• ఒక చక్కని ఆలోచనకు కూటి రూపాయల ఫండింగ్ అందింది. యాస్మిక్ ముస్తఫా అనే అమ్మాయి ఫిడెల్ఫియా లో పుట్టింది. దక్షిణ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎప్పుడూ లైంగిక హింసే రుచి చూసింది. ఈ సమస్యకు పరిష్కారంగా సొంతూరు వెళ్లి స్నేహితురాలితో కలిసి యధేనా అనే యాంటీ రేప్ డివైస్ ని తయారు చేసింది. చిన్న బటన్ మారిదిగా ఉండే ఈ పరికరం గొలుసుతో వేసుకోవటానికి డ్రెస్ కు అమర్చుకోవటానికి వీలుగా ఉంటుంది. ఆపదలో ఉన్నప్పుడు ఈ బటన్ నొక్కితే అత్యవసర జాబితాలో ఉన్నవాళ్ళకి ఆపదలో ఉన్న విషయం తెలుస్తుంది. ముందుగా అలారం కూడా మోగుతుంది. ఈ మంచి డివైస్ కోసం ఇప్పటికే ఆమెకు కోటి రూపాయల ఫండింగ్ అందింది.

    ఈ ఆలోచన ఖరీదు రు.కోటి

    ఒక చక్కని ఆలోచనకు కూటి రూపాయల ఫండింగ్ అందింది. యాస్మిక్ ముస్తఫా అనే అమ్మాయి ఫిడెల్ఫియా లో పుట్టింది. దక్షిణ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎప్పుడూ లైంగిక…

  • ఈమె పేరు షహనా బేగం ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్పూర్ గ్రామం. ఆ గ్రామంలో ఆమెను తుపాకీ చిన్నమ్మ అని పిలుస్తారు. భర్తతో కలిసి వ్యవసాయం చేసుకు బతికే ఈమె భర్తను బంధువులే ఆస్తి తగాదాల్లో చంపేశారు. ఇక వంటరిగా మిగిలిన షహనా బేగం లైంగిక వేధింపులకు గురైంది. ఆకతాయిల బాధ చూడలేక నాటు తుపాకీ ఒకటి కొని తనను తన పిల్లలను రక్షణ గా వుంచుకోవాలనుకుంది. తన బాధల్ని అర్జీ రూపంలో పెడితే పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె చేతిలో తుపాకీ ఉంటుంది. ఆమె తుపాకీతో గ్రామంలోనే గృహహింస దాదాపుగా తగ్గింది. పంచాయతీ తీర్పులకు ఆమెను పిలుస్తారు. ఇప్పుడు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా న్యాయం కోసం ఆమెను ఆశ్రయిస్తున్నారు. అల్లరి మూకలకు ఆమె పేరు వింటే సింహ స్వప్నం. ఆమె అక్షరం ముక్కరాని గ్రామీణ రైతు.

    తుపాకీ చిన్నమ్మంటే ఆకతాయిలకు హడల్ !

    ఈమె పేరు షహనా బేగం ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్పూర్ గ్రామం. ఆ గ్రామంలో ఆమెను తుపాకీ చిన్నమ్మ అని పిలుస్తారు. భర్తతో కలిసి వ్యవసాయం చేసుకు…

  • జీవితంలో ప్రతిక్షణం సక్సెస్ ఫుల్ గానే గడపాలనే అందరూ కోరుకుంటాం. కొన్ని లక్షణాలు సొంతం చేసుకోగలిగితే విజయం వెంట నడుస్తూ వస్తుంది. మానసికంగా సంతోషంగా ఉండాలంటే శారీరికంగా ఆరోగ్యంగా ఉండాలి. చక్కని ఆహారపు అలవాట్లు సొంతం చేసుకోవాలి సరైన సమయానికి చక్కని ఆహారపు అలవాట్లు సొంతం చేసుకోవాలి సరైన సమయానికి చక్కని పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. పోటీ పడితే ఓటమి తిరస్కరణ సూన్యత బాధ సంతోషం వంటి భావోద్వేగాలు ఎదుర్కోవలిసివస్తుంది. వీటిని ఎదుర్కొనేందుకు మానసికంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. మన లోపాలు తప్పులు సమీక్షించుగోగలిగితే సక్సెస్ కు అనే దగ్గర మార్గాలవుతాయి. మన చుట్టూ సత్సంబంధాలు ఏర్పరుచుకుని ఎదుటివారిలో లోపాలు ఎంచకుండా సానుకూల వాతావరణం సృష్టించుకుంటే ముందు మనం శాంతిగా ఉంటాం. మనం ఎంచుకున్న గమ్యం సవ్యమైనదీ మన కెరీర్ ని దృఢపరిచేది అయితే మన కష్టం మనల్ని విజయం దగ్గరకు చేరుస్తుంది.

