇప్పుడు తలంటుకుంటే షాంపూలు గట్టిగా రుద్దేయటం కూడా కేశ సంపదకు నష్టం కలిగించేదే. ఎక్కువగా బ్రషింగ్ చేసినా నష్టమే. షాంపూ చేసుకున్నాక అతడి జుట్టును గబగబా టవల్ తో అద్దేయద్దు. హెయిర్ డ్రయర్ల వాడకం కూడా ప్రమాదం. హెయిర్ ప్రాడక్ట్స్ లో వుండే రసాయనాల జుట్టు పై ప్రభావం చూపెడతాయి. రకరకాల హెయిర్ స్టైల్స్ కోసం జుట్టును హీట్ చేయటం కూడా జుట్టు రాలేందుకు కారణం కావచ్చు. అతి ప్రాచీన పద్ధతి జుట్టు ను వారానికోసారి వేడి చేసిన కొబ్బరి నూనెను కుదుళ్లను తాకేలా మర్దన చేసి కుంకుడు కాయలు వాడి స్నానం చేయటం బెస్ట్ పద్ధతి.

    ఇలా చేస్తే జుట్టు రాలుతుంది

    జుట్టు రాలిపోవడం ఇప్పుడు వందలో 99 మంది సమస్య. దువ్వుతుంటేనే రాలిపోతుంటాయి. వాతావరణం కాలుష్యం మొదటి కారణం అయితే మానసిక ఒత్తిడి రెండో కారణం. ఒక్కసారి అతి…

  • ఎత్తు మడమల చెప్పులే అమ్మాయిలకిష్టం. పొడుగ్గా కనబడతారు మోడరన్ డ్రెస్ లకు తగ్గినట్లు ఉంటుందని కష్టపడి నడుస్తూ వుంటారు. కానీ ఇలా హీల్స్ వాడేవాళ్లలో మోకాళ్ళ నొప్పులొస్తాయి జాగ్రత్త అంటున్నారు డాక్టర్లు. హీల్స్ ఎత్తయ్యే కొద్దీ కాలి పిక్క కండరం బిగుసుకుపోతుందిట. రెండడుగుల మించి ఎత్తు చెప్పులు వాడనే వద్దంటున్నారు. ఇప్పటికే నొప్పులొస్తే కాళ్ళకి పుదీనా గుణాలున్న ఆయిల్ తో మస్సాజ్ చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే రాళ్ల ఉప్పు వేసిన గోరు వెచ్చని నీళ్లతో కాళ్ళని ఉంచితే నొప్పులు తగ్గుతాయి. నొప్పుల బాధించేంతగా ఉంటే డాక్టర్ సాయంతో వ్యాయామాలు ట్రై చేయచ్చు.

    ఎత్తు మడమల చెప్పులతో పాదాల నొప్పులు

    ఎత్తు మడమల చెప్పులే అమ్మాయిలకిష్టం. పొడుగ్గా కనబడతారు మోడరన్ డ్రెస్ లకు తగ్గినట్లు ఉంటుందని కష్టపడి నడుస్తూ వుంటారు. కానీ ఇలా హీల్స్ వాడేవాళ్లలో మోకాళ్ళ నొప్పులొస్తాయి…

  • ప్రతి రోజు ఒక అర గ్లాస్ బీట్ రూట్ రసం తాగితే కండరాల శక్తి పెరుగుతుందని వాషింగ్టన్ వైద్య విద్యాలయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది హృద్రోగులకు కూడా చాలా శక్తినిస్తుంది. సరుకులు మోయటం మెట్లెక్కటం వంటి దైనందిన మైన పనులు చేయలేకపోవటం కండరాలు శక్తి క్షీణించటం వల్లనే అంటున్నారు ఎక్సపర్ట్స్. బీట్ రూట్ రసంతో నైట్రేట్ సుతఃయిలు అత్యధికంగా ఉన్నాయని వీటిని శరీరం నైట్రిక్ ఆక్సైడ్ గా మార్చుకుంటుందనీ దీని వల్ల కాంట్రక్షన్ స్పీడ్ శక్తి పెరుగుతుందంటున్నారు. ఏ జ్యూస్ పెద్దవాళ్ళు రెగ్యులర్ గా తీసుకుంటే కండరాల మెరుగుదల ఉంటుందనీ కండరాల బలహీనత అలసట ఇవన్నీ మాయమవుతాయని చెపుతున్నారు.

