• ఎంతో గాఢమైన స్నేహాల్లో ఒక్కసారి డబ్బు దగ్గర చెడిపోతూ ఉంటాయి. మనం మాట్లాడే మాటలు ప్రవర్తన డబ్బు అప్పు అడగటం తీసుకోవటం ఇవన్నీ కారణాలే. డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు ఎక్సపర్ట్స్. కొత్తగా పరిచయం అయినవాళ్లు కూడా గబుక్కున పర్సనల్ విషయాలు అడిగేస్తూ వుంటారు. జీతం ఎంత ? ఈ నగ బంగారందేనా ? ఇంతకు కొన్నావు ? సొంతిల్లెనా ? ఇవన్నీ మనల్ని చిరాకు పెడతాయి ఇలాంటి సందర్భాల్లో మాట్లాడకుండా సంభాషణ దారి మళ్లిస్తే సరిపోతుందంటూన్నారు అలాగే అందరు కలిసి ఏ హోటల్లోనే టిఫిన్ తిన్నారనుకోండి తప్పనిసరిగా మొహమాటం లేకుండా అందరం పంచుకుందాం అని చెప్పేసుకోవాలి. మొహమాటం కొద్దీ భరించి స్నేహాలు విసుగు తెచ్చేలా చేసుకోకూడదు. మన స్నేహితులే మన దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకుండా వాళ్ళు మాత్రం అముఞ్చి దుస్తులు నగలు కొనుకున్నారనుకుందాం. అప్పుడు వెంటనే వాళ్ళ మొహం మీదే మా డబ్బు మాకివ్వకుండా ఇవన్నీ కొనుకున్నారా ? అని అడక్కూడదు అవి ఎవరో ఇచ్చిన కానుక కావచ్చు. లేదా వాళ్లే కొనుక్కుని ఉండచ్చు. నిజానిజాలు నిర్దారించుకుని ఆచితూచి మాట్లాడండి. లేకపోతే స్నేహాలు పోతాయి అంటున్నారు. టోటల్ మనీ మేక్ఓవర్ పుస్తకం రాసిన డాలీన్ . ఇవన్నీ డబ్బు వల్ల వచ్చే ఇబ్బందులు. ఇలాంటి సమయాల్లో మన వ్యక్తిత్వం బయట పడేలా ప్రవర్తించాలంటారాయన.

    ఇవన్నీ మనీమాటర్స్

    ఎంతో గాఢమైన స్నేహాల్లో ఒక్కసారి డబ్బు దగ్గర చెడిపోతూ ఉంటాయి. మనం మాట్లాడే మాటలు ప్రవర్తన డబ్బు అప్పు అడగటం తీసుకోవటం ఇవన్నీ కారణాలే. డబ్బు విషయంలో…

  • పెంపుడు జంతువుల పట్ల ప్రేమతో ఆస్తులు రాసిచ్చి పెళ్లిళ్లు పేరంటాలు జరిపిన వాళ్లున్నారు. తమ పిల్లల్లాగే జంతువుల్ని ప్రేమిచటం చూస్తూ ఉంటాం. అయితే మనుషుల మానసిక ఆరోగ్యాన్ని దీర్ఘకాలం పాటు సంరక్షించటం తో జంతువుల పాత్ర కీలకమని పరిశోధకులు చెపుతున్నారు. మానసిక సమస్యలు బాధిస్తుంటే పెట్టెతో ఎక్కువసేపు గడిపితే వారికి తగినంత ప్రశాంతత దొరుకుతుందని ఇటీవల నిర్విహించిన ఒక పరిశోధనలో తేలింది. యుకె లో యూనివర్సిటీ ఆఫ్ మాన్చె స్టర్ తో పనిచేస్తున్న ప్రొఫెసర్ హెలెన్ బ్రుక్స్ నేతృత్వంలో ఈ అంశం పైన ఇటీవల పరిశోధనలు నిర్వహించారు. దానిలో పాల్గొన్న ఎంతోమంది తాము మానసికంగా సంతోషంగా ఉండటంతో పెట్స్ పాత్ర ఎంతో ఉందన్నారు. ఎలాంటి ప్రతి ఫలం ఆశించకుండా నిష్కల్మషంగా ప్రేమించే పెట్స్ తమ జీవితంలో ఎదురైనా క్లిష్ట పరిస్థితులకు ఎదుర్కొనేలా ఆసరాగా నిలిచాయన్నారు. ఆత్మహత్య భావన కలిగినప్పుడు కూడా పెంపుడు జంతువులతో గడపటం వల్లే దాని నుంచి బయటపడగలిగామని కొందరు తమ అనుభవాలు చెప్పారు. పెట్స్ కోసం సమయం కేటాయించాలని తప్పని సరిగా పెంపుడు జంతువులను ఆదరించాలని స్పష్టం చేసాయి.

