• ఒక్క ఊరికి ఒక్కో ప్రత్యేకత తాపేశ్వరం కాజాలు, బందరు లడ్లు, ఉప్పాడ చీరలు, కొండపల్లి బొమ్మలు ఇలాగే తమిళనాడు లోని కలయూర్ వంటలకూ ప్రసిద్ధి. ఇక్కడి మగవాళ్ళు వంటవాళ్ళుగా పేరు తెచ్చుకునేందుకు కష్టపడతారట. ఇందులో రకరకాల గ్రేడ్లు, ప్రమోషన్లు వుంటాయట. ఓ వ్యక్తి సీనియర్ వంటవాడి స్థానం రావాలంటే పదేళ్ళు కష్టపడి నేర్చుకోవాలిట. ప్రధాన వంటవాడి స్థానం కావాలంటే పాతికేళ్ళ అనుభవం కావాలి. ఇక్కడి వాళ్ళు ఎంత బాగా వంట చేస్తారంటే పాండిచరి, తిరుపతి, మదురై, చెన్నై, చిత్తూరు లో పెద్ద వేడుకలకు వాళ్ళని బుక్ చేస్తారట. ఈ ఊర్లో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్ధులు ఇంటర్న్ షిప్ కోసం వస్తారట. వీళ్ళు చెక్కని వంట చిట్కాలు, మేనేజ్మెంట్ పాఠాలు చెప్తారట. ఈ న్యూస్ ఎందుకంటే ఒక వ్యాపారం కోసం ధనసంపాదన కోసం స్త్రీ పురుషులనే వత్యాసాల గోడలు కూలిపోతున్నాయి. వంట ఆడవాళ్ళకే పరిమితమై వుండేది అది ఇవ్వాల లక్షలకొద్ది జితం ఇచ్చే షెఫ్ జాబ్ కింద మారిపోయింది. వంటా........... అని చిరాకు పడే వాళ్ళు ఇది ఓ పరిశ్రమగా గుర్తించండి.

    వంట ఇప్పుడో పెద్ద పరిశ్రమ

    ఒక్క ఊరికి ఒక్కో ప్రత్యేకత తాపేశ్వరం కాజాలు, బందరు లడ్లు, ఉప్పాడ చీరలు, కొండపల్లి బొమ్మలు ఇలాగే తమిళనాడు లోని కలయూర్ వంటలకూ ప్రసిద్ధి. ఇక్కడి మగవాళ్ళు…

  • మృదువుగా వుండే నాయికా పాత్రలో ఒదిగిన జయలలిత తనలోని నటిని వెనక్కి తోసి నాయకురాలయ్యారు. అలాగే రాజకీయ జీవితంలో తిరుగులేని స్థానం సంపాదించాక నాయకురాలి వెనక్కి తోసి విప్లవ నాయకి బిరుదుని వదిలేసి అమ్మగా ఆదరించే దేవతగా నిలబడ్డారు. రెండు చేతులా ఆమె అందించిన సంక్షేమ పథకాలతో ఆమెకు అన్ని వర్గాలు నీరాజనం పట్టాయి. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ద్రావిడ పార్టీలకు జయలలిత వంటి బ్రాహ్మణ స్త్రీ నాయకత్వం వహించిందీ అంటే రాజకీయాల్లో ఆమె ఎంత కఠినమైన నిర్దాక్షణ్యమైన నేతగా రూపం మార్చుకుందో తెలుస్తుంది. సొంత కుటుంబం అంటూ లేదు జయలలిత తమిళనాడు ప్రజలందరికీ అమ్మ అయిందని నిరూపించేందుకు ఆమె పార్థివ దేహాన్ని సందర్శించికొనేందుకు ఆమెకు చివరివీడ్కోలు పలికేందుకు మెరీనా బీచ్ లో హాజరైన జన సందోహంమే నిదర్శనం. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఆమెదో ప్రత్యేక అధ్యాయం. వెండి తేర నేలిన ఈ ఒకనాటి తార అఖండ జ్యోతిగా వెలిగేందుకు ఆకాశానికి చేరింది పది కోట్ల మంది తమిళ ప్రజల అమ్మ అన్న పిలుపుకి అందనంత దూరoవెళ్లిపోయింది

