• అడ్వార్టైజ్మెంట్స్ చూసో అలవాటుగానో సౌందర్య ఉత్పత్తులను కొంటారు. వాటిని ఎంత మోతాదు లో వాడాలో రాసివుండదు కనుక తోచినంత రాస్తూ వుంటారు. ఈ ఉత్పత్తి ఈ మోతాదులో రాసుకుంటే ఫలితం ఉంటుందో ఎలా ఉపయోగించాలి. అప్పుడే సరైన ఫలితమ్ కనిపిస్తుంది. ముఖాన్ని శుభ్రం చేసే క్లీన్సర్ ని రెండు బఠాణీ గింజల పరిమాణంలో తీసుకోవాలి. అందులో దూది ముంచి రాస్తే ముఖం పైన తేలికగా పరుచుకునేంతగా సరిపోతుంది. మిలిగిలినది మీద భాఫానికి సరిపోతుంది. సీరమ్ లేదా చర్మ చికిత్స కు వాడే క్రీములు వేలిపైకి తీసుకుని ముఖానికి ఎక్కడ అవసరమో అక్కడే రాయాలి. తక్కువే రాస్తే మంచిది. మొహం మొత్తం పరుచుకోకుండా చూడాలి. మృతకణాలను తొలగించే పూతైతే అందులో రసాయనాలు ఉంటాయి కనుక వేలితో చాలా తక్కువ పరిమాణంలో తీసుకుని వారానికి ఒక్కసారి మాత్రమే రాయాలి. అదే సహజమైన పదార్ధాలతో చేసిన దైతే వారానికి మూడు సార్లు రాసినా నష్టం లేదు. దేనినెంత వాడాలో తెలుసుకుంటే ఉపయోగం.

    అవసరాన్ని మించి వాడితే నష్టం

    అడ్వార్టైజ్మెంట్స్ చూసో  అలవాటుగానో సౌందర్య ఉత్పత్తులను కొంటారు. వాటిని ఎంత మోతాదు లో వాడాలో రాసివుండదు కనుక తోచినంత రాస్తూ వుంటారు. ఈ ఉత్పత్తి ఈ మోతాదులో…

  • గురుదేవోభవ అన్నారు పెద్దలు. దీన్ని ప్రపంచ సుందరి కూడా మనసారా తీసుకుంది. బచ్చన్ ల కోడలు ఐశ్వర్యా రాయి తన గురువు లతా సురేంద్ర కనిపించగానే కృతజ్ఞతతో చేతులు జోడించి పాదాలకు నమస్కారం చేసి తన వినయాన్ని చాటుకుంది. వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ డాన్స్ ముంబై లోని సహారా స్టార్ లో జరిగింది. లతా సురేంద్ర ప్రఖ్యాత నాట్యగురువు. ఆమె శిష్యులు ఎంతో మంది దేశవిదేశాల్లో పేరు ప్రఖ్యాతలు పొందినవాళ్లు ఐశ్వర్య తాను రెండో తరగతి నుంచి ఏడో తరగతి చదివే వరకు లత దగ్గర డాన్స్ నేర్చుకుంది. వేదిక పైన గురువు లతా కనిపించగానే ఐశ్వర్య పట్టలేని సంతోషంతో పొంగిపోయింది. గురువు పాదాలకు నమస్కారం పెట్టగానే ఆహ్వానితులందరూ ఒక్కసారి లేచి నిలబడి తమ గౌరవం ప్రకటించారు. అందనంత ఎత్తులో వుండేది గురుస్థానం ఐశ్వర్య వంటి సెలబ్రెటీ గురువు కనిపించాగానే ఆమెను కౌగలించుకుని నమస్కరించటం అది ఐశ్వర్య సంస్కారం లతా అదృష్టం.

    ఇది కళాకారుల అపూర్వ సమ్మేళనం

    గురుదేవోభవ అన్నారు పెద్దలు. దీన్ని ప్రపంచ సుందరి కూడా మనసారా తీసుకుంది. బచ్చన్ ల కోడలు ఐశ్వర్యా రాయి తన గురువు లతా సురేంద్ర కనిపించగానే కృతజ్ఞతతో …

  • సాధారణంగా మనింట్లో మనకి పనికి రాని వస్తువులుంటే ఇంట్లో అడ్డంగా ఎందుకు అనుకుని పారేస్తాం. కానీ అలాంటి పనికి రాని చెత్తను కూడా పనికొచ్చే కళాఖండాలను చేస్తారు ఇంకొందరు. అవి పర్యాటక ప్రదేశాలైతే ఎలా వుంటుందీ ? ఎల్మార్ లాంగ్ అనే వ్యక్తికి పనికి రాని వస్తువులు సేకరించే అలవాటుంది, వాళ్ళ నాన్న కూడా ఇతనితో కలిసి ఎన్నో వస్తువులు సేకరించార. తండ్రి చనిపోయాడు . ఎల్మార్ చుట్టూ ఎన్నో పనికిరాని ఇనుప వస్తువులు సీసాలు బోలెడన్ని పోగుపడి వున్నాయి. బాగా ఆలోచించి ఒక కడ్డీ కి ఎన్నో సీసాలు అతికించి చూసాడు. ఎండలో ఎన్నో రంగులతో ఆ సీసాల చెట్టు మెరుస్తోంది. ఇంకంతే సేకరించిన సీసాలకు వందలాది సీసాల చెట్లు తయారు చేసాడు. వాటికీ బాటిల్ ట్రీరంచ్ అని పేరు పెట్టాడు. ఈ చెట్ల అందం చూడాలంటే కాలిఫోర్నియా లోని మోజావే కౌంటీ కి వెళ్ళాలి. ఈ ఇమేజెస్ అన్నీ సరదాగా చూడండి. అన్నిట్లో ఈ సీసాచెట్లని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారట.