    పెంపుడు జంతువులతో మనశాంతి

    పెంపుడు జంతువుల పట్ల ప్రేమతో ఆస్తులు రాసిచ్చి పెళ్లిళ్లు పేరంటాలు జరిపిన వాళ్లున్నారు. తమ పిల్లల్లాగే జంతువుల్ని ప్రేమిచటం చూస్తూ ఉంటాం. అయితే మనుషుల మానసిక ఆరోగ్యాన్ని…

  • వేల ఖరీదు పెట్టుకొన్న పట్టుచీర సాధారణంగా రోజుకట్టుకోలేం అలాగని ఏళ్ల తరబడి పెట్టెల్లో పెట్టేస్తే ఉపయోగంలో లేకుండా పోవచ్చు. ముఖ్యంగా పదిసార్లు కట్టాక ఇంక ఎప్పుడూ ఇదేనా అనిపిస్తుంది. దాన్ని ఇంకేం చేస్తాం అనుకుంటే ఇలా చేసి చూడచ్చు. పట్టు చీర అంచులు చాలా బావుంటాయి. అమ్మాయిల డ్రెస్ లకు ఈ అంచులో ఎంతో అందం ఇస్తాయి. ఫ్యాషన్ లుక్ కూడా ఇస్తాయి. స్కర్ట్ కు ముందువైపు చీర కుండే అందమైనకొంగు అటాచ్ చేయచ్చు. పట్టు చేరాలన్నీ భారీగా వుండే కొంగులే ఉంటాయి కనుక అనార్కలీ గౌన్ వంటివి డిజైన్ చేయచ్చు. అలాగే అంచు తినేసాక చీర చాలా అందంగా మన్నికగా మెరుపులో నిండిన క్లాత్ లాగా ఆయిపోతుంది. దానిపై బ్లాక్ ప్రింట్ వేసి మంచి ఎంబ్రాయిడరీ చేయించి చక్కని డ్రెస్ లు కుటించుకోవచ్చు. ఇంకా మిగిలిన జరీ సాదా పట్టు క్లాత్ తో అందమైం హ్యాండ్ బాగ్స్ సెల్ ఫోన్ పీచ్ లు పెద్ద బ్యాగ్ లు కుట్టించవచ్చు. అందమైన చీర కనుక దానిలో ఎలాంటి ఎక్సపెరిమెంట్లు చేసినా బాగానే ఉంటాయి.

    పట్టు పదిరకాలుగా వాడొచ్చు

    వేల ఖరీదు పెట్టుకొన్న పట్టుచీర సాధారణంగా రోజుకట్టుకోలేం అలాగని ఏళ్ల తరబడి పెట్టెల్లో పెట్టేస్తే ఉపయోగంలో లేకుండా పోవచ్చు. ముఖ్యంగా పదిసార్లు కట్టాక ఇంక ఎప్పుడూ ఇదేనా…