    సక్సెస్ మన చేతుల్లోనే

    జీవితంలో ప్రతిక్షణం సక్సెస్ ఫుల్ గానే గడపాలనే అందరూ కోరుకుంటాం. కొన్ని లక్షణాలు సొంతం చేసుకోగలిగితే విజయం  వెంట నడుస్తూ  వస్తుంది. మానసికంగా సంతోషంగా ఉండాలంటే శారీరికంగా…

  • క్రాప్ టాప్ ఎప్పటి ఫ్యాషనో, అది ఇప్పుడు సాంప్రదాయ లంగాల పైకి వచ్చి చేరింది. ఇప్పటికి ట్రెండి, ట్రడిషనల్ కంఫర్ట్ అంటున్నారు అమ్మాయిలు. పొడవు లంగా పైకి పొట్టి జాకెట్ గా వేడుకల్లో హైలైట్గా వుంటుంది. పలాజో స్కర్టులకు కూడా క్రాప్ టాప్ ఫ్యాషన్. వెస్ట్రన్ లాంగ్ మిడ్డి కి, ప్లెయిన్ లంగాలకు, ప్రింటెడ్ లంగాలకు స్లీవ్ లెస్ క్రాప్ టాప్ లు చెక్కని ఎంపిక. ఒకే రంగు లంగా క్రాప్ టాప్ వేసుకోవాలంటే ఎంబ్రాయిడరీ పని తనం జోడిస్తే సాంప్రదాయ వేడుకల్లో హైలైట్ . ఎలాగో స్కర్ట్ పైన క్రాప్ టాప్ వేసుకుంటే ఈ చలికాలానికి తగ్గట్టు పైన బ్లేజర్ కూడా వేసుకో వచ్చు.

    స్టైలిష్ ఎట్రాక్షన్ క్రాప్ టాప్

    క్రాప్ టాప్ ఎప్పటి ఫ్యాషనో, అది ఇప్పుడు సాంప్రదాయ లంగాల పైకి వచ్చి చేరింది. ఇప్పటికి ట్రెండి, ట్రడిషనల్ కంఫర్ట్ అంటున్నారు అమ్మాయిలు. పొడవు లంగా పైకి…

  • ఎఫ్ 45 పేరుతో ఫిట్ నెస్ సెంటర్ నడుపుతున్న రకుల్ ప్రీతి సింగ్ అత్యాచార బాధితుల కోసం విరాళాలు సేకరించనున్నది. ఫిట్ నెస్ అన్ ప్లగ్ డ్ పేరుతో ఈ నెల 20వ తేదీ సాయంత్రం 7 గంటలకు గచ్చి బౌలి స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బు అత్యాచార బాధితుల సహాయార్ధం వినియోగిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఒకరిని ఎంపిక చేసి రాకుల్ తో బ్రేక్ ఫాస్ట్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్లో రాకుల్ ఫిట్ నెస్ చెపుతుంది.

    అత్యాచార బాధితుల కోసం రకుల్

    ఎఫ్ 45 పేరుతో ఫిట్ నెస్ సెంటర్ నడుపుతున్న రకుల్ ప్రీతి సింగ్ అత్యాచార బాధితుల కోసం విరాళాలు సేకరించనున్నది. ఫిట్ నెస్ అన్ ప్లగ్ డ్…