    అమ్మకు అక్షరాంజలి

    వంటరి నడకతో అలసిపోయిందేమో 60 ఏళ్ళకి ఆగిపోయింది ఎక్కడానికి శిఖరాలేమీ లేవేమో శిఖరాగ్రాన సెలవు తీసుకుంది కోట్లాది మంది కన్నీరు తోడుగా కోమల వల్లి వెళ్ళిపోయింది బడుగు…

  • పాపాయికి జన్మ ఇచ్చాక కొత్త హోదాలోకి వచ్చాక అమ్మ శరీరంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. అటువంటి మార్పుల్లో జుట్టు ఊడిపోవటం ఒకటి. దీన్ని పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్ అంటారు. ప్రసవం తర్వాత హార్మోన్లు నెమ్మదిగా సాధారణ స్థాయికి వచ్చేస్తుంటాయి. దీనితో పాటు జుట్టు సహజంగా రాలే ప్రక్రియ కూడా ఆరంభం అవుతుంది. మరో కారణం శారీరిక ఎమోషనల్ ఒత్తిడి. 360 డిగ్రీల కోణంలో జీవితం మారిపోయినందున దీనికి తగట్టుగా శరీరం తనను తాను సిద్ధం చేసుకునే క్రమంలో ఒత్తిడితో జుట్టు కాలిపోయి యధాతధంగా మళ్ళీ వస్తుంది. మరీ ఊడటం తగ్గకపోతే శిరోజాల నిపుణులు హెయిర్ సప్లిమెంట్లు మాడుకు అప్ప్లయ్ చేయవలిసిన పోషకాలు ఇస్తారు. శిరోజాలకు చక్కని ఫీడింగ్ కావాలి. గుడ్లు సొయా లెంటిల్స్ చేపలు చికెన్ ప్రోటీన్స్ వారంలో రెండు సార్లు హెయిర్ వాష్ చేసుకుని వెడల్పాటి పళ్ళున్న దువ్వెనతో దువ్వుకోవాలి.

    ఇది చాలా సహజం

    పాపాయికి జన్మ ఇచ్చాక కొత్త హోదాలోకి వచ్చాక అమ్మ శరీరంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. అటువంటి మార్పుల్లో జుట్టు ఊడిపోవటం ఒకటి. దీన్ని పోస్ట్ పార్టమ్  హెయిర్…

  • వాతావరణ కాలుష్యం భయపెడుతున్న ఆఫీస్ కో. కాలేజీ కో , లేదా ఇంట్లో పనుల గురించి బయట తిరగక తప్పదు. దుమ్ము జిడ్డు పేరుకునిపోయి చర్మం మృదుత్వాన్ని పోగొట్టుకుంటుంది. వీటిలో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ సమస్యలొస్తాయి. చెంపలు ముక్కు దగ్గర సమస్య కనబడుతూ ఉంటుంది. చర్మం రంగు తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ముఖానికి శాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ లు వాడాలి. అలాగే క్లిందా మైసిన్ , బెంజైడ్, పేరాక్రైడ్, రెటినాయిడ్ ఉన్న క్రీములు ముఖ చర్మం స్మూత్ గా అయిపోయేందుకు ఉపయోగపడతాయి. లేదా బ్యూటీక్లినిక్స్ లో అయితే శాలిసిలిక్ యాసిడ్ క్రీములు అప్ప్లయ్ చేయటం కెమికల్ పీల్ చేస్తుంటాయి. వీటివల్ల చర్మం పైన పేరుకున్న జిడ్డు మృతకణాలు పోయి చర్మం నిగారింపుగా వస్తుంది. లేదా ఇంట్లోనే కొన్ని ఫేస్ ప్యాక్ లో తయారు చేసుకోవచ్చు. సున్నిపిండి సెనగపిండి సరిపాళ్ళ లో కలిపి నిమ్మరసం తేనె కలిపి మర్దన చేసినా చర్మం రంగు చక్కగా అయిపోతుంది. టమాటా గుజ్జు తేనె నిమ్మరసం కలిపి ప్యాక్ వేసుకున్న చర్మ కాంతి మెరుగవుతుంది. సమస్యలన్నీ పోతాయి.