  • పిల్లల్ని ప్రేమగా బాగా పెంచటంలో భాగంగా వాళ్లకు చదువులు స్కూళ్ళు తప్ప ఇంకో ప్రపంచం వుండకుండా చేస్తున్నారనీ వాళ్ళు సరిగా ఎదగటం అంటే వాళ్లకి ప్రాపంచిక జ్ఞానం అలవాటు చేయాలనీ సామజిక సత్సంబంధాలు అలవర్చుకునేలా చేయాలనీ ఎక్సపర్ట్స్ హెచ్చరిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ మనసుకి నచ్చింది చేసే అవకాశం మంచిచెడులు ఆలోచించే విజ్ఞత వారికి కలిగించాలి. పిల్లల్లకు తల్లితండ్రులు మానసికంగా అండగా ఉండాలనీ వాళ్లకు దగ్గర వుంది ప్రపంచాన్ని పరిచయం చేయాలనీ చెపుతున్నారు. ముఖ్యంగా పిల్లల జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని తల్లితండ్రులతో షేర్ చేసుకునే నమ్మకం ఇవ్వాలంటున్నారు. వాళ్ళను ఎదిగే క్రమంలో ప్రోత్సహించండి గానీ అభిప్రాయాలు వాళ్లపై రుద్దే ప్రయత్నం తప్పంటున్నారు. వాళ్ళను తప్పనిసరిగా ఒకటి రెండు భాషలు నేర్చుకునేలా ప్రోత్సాహించాలనీ క్రమశిక్షణ తో ఎదిగేలా చేయాలనీ ఎక్సపర్ట్స్ చెపుతున్నారు.

    వాళ్లకు ప్రపంచాన్ని పరిచయం చేయండి

    పిల్లల్ని ప్రేమగా బాగా పెంచటంలో భాగంగా వాళ్లకు చదువులు స్కూళ్ళు తప్ప ఇంకో ప్రపంచం వుండకుండా చేస్తున్నారనీ వాళ్ళు సరిగా ఎదగటం అంటే వాళ్లకి ప్రాపంచిక జ్ఞానం…

  • ఆరోగ్యానికి వ్యాయామం మంచిదేనని తెలిసిందే కనుక ఉదయము, సాయంత్రము నడవడం అలవాటు చేసుకొంటున్నారు. అయితే వారానికి ఐదు రోజులు పరుగెడితే మంచిదఅంటున్నారు వైద్యులు. పరుగు వల్ల ఎండోకెనాచినాయిడ్ల అనే హార్మోన్లు విడుదల కావడంతో ఆనందం లభిస్తుంది అంటున్నారు. పరుగెడితే మోకాళ్ళ పనితీరు మేరుగవుతుంది అంటున్నారు. అలాగే ఒకే రకమైన వయామం వల్ల కూడా అంత ప్రయోజనం ఉండదని వారంలో వివిధ రకాలైన వ్యాయామాలు ట్రై చేయమంటున్నారు. పరుగుతో పాటు సైకిల్ తొక్కడం హిట్, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వంటివి చేయడం తో శరీరం మొత్తానికి వ్యాయామం అందే కళ్ళు, చేతుల్లో వుండే కొవ్వు తగ్గిపోతుంది. శరీరం మొత్తానికి పని చేస్తే స్ట్రెచ్, క్రంచెను తో పాటు చతురంగా దండాసవం వ్యాయామాలు చేస్తే ఫలితం ఎక్కువ వుంటుంది. శరీరం లో అన్ని భాగాలకు కదలిక వుండే వ్యాయామాలు చేయడం వల్ల శరీరం మొత్తం చురుగ్గా, వేగంగా కదులుతుంది.