  • వేపాకు ఉపయోగాలు చెప్పాలంటే ఓ పుస్తకం రాయాలి. అందం కోసమైతే వేపాకును మించిన ప్రకృతి ప్రసాదం ఇంకోటి లేదు. వేప మంచి మాయిశ్చురైజర్. చెంచా లేత వేపాకు గుజ్జు, పసుపు కలిపి మొహానికి రాస్తే ఎంతో మృదువుగా అయిపోతుంది. వేపాకు మాస్క్ వేస్తే మచ్చలు పోతాయి. వేప గుజ్జు, నారింజ తొక్కల పొడి, తేనె, పెరుగు కలిపి ఫేస్ మాస్క్ వేస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రెండూ పోతాయి. గుప్పెడు వేపాకుల్ని నీళ్ళల్లో ఉడికించి ఆ పేస్టులో తేనె కలిపి జుట్టుకు పట్టించి, ఓ పావు గంట ఆరాక తల స్నానం చేస్తే అంత మంచి కండిషనర్ ను ఎప్పుడూ చూసి ఉండరు.

    అందం కోసం వేపాకు

    వేపాకు ఉపయోగాలు చెప్పాలంటే ఓ పుస్తకం రాయాలి. అందం కోసమైతే వేపాకును మించిన ప్రకృతి ప్రసాదం ఇంకోటి లేదు. వేప మంచి మాయిశ్చురైజర్. చెంచా లేత వేపాకు…

  • కాఫీ తాగితే ఒత్తిడి తగ్గి మెదడు చురుగ్గా ఉంటుందనుకుంటాం. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వాళ్ళు ఏమంటున్నారంటే కాఫీ బదులు పనిచేసే ప్రదేశం నుంచి లేచి ఐదు నిముషాలు నడిచి చూడండి. లేదా మెట్లు ఎక్కి దిగండి. రక్త ప్రసరణ మెరుగుపడి మెదడు చురుగ్గా అయిపోతుంది అంటున్నారు. మానసిక శక్తి ఉత్తేజితమవ్వాలంటే కూర్చునే భంగిమనో నిలబడే భంగిమనో మార్చి నిఠారుగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. దీన్ని పవార్ పోజ్ అంటారు. మూడు నిముషాలు ఇలా నిఠారుగా ధ్యానం లాగా ఉండగలిగితే ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చి మెదడుకి ఉపశమనం అంటున్నారు. లేదా ఆసక్తిగా ఉండేవి. లేదా సరదాగా అనిపించే పుస్తకాలూ చదవండి చాలు. అలజడిగా ఉన్న మనకుసంగీతం వింటే ఉల్లాసంగా అయిపోతుంది. ఉత్పాదికతను పెంచుతోంది. కాఫీ లో తాగేకంటే కాసేపు ఏదీ ఆలోచించకుండా కూర్చోండి చాలంటున్నారు.

    కాఫీ తాగటం కంటే ఇలా బెటర్

    కాఫీ తాగితే ఒత్తిడి తగ్గి మెదడు చురుగ్గా ఉంటుందనుకుంటాం. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వాళ్ళు ఏమంటున్నారంటే కాఫీ బదులు పనిచేసే ప్రదేశం నుంచి లేచి ఐదు నిముషాలు…

  • బరువు తగ్గాలనుకోవటం ఒక సాధన. ఆ క్రమంలో శరీరం ఎంత శ్రమ ఓర్చుకోగలుగుతుందో గమనించుకోమంటున్నారు నిపుణులు. వ్యాయామం చేసినప్పుడు దాహం వేసిన పెదవులు తడారిపోయినా శరీర ఉష్ణోగ్రత పెరిగినా వెంటనే నీళ్లు తాగాలి. జీవక్రియల పనితీరు సరిగ్గా ఉండేలా మితంగానే వ్యాయామం చేయాలి. శరీరం అలసిపోతేనే కండరాలు కీళ్ల నొప్పులు వస్తాయి. శరీరం అతిగా అలసిపోయిందని చెప్పే సంకేతాలివి. మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూనే వ్యాయామం చేయాలి. వ్యాయామం తరువాత వెంటనే స్నానం వద్దు . అలాని ఏసీ లో కూర్చోవటం ఫ్యాన్ కింద విశ్రాంతి తీసుకోవటం తప్పు. శరీరం సరైన ఉష్ణోగ్రత లోకి వచ్చేదాకా వేచి చూసి స్నానం చేయాలి. అలాగే వ్యాయామం ముగించగానే ఆహారం తీసుకోకూడదు. అలాగే ముందు కూడా మాంసకృతులు వుండే ఆహరం జోలికి పోకుండా వుండటం ఉత్తమం.