    బీట్ రూట్ జ్యూస్ తో సూపర్ పవర్

    ప్రతి రోజు ఒక అర గ్లాస్ బీట్ రూట్ రసం తాగితే కండరాల శక్తి పెరుగుతుందని వాషింగ్టన్ వైద్య విద్యాలయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది హృద్రోగులకు కూడా…

  • ఆర్గానిక్ కూరగాయలు పండ్లు సేంద్రియ ఎరువులు వేసి సహజమైన పద్ధతుల్లో పండిస్తారనీ ఆరోగ్యానికి మంచిదనీ ఖరీదైనా కొనాలనుకుంటాం. పళ్ళు ,కాయగూరల పై లేబుల్స్ ఉంటాయి. వాటిని బట్టి అవి ఆర్గానిక్ వా కాదా తెలుసుకోవచ్చు. ఆపిల్ కూడా లేబుల్ పైన నాలుగు అంకెలు వుండి మొదటి అంకె మూడు లేదా నాలుగు అని వుంటే అవి పురుగు మందులు వేసినవి అని అర్ధం. లేబుల్ పైన ఐదు అంకెలుండి మొదటి అంకె ఎనిమిది అయితే అది జన్యు మార్పిడి ద్వారా పండించినది అని అర్ధం. లేబుల్ పైన ఐదు అంకెలుండి మొదటి అంకె తొమ్మిదయితే అది ఆర్గానిక్ పండే. ఈ పళ్ళ పై వుండే లేబుల్ తినదగిన కాగితంతో జీర్ణమయ్యే జిగురుతో అంటిస్తారు. కానక పిల్లలు గబుక్కున లేబుల్ తో సహా తినేసినా ప్రాబ్లమ్ ఏవీ లేదు.

    ఏ యాపిల్ మంచిది

    ఆర్గానిక్ కూరగాయలు పండ్లు సేంద్రియ ఎరువులు వేసి సహజమైన పద్ధతుల్లో పండిస్తారనీ  ఆరోగ్యానికి మంచిదనీ ఖరీదైనా  కొనాలనుకుంటాం. పళ్ళు ,కాయగూరల పై లేబుల్స్ ఉంటాయి. వాటిని బట్టి…

  • కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాల వేడుక కన్నుల పండుగ గా జరుగుతుంది. నవంబర్ 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల్లో నిత్యం వివిధ ప్రత్యేక పూజలతో దైవాన్ని ఆరాదిస్తూ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహిస్తున్నారు. బుధవారం జరిగిన ప్రత్యేక పూజలు, కార్తీక దీపారాధనలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపతులు పాల్గొన్నారు.

    కోటి దీపోత్సవంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపతులు

    కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాల వేడుక కన్నుల పండుగ గా జరుగుతుంది. నవంబర్ 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు…

  • కోన్ ఐస్ క్రీమ్ తినేసాక చివరగా కోన్ కూడా బిస్కెట్ ఫ్లేవర్ తో తినేందుకు అనువుగా ఉంటుంది. ఇప్పుడు అచ్ఛంగా అలంటి వడ్డించే గిన్నెలొస్తున్నాయి. సూప్ లు, పాలు, పాయసం, తాగాక కప్పుల్ని కూడా అలాగే తినేయచ్చు. చివరికి కేక్ ముక్కని కూడా నేరుగా గిన్నెతో కలిపి తినేయచ్చు. అదెలాగంటే కుల్ఫీలు ,చాక్లేట్లు ,గోధుమ ,జొన్న ,రాగి , చీజ్ , మాంసం , కూడా గిన్నెల్లాగా చేసే మిషన్లోచ్చాయి. వాఫిల్ బౌల్ మేకర్ దానిపేరు. మనక్కావలిసిన రకం పిండి నాన్ వెజ్ ,స్వీట్ ,ఏదైనా టేస్టీ గా కలిపేసి ఇందులో ఆ పిండి పెట్టేసి మూత వేసేసి స్విచ్ నొక్కితే వెంటనే కాస్త పిండి పెడితే ఆ పిండి కాస్తా గిన్నె ఆకారం లోకో కోన్ ఆకారం లోకో కూడా మనం ఆర్డర్ ఇచ్చి తెచ్చుకున్న రకం రూపంలోకో మారిపోయి వచ్చేస్తాయి. ఇక చాక్లేట్ గిన్నెలకున్న పాపులారిటీ ఇంకా వేటికీ లేదుట. కరిగిన చాక్లేట్ ని వేరే అచ్చుల్లో పూసి కూడా ఈ గిన్నెల్ని తయారు చేయచ్చు. కూరలు ,సలాడ్లు, సూప్ లు , కోసం రకరకాల పిండి మాంసం కలిపి గిన్నెలను చేసేయచ్చు. రకరకాల ప్యాకింగులతో పర్యావరణనికి సమస్యలు లేకుండా చేసే ఇలాంటి వస్తువుల వల్ల చాలా ప్రయోజనం.