    శరీరం మొత్తానికి వ్యాయామం అందాలి

    ఆరోగ్యానికి వ్యాయామం మంచిదేనని తెలిసిందే కనుక ఉదయము, సాయంత్రము నడవడం అలవాటు చేసుకొంటున్నారు. అయితే వారానికి ఐదు రోజులు పరుగెడితే మంచిదఅంటున్నారు వైద్యులు. పరుగు వల్ల ఎండోకెనాచినాయిడ్ల…

  • ఈ సృష్టి మొత్తం సౌందర్య మాయం ప్రతి వస్తువులో ఒక అందం. సరే ఆ అందం ఎలా వుందో చూపించ మంటే మనం పువ్వులనే చూపించాలి. కానీ ప్రకృతి లోని కొన్ని రకాల పువ్వులు, ఆకుల అమెరికాలో ఒక రంగుల్లో సువసనల్లో ఒక తెలియని ఆహ్లాదం అసలు వాటిని చూస్తుంటే అద్భుతమైన కళాకారుడు అతి జాగ్రత్తగా, శ్రద్దగా, ప్రేమగా ప్రతి రేకును తీర్చి దిద్దాడనిపిస్తుంది. ఎవరీ చిత్రకారుడు? ఇవన్నీ అపురూపంగా మన సంతోషం కోసం కానుకగా ఇచ్చింది. ఎవరు? మన చుట్టూ పరుచుకున్న ఈ సృష్టి సౌందర్యాన్ని చూసేందుకే మనకు చూపు ప్రసాదించిందీ ఆసృష్టి కర్త? చూడండి ఇలాగే అనిపిస్తుంది మీకు కూడా?

    అందానికి నిర్వచనం పువ్వులే

    ఈ సృష్టి మొత్తం సౌందర్య మాయం ప్రతి వస్తువులో ఒక అందం. సరే ఆ అందం ఎలా వుందో చూపించ మంటే మనం పువ్వులనే చూపించాలి. కానీ…

  • ఒక కోట్లకు పడగలెత్తిన కుటుంబంలో యువతి పెళ్లి గురించి చాలా కొత్తగా ఆలోచించారు. తన స్తాయికి తగట్టు విందులు, వినోదాలు ఆడంబరాలు అన్ని అవతల పెట్టి తన పెళ్లి ఖర్చులతో నిరుపేదలకు నీడ నివ్వాలని కోరుకుంది. ఆమె మహారాష్ట్ర లోని ఓరంగాబాద్ జిల్లా కు చెందిన శ్రీయ ముహర్. ఆమె అత్తింటి వాళ్ళు భర్త, అత్త మామలు ఆమె ఆశయానికి మద్దత్తు పలికారు. పెళ్ళికి అయ్యే ఖర్చు తో 108 ఇల్లు నిర్మించి ఇవ్వాలనుకున్నారు. పెళ్లి నాటికి 90 ఇల్లు పూర్తయ్యాయి. ఆ పేద కుటుంబాల వారికి పెళ్ళికి ఆహ్వానించి కళ్యాణ మండపం లోనే ఇళ్ళకు సంబందించిన తాళాలు వాళ్ళకు అందజేసి అందరి ఆశీర్వాదాలు అందుకున్నారు. తన పెళ్లి తన జివితం లోనే కాకుండా మరెన్నో కుటుంబాలలో సంతోషం నింపాలని కోరుకుంది శ్రీయ ముహర్.

    పెళ్ళి ఖర్చు తో పేదలకు ఇళ్ళు

    ఒక కోట్లకు పడగలెత్తిన కుటుంబంలో యువతి పెళ్లి గురించి చాలా కొత్తగా ఆలోచించారు. తన స్తాయికి తగట్టు విందులు, వినోదాలు ఆడంబరాలు అన్ని అవతల పెట్టి తన…

  • రేగి పండులో నిండగా పోషకాలు

    రేగి పండులో నిండగా పోషకాలు

    రేగి వడియాలు తిన్నారా? రేగి పండ్లు కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఒత్తిడిగా, ఆదుద్దాగా అనిపించినప్పుడు రెండు రేగి పండ్లు తింటే ఎంతో ఫలితం వుంటుంది. రేగి…