    వెనకటి రంగొస్తుంది

    వాతావరణ  కాలుష్యం భయపెడుతున్న ఆఫీస్ కో. కాలేజీ కో , లేదా ఇంట్లో పనుల గురించి బయట తిరగక తప్పదు. దుమ్ము జిడ్డు పేరుకునిపోయి చర్మం మృదుత్వాన్ని…

  • సీతా ఫలం రామా ఫలం హనుమాన్ ఫలం ఇవన్నీ ఎవరు పేర్లు పెట్టారు గానీ ఈ సీతా ఫలం హనుమాన్ ఫలాన్ని కలిపి అత్మోయా అనే హైట్రాడ్ పండు సృష్టించారు. తైవాన్ లో దొరికే ఈ పండు పేరు పైనాపిల్ షుగర్ ఆపిల్. మళ్ళీ తొక్కలు వుండే లక్ష్మణ ఫలాన్ని దక్షిణ అమెరికా లో బిరిబా అని పిలుస్తారు. సీతా ఫలం తో పోలిస్తే మిగిలిన వాటిల్లో గింజలు తక్కువ. దీన్ని షుగర్ ఆపిల్ అంటారు. మహబూబ్ నగర్ ,బాలా నగర్ ,షహరాన్ పూర్ ,ఇలా తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన మేలు జాతి సీతా ఫలాన్ని తియ్యని గుజ్జుతో ఉంటాయి. ఇప్పుడు హైద్రాబాద్ లో సీతా ఫలాల గుజ్జుతో చేసే ఐస్ క్రీమ్ చాలా పాపులర్ కూడా. ఈ మధురమైన సీతాఫలం లో పోషకాలు ఎక్కువే. వంద గ్రాముల సీతాఫలంలో 94 క్యాలరీలుంటాయి. ఆపిల్ .మామిడి బొప్పాయి తో పోలిస్తే ఇందులో ఎక్కువే. తక్కువ బరువు ఉంటే హాయిగా రోజుకు పండు తిని బరువు పెరగచ్చు. అరిస్టోక్రాట్ ఆఫ్ ఫ్రూట్స్ గా వేరు పడ్డ సీతా ఫలం ఔషధ విలువలు ఎంత ఎక్కువంటే సీతా ఫలం సీజన్ ఎప్పుడూ ఉంటే ఎంత బావుంటుందో అనుకునేంత అసలు సీజనల్ ఫ్రూట్స్ ఏవి దొరికినా వాటిని ఆ కాలంలో తినేయటం శరీరానికి లాభం.

    సీతా ఫలం ఎంతో మధురం

    సీతా ఫలం రామా ఫలం హనుమాన్ ఫలం ఇవన్నీ ఎవరు పేర్లు పెట్టారు గానీ ఈ సీతా ఫలం హనుమాన్ ఫలాన్ని కలిపి అత్మోయా  అనే హైట్రాడ్…

  • మనం నడవలేరు అనుకుంటాం, వాళ్ళు పరుగెడతారు. కేరళకు చెందిన సోఫియా రెండేళ్ళ క్రితం బాధితుల కోసం జరిగిన మిస్ ఇండియా పోటిలలో మొదటి రన్నర్ అప్ గా, ఐరోపాలో జరిగిన మిస్ వరల్డ్ పోటిలలోను తలాపడింది. కేరళ లోని ప్రభుత్వ ఫ్యాషన్ షో లలో తళుక్కున మెరిసింది. ఫ్యాషన్ డిజైనర్, గ్లాస్ పెయిన్టింగ్ కళాకారిణి, నగల డిజైనర్ కూడా ఇంతేనా, స్కూటర్ నేర్చుకుని లైసెన్సు కోసం వెళితే అధికారులు చెవులు వినిపించవు మాటలు రావు ఇవ్వలేం అంటే హై కోర్ట్ కి ఎక్కి లైసెన్సు సంపాదించుకుంది. కేరళలో ఇలాంటి లైసెన్సు తీసుకున్న మొట్టమొదట అమ్మాయి సోఫియానే. ఇంతేనా షార్ట్ ఫుట్లో రాష్ట్ర స్థాయి క్రీడా కారిణిగా ఎనిమిది సార్లు జాతీయ విజేత, మూడు సార్లు నిలబడింది. ఈ అమ్మాయిని పోగిడెందుకు అక్షరాలు సరిపోవడం లేదు. సోఫియాను ఎంత మంది ఆదర్శంగా తీసుకోవచ్చు.