    శరీరపు అలసట కనిపెట్టాలి

    బరువు తగ్గాలనుకోవటం ఒక సాధన. ఆ క్రమంలో శరీరం ఎంత శ్రమ ఓర్చుకోగలుగుతుందో గమనించుకోమంటున్నారు నిపుణులు. వ్యాయామం చేసినప్పుడు దాహం వేసిన పెదవులు తడారిపోయినా శరీర ఉష్ణోగ్రత…

  • ఇల్లు ఎంతో చక్కగా అలంకరిస్తాం . ఇంత చక్కని ఇంట్లో మంచి వాసనలు సెంట్ సువాసనలు కాకుండా ఇంకాస్త డిఫరెంట్ గా ఉండాలనుకుంటే వెడల్పాటి గిన్నెలో సగం వరకు నీళ్లు తీసుకుని నాలుగైదు యాపిల్ ముక్కలు రెండు దాల్చిన చెక్క ముక్కలు నాలుగు లవంగాలు వేసి పొయ్యి మీద పెట్టండి. నీళ్లు కాస్త వేడెక్కితే చాలు ఇల్లంతా సువాసనే. కమలా ఫలం పై తొక్కలు దాల్చిన చెక్క ముక్కలు బిర్యానీ ఆకు ట్రై చేయచ్చు. లేదా ఇవన్నీఏ వంటింటిలోనో గిన్నెలోనో ఉంచండి. మంచి వాసన వస్తూవుంటుంది. ఇవన్నీ ఎండనిచ్చి అప్పడికప్పుడు దంచి కప్పులో పోసినా సరే. అరోమా కొవ్వోతుల్ని వెలిగించే ముందర వాటిని కాఫీ గింజలు వేసిన కప్పులో ఉంచండి. కొవొత్తి సువాసనతో పాటు కాఫీ గింజలు పరిమళం ఇల్లంతా నిండిపోతుంది.

    ఇల్లంతా పరిమళభరితం

    https://scamquestra.com/sozdateli/6-cheslav-yurevich-49.html

  • ఇంటి దగ్గరుండే మైదానాల్లోనో మామూలు వీధుల్లోనో పరుగు పందెం కోసం సాధన చేసే క్రీడాకారిణులకు ఆకతాయిల వేధింపులు ఎన్నో ఎదురవుతూ వుంటాయని ప్రపంచ వ్యాప్తంగా మహిళా అథ్లెట్ల పరిస్థితి ఇలాగే ఉంటుందని రన్నర్స్ వరల్డ్ అనే పత్రిక నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 2533 మంది అథ్లెట్ల తో ఈ అధ్యయనం చేశారట. ఈ వేధింపులకు భయపడి మన క్రీడా కలల్ని తుంచేసుకొనవసరం లేదు. ఆటలో దూకుడు ప్రదర్శించి పతకాలు గెల్చుకోవాలి అని చెప్తోంది. అమెరికన్ క్రీడా కారిణి కారా గౌచర్. ఇప్పటికే రెండు ఒలంపిక్స్ లో పాల్గొన్నారామె. అథ్లెట్లు ఒలంపిక్ విజేతలు అన్న తారతమ్యం లేకుండా అందరూ వేధింపులకు గురైనవారేనని తేలింది కదా ఇంకా మీరేవళ్ళు ఆకతాయిల అల్లరికి భయపడకండి హాయిగా మీ పనులు చేసుకోండి అని ఆడ పిల్లలకు హితవు చెపుతున్నారు ఈ అధ్యయనకారులు.

    వాళ్ళకే తప్పు లేదు మీకెందుకు భయం

    ఇంటి దగ్గరుండే మైదానాల్లోనో మామూలు వీధుల్లోనో పరుగు పందెం కోసం సాధన చేసే క్రీడాకారిణులకు  ఆకతాయిల వేధింపులు ఎన్నో ఎదురవుతూ వుంటాయని ప్రపంచ వ్యాప్తంగా మహిళా అథ్లెట్ల…