  • ఎన్ని సదుపాయాలున్నా కార్లో అయినా ఏకంగా ఎక్కినా పసి పిల్లలతో ప్రయాణం ఎప్పుడూ ఇబ్బందే. కొత్త చోట కిక్కిరిసిన మనుషుల మధ్యన పిల్లల్ని సముదాయించటమే కష్టమయితే వాళ్ళకి అవసరాం అయ్యే ప్రతి వస్తువు సర్దుకుని ప్రయాణం అవటం ఇంకా కష్టం. పాలసీసాలు డైపర్లు నీళ్ల సీసాలు వేసేముందులు అన్నీ అవసరమే. తీరా నిద్రొస్తే వాళ్ళను సుఖంగా పాడుకోబెట్టటం కష్టమే. ఇలాంటి సమస్యకి పరిష్కారంగా ప్రత్యేకంగా రూపొందించిన బేబీ బ్యాగ్ మార్కెట్ లో వుంది. చూసేందుకు బ్యాగ్ లా కనిపిస్తుంది కానీ ఇందులో పాపాయికి ఉపయోగపడే సర్వం పెట్టుకునే అరలన్నీ ఉంటాయి. అలాగే అవసరం దాన్నే మంచం లాగా అచ్చం ఉయ్యాలా లాగా నాలుగువైపులా రక్షణ ఉండేలా మార్చేయచ్చు. ప్రయ్నమ్ పూర్తవగానే దాన్ని వెంటనే మడిచేయచ్చు. వెంట తీసుకుపోవటం చాలా ఈజీ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చుడండి.

    పాపాయి కోసం బ్యాగు మంచం

    ఎన్ని సదుపాయాలున్నా కార్లో అయినా ఏకంగా ఎక్కినా పసి పిల్లలతో ప్రయాణం ఎప్పుడూ ఇబ్బందే. కొత్త చోట కిక్కిరిసిన మనుషుల మధ్యన పిల్లల్ని సముదాయించటమే కష్టమయితే వాళ్ళకి…

  • ప్రపంచం మారిపోయిందని అప్పుడప్పుడు చాలా భ్రమ కలుగుతూవుంటుంది. కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగు కనపడుతుంది. నింగిన మెరిసిన తరల్లాంటి కొందరు విజేతలను చూసి ముచ్చట పడేంత లోపే ఎక్కడో అంధకారపు ఒక ఆర్తనాదం కాళ్ళు నెలకు ఆనేలా చేస్తుంది. రుతుస్రావం పై అపోహలు అపవిత్రత ముద్రలు కొత్తవి కావు. మన దేశంలో ఆ మూడు రోజులు ప్రత్యేకమైన గది కేటాయించే పద్దతి వుంది. పొరుగు దేశం నేపాల్ లో చౌపది అనే పేరుతో ఊరికి దూరంగా గుడిసెలు కడతారు. అమ్మాయిలు అక్కడే ఉండాలి. అక్కడి ప్రభుత్వం 2005 లో చట్టం తెచ్చినా ప్రయోజనం లేదు. ఈ దురాచారానికి వ్యతిరేకంగా నేషనల్ పబ్లిక్ రేడియో ప్రచారం చేస్తుంది. ఈ గుడిసెల్లో గ్రామం బయట ఉండటం వల్ల కూడా జంతువుల భయం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇరవై ఆరేళ్ళ అమ్మాయి గుండె పోటుతో అరుపులు ఊరివారు వినక నిస్సహాయంగా చనిపోయిందని రేడియో చెపుతోంది. గత తొమ్మిదేళ్లలో మహిళలు పురుగు పుట్రా కుట్టి చనిపోయారట.

    ఇంకా ఈ దురాచారం పోలేదు

    ప్రపంచం మారిపోయిందని అప్పుడప్పుడు చాలా భ్రమ కలుగుతూవుంటుంది. కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగు కనపడుతుంది. నింగిన మెరిసిన తరల్లాంటి కొందరు విజేతలను చూసి ముచ్చట పడేంత లోపే…