    వినిపించదు…. మాటాడదు…. ఇన్ని నైపుణ్యాలా?

    మనం నడవలేరు అనుకుంటాం, వాళ్ళు పరుగెడతారు. కేరళకు చెందిన సోఫియా రెండేళ్ళ క్రితం బాధితుల కోసం జరిగిన మిస్ ఇండియా పోటిలలో మొదటి రన్నర్ అప్ గా,…

  • మంచి సువాసనలకు మనస్సు వుత్తేజితం అవుతుంది. ఎలాంటి ఒత్తిడిలోనుంచి అయిన ఈ మంచి వాసనలు మనస్సు ని తేలిక చేస్తాయి. అన్ని కాలాల్లో మల్లెలు దొరకవు కానీ మల్లెలు తో చేసిన నూనె మార్కెట్లో దొరుకుతుంది. ఈ వాసన మానసిక ఉల్లాసం పెంచడం తో పాటు ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన వంటి చిరాకులను దూరం చేసే హర్మోన్లని విడుదల చేస్తాయి. బావోద్వేగాలను అదుపు చేస్తాయి. అలాగే లావెండర్ వాసన పిలిస్తే నాడి కొట్టుకునే వేగం నియంత్రణ లో వుంటుంది. కంగారు, గాబరా తగ్గుతాయి. నరాలు ఉత్తేజం చెంది రక్త ప్రసరణ సక్రమంగా వుంటుంది. అలాగే గులాబీ పూల నూనె జ్ఞాపక శక్తి వృద్ది చేస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, తలనొప్పులు వంటివి బాధించవు. తులసి నూనె మానసిక సమస్యలు దూరం చేస్తుంది. ఈ నూనెలో దుది ముంచి గది మూలల్లో ఉంచితె రాత్రి వేల మనస్సు ప్రశాంతమై చెక్కని నిద్ర వస్తుంది.

    భావోద్వేగాలు అదుపు చేసే సువాసనలు

    మంచి సువాసనలకు మనస్సు వుత్తేజితం అవుతుంది. ఎలాంటి ఒత్తిడిలోనుంచి  అయిన ఈ మంచి వాసనలు మనస్సు ని తేలిక చేస్తాయి. అన్ని కాలాల్లో మల్లెలు దొరకవు కానీ…

  • కొన్ని రికార్డు బ్రేక్స్ వుంటాయి. వింటే ఆశర్యంగా వుంటుంది. సినిమాల విషయంలో మధు బండార్కర్ సినిమాకోసం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీషా మల్ హోత్ర 130 కాస్ట్యుమ్స్ రూపొందించాడట. కరీనా కపూర్ ఈ సినిమాలో నిమిషానికో డిజైనర్ డ్రెస్ లో కనిపించాలి అనుకున్నారు అంట. ఈ డ్రెస్ల బడ్జేట్ అక్షరాల 1.2 కోట్ల రూపాయిలు. కధానాయిక అనగానే ప్రేక్షుకులకు అందంగా కనిపించాలి. అందుకే ఫ్యాషన్ విషయంలో ఆర్టిస్ట్లు ఎంతో శ్రద్ద తీసుకుంటారు. రకరకాల డిజైనర్ దుస్తులలో వెండి తెర పైన కనువిందుగా కనిపిస్తారు. కరీనా ఓ సినిమా కోసం అత్యంత ఖరీదైన కాస్ట్యుమ్స్ ధరించిన నాయిక గా రికార్డు సృష్టించిందిట కరీనా. ఈ మధ్య ఓ ఇంటర్వ్య లో ఈ విషయం వెల్లడించిందామె.

    కరీనా కోసం 130 కాస్ట్యుమ్స్

    కొన్ని రికార్డు బ్రేక్స్ వుంటాయి. వింటే ఆశర్యంగా వుంటుంది. సినిమాల విషయంలో మధు బండార్కర్ సినిమాకోసం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీషా మల్ హోత్ర 130 కాస్ట్యుమ్స్…