    తినేసే గిన్నెలొచ్చాయి

    కోన్ ఐస్ క్రీమ్  తినేసాక చివరగా కోన్  కూడా బిస్కెట్ ఫ్లేవర్ తో తినేందుకు అనువుగా ఉంటుంది. ఇప్పుడు అచ్ఛంగా అలంటి వడ్డించే గిన్నెలొస్తున్నాయి. సూప్ లు,…

  • వ్యాయామం అలవాటై పోయిన ఒక్క పూట మానేసినా ఎదో వెలితిగా ఉంటుంది. మరి వణికించే ఈ చలి రోజుల్లో వర్కవుట్స్ చేయటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. చలికి నొప్పులొస్తాయి. చలిగాలులకు శరీరం ప్రభావితం కాకుండా నిండుగా చెమట పట్టే దళసరి వస్త్రాలు ధరించాలి. నేరుగా చలిలోకి పరుగు తీయకుండా ఇంట్లో వార్మ్ అప్ చేయాలి. అప్పుడు శరీరం వ్యాయామం కోసం సిద్ధం అవుతుంది.ఎండ తీవ్రత లేకపోయినా సన్ స్క్రీన్ రాసుకుని తీరాలి. లేకపోతే చర్మం చలికి పగిలి పాడవుతుంది. ఉదయాన్నే కాకపోతే సాయంత్రం కాస్త ఎండా వుండగానే వ్యాయామం పూర్తి చేసినా మేలే. ఎంతయినా చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం కొన్ని జాగ్రత్తలు తీసుకుని జాగింగ్ మానక పోవటమే హాయి.

    చల్లగా వున్నా సరే మానకండి

    వ్యాయామం అలవాటై పోయిన ఒక్క పూట  మానేసినా  ఎదో వెలితిగా ఉంటుంది. మరి వణికించే ఈ చలి రోజుల్లో వర్కవుట్స్ చేయటం వల్ల  లాభం కంటే నష్టమే …

  • పిల్లల్ని బాగా పెంచటం అంటే ఖరీదైన వస్తువులు దుస్తులు ఖరీదైన పెంపకపు పోకడలు కాదు. చిన్న పిల్లలకు ఈ ప్రపంచంలో వస్తువుల ఖరీదు తెలియదు. వాళ్ళ దృష్టిలో జామపండు పిజ్జా రెండు ఒకటే. ఏది ఇష్టమో దాన్ని కోరుకుంటారు. ఖరీదు బట్టి కాదు. వాళ్ళ తల్లి తండ్రుల ఆసరా స్నేహం వాళ్లతో కలిసి గడిచే సమయం కావాలి. ఎదిగే వయసులో వాళ్ళకి ప్రోత్సాహం కావాలి. రెండు మార్కులు తక్కవొస్తే పర్లేదు ఈ సారి వస్తాయి లెద్దూ అనే ప్రేమ కావాలి. పెళ్లిళ్లు పేరంటాలకు పిల్లల్ని తీసుకుపోయినట్లే స్నేహితులు బంధువుల ఇళ్లలో జరిగే విషాదాలు కూడా వాళ్ళకి తెలియాలి. పుట్టిన రోజుకి ఫ్రెండ్స్ కిజిఫ్టు ఇమ్మని చెప్పటం కాకుండా ఎవరైనా అనారోగ్యాల తో వుండే దగ్గరుండి తీసుకుపోయి స్నేహితుల బాధను పంచుకునే అలవాటు చేయాలి. మనం దేన్నీ ఇస్తే దాన్నే అమూల్యమనుకుంటారు.

    కష్టం , సుఖం , తెలుసుకోనివ్వండి

    పిల్లల్ని బాగా పెంచటం అంటే ఖరీదైన వస్తువులు దుస్తులు ఖరీదైన పెంపకపు పోకడలు కాదు. చిన్న పిల్లలకు ఈ ప్రపంచంలో వస్తువుల ఖరీదు తెలియదు. వాళ్ళ దృష్టిలో…