  • పురుషుల ఆలోచనలు మెదడులోంచి వస్తే మహిళల ఆలోచనలు మనసులోంచి వస్తాయంటున్నారు అధ్యయన కారులు. వాళ్ళ నిర్ణయాలు ఎప్పుడూ లాజిక్ కు అందవు. మహిళల నాయకత్వంలో రుణ రహిత కంపెనీలు ఎక్కువని ఓ అంతర్జాతీయ అధ్యయనం చెప్తోంది. అహ్మదాబాద్ కు చెందిన పారు జయకృష్ణ అన్న యువతి అసాహిసాంగ్ వన్ పేరుతొ ఒక ఎగుమతి సంస్థని ప్రారంభించిందట. నానాటికి ఆమెకు ఎగుమతి దిగుమతి చట్టాల పైనా వ్యాపారం పైనా అవగాహన ఏవీ లేదు. పెట్టుబడి తక్కువ ఒకటే కారణం. అలాగే ఢిల్లీలో ఒక బహుళ జాతి కంపెనీ ఉద్యోగాన్ని వదులుకుని నీతి అన్న అమ్మాయి 36 రంగ్ పేరుతో గిరిజన కళాకృతులు అంతర్జాతీయ మార్కెట్ కు పరిచయం చేసే బిజినెస్ పెట్టింది. ఢిల్లీ వదిలి నీతి సొంతూరు ఛత్తీస్గఢ్ లోని సొంతూరు వచ్చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు. దీపా సోమన్ ఒక మార్కెట్ రీసెర్చ్ కంపెనీ పెట్టి ఇందులో మహిళలకే ప్రాధాన్యత అంటూ పైగా ఖచ్చితమైన పనివేళలు కూడా వుండవు. వాళ్ళు ఇంట్లోంచి కూడా పని చేయచ్చు నని చెప్పి చేసి చూపెట్టింది. వ్యాపారంతో పాటు సామజిక సేవ కలగలిపి వుంటోంది మహిళలు ఏ ఉపాధి చెప్పటినా షి ఆల్వేస్ థింక్స్ బిగ్. దీర్ఘ కలయిక దృష్టి మహిళకు స్వయంగా అబ్బిన లక్షణం.

    వాళ్ళ ఆలోచనా తీరే వేరు

    పురుషుల ఆలోచనలు మెదడులోంచి వస్తే మహిళల ఆలోచనలు మనసులోంచి వస్తాయంటున్నారు అధ్యయన కారులు. వాళ్ళ నిర్ణయాలు ఎప్పుడూ లాజిక్ కు అందవు. మహిళల నాయకత్వంలో రుణ రహిత…

  • నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన ఆకాంక్షానందా ఎంతో మంది టాప్ డిజైనర్లకు, స్నేహితురాల్ల కు సలహాదారికూడా. డ్రెస్సింగ్ లో స్టీల్ లో సరికొత్త బ్రాండ్స్ ని ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆమెను మించినవాళ్ళు లేరు అంటారు. ప్రపంచ ప్రసిద్ద ఫ్యాషన్ డిజైనర్లు మనీష్, అరోరా, గౌరవ గుప్తా. నమ్రతా జోషిపురా మొదలైన అందరికి ఫ్యాషన్ డిజైనింగ్ లో సలహాలు సూచనలు ఇస్తుందామె. ప్రతి రోజు డ్రెస్ అప్ డేనే అంటారామె. ప్రసిద్ధ మాగజైన్ సర్వే బెస్ట్ డ్రెస్ లిస్టులో చోటు దక్కించుకున్నారు ఆకాంక్షానందా మన దేశంలో పేరొందిన స్టైల్ ఐ కాన్ గా కీర్తిస్తారు ఫ్యాషన్ డిజైనర్లు. ప్రతి నిమిషం ఫ్యాషన్ ప్రపంచంలో ఎం జరుగుతుందో ఇలాంటి డిజైన్లు వస్తున్నాయో తలుసుకుని ఆమె కొన్ని డిజైన్లు సెలక్ట్ చేస్తే అవే బ్రాండ్స్ మార్కెట్ లో కి విడుదల అవుతాయి. ఆమె సెలబ్రిటీలకే సెలబ్రిటి.

    ఫ్యాషన్ ట్రెండ్స్ పరిచయం చేసే ఆకాంక్షానందా

    నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన ఆకాంక్షానందా ఎంతో మంది టాప్ డిజైనర్లకు, స్నేహితురాల్ల కు సలహాదారికూడా. డ్రెస్సింగ్ లో స్టీల్ లో సరికొత్త బ్రాండ్స్ ని…