    అందమైన సీసాల చెట్లు

    సాధారణంగా మనింట్లో మనకి పనికి రాని వస్తువులుంటే ఇంట్లో అడ్డంగా ఎందుకు అనుకుని పారేస్తాం. కానీ అలాంటి పనికి రాని చెత్తను కూడా పనికొచ్చే కళాఖండాలను చేస్తారు…

  • ఉద్యోగ జీవితం ఎప్పుడూ సవాళ్ల మయమే. ఎంతోమంది సహోద్యోగులతో కలిసి పనిచేయాలి. ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అవి మన కెరీర్ పైన కూడా ప్రభావం చూపెడతాయి. కానీ కొంత జాగ్రత్తతో తెలివిగా మెలిగితే ఉద్యోగ సోపానాలు తేలికగా ఎక్కేయచ్చు. ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలిసి వచ్చినప్పుడు కొత్త పని చేయవలిసివచ్చినప్పుడు ఎప్పుడు సహోద్యోగ సలహాలు తీసుకోకూడదు. మన ఉద్యోగం పట్ల మన బాధ్యత పట్ల మనకే ఒక స్పష్టత ఉండాలి. ఉద్యోగంలో చేరగానే అక్కడ నియమ నిబంధనలు తెలియకపోవచ్చు. సంస్థ పెద్దవో చిన్నదో దానికి పరిధులు నియమాలు ఉంటాయి వాటిని తెలుసుకుని అర్ధం చేసుకుని ఉద్యోగంలో ఇమిడిపోయే ప్రయత్నం చేయాలి. అన్నింటికంటే ముఖ్య విషయం ధైర్యం. చాలా మంది అమ్మాయిలు స్కూల్ లాగా ఆఫీసుల్లో కూడా వెనక ఉండేందుకు సీనియర్లు ఉన్నతాధికారుల ముందు నోరు విప్పకుండా ఉండేందుకే ప్రయత్నిస్తారు. కానీ ఉద్యోగ జీవితం ఒక భవిష్యత్తు. తెలివి తేటలు నిరూపించుకుని ముందుకువెళ్ళే రాజమార్గం. ఎప్పుడూ ముందే ఉండాలి. మిమల్ని మీరే ఆవిష్కారించుకోవాలి. అప్పుడే అద్భుతమైన కెరీర్ దక్కుతుంది.

    ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్ లోనే ఉండాలి

    ఉద్యోగ జీవితం  ఎప్పుడూ  సవాళ్ల మయమే. ఎంతోమంది సహోద్యోగులతో కలిసి పనిచేయాలి. ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అవి మన కెరీర్ పైన కూడా ప్రభావం చూపెడతాయి.…

  • ఏడడుగులబంధం కోసం ఆచితూచి అడుగులేస్తున్నారు అమ్మాయిలు. తన చేయి పట్టుకుని జీవితాంతం తోడుగా నిలబడే వ్యక్తి వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారని విద్యావంతులైన మగవాళ్లనే పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారని ఒక మ్యారేజ్ వెబ్సైట్ సర్వేలో తేలింది. ఇందులో 6000 మంది వినియోగదారులు అభిప్రాయాలూ తీసుకున్నారు. ఆడపిల్లల అభిప్రాయాలను తీసుకుంటే ప్రతి ఇద్దరు ఆడపిల్లల్లో ఒకళ్ళు ఉమ్మడి కుటుంబాలకు చెందిన మగవాళ్ళని పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారు. 60 శాతం మంది అమ్మాయిలకు కులం గురించి పట్టింపే లేదు. ప్రతి పదిమంది ఆడపిల్లల్లో ఆరుగురు యువతులు చూడచక్కని వాళ్ళని ఎంచుకోకుండా వాళ్లే ప్రొఫైల్స్ చూస్తున్నారు. 40 శాతం మంది అమ్మాయిలు వాళ్ళ జీవిత భాగస్వాములను వాళ్లే ఎన్నుకుంటున్నారు. తమ గురించి చెప్పటంలో ఎదుటివాళ్ళ గురించి తెలుసుకోవడంలో అమ్మాయిలే మాట కలుపుతున్నారు. ముఖ్యమైన మాట 85 శాతం మహిళలు కనీసం బ్యాచిలర్ డిగ్రీ అన్నా ఉంటే తప్ప డబ్బు రూపం వున్నా వద్దులే అంటున్నారు.

    విద్యావంతులైతేనే సరే అంటున్నారు

    ఏడడుగులబంధం కోసం ఆచితూచి  అడుగులేస్తున్నారు అమ్మాయిలు. తన చేయి పట్టుకుని జీవితాంతం తోడుగా నిలబడే వ్యక్తి వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారని విద్యావంతులైన మగవాళ్లనే పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారని ఒక…

  • కోడి గుడ్డును డాక్టర్ల నడిగితే పోషకాల మాయం అంటున్నారు. అదే ఫరా సయిడ్స్ ని అడిగితే అందమైన కళారూపం అంటుంది. అమెరికాలోని స్థిరపడ్డ భరతీయిరాలు ఈమె. ప్రముఖ ఎగ్గ్ ఆర్టిస్ట్. ఆమె ఈ గుడ్డు తో కళాకృతులు తాయారు చేస్తుంది. ఆమెకు గుడ్డును చుస్తే చాలట మంచి ఐడియాలు వచ్చేస్తాయి. రకరకాల గుడ్లు సేకరించి వాటి లోపల భాగాన్ని తీసేసి డొల్ల గా మారిన గుడ్డు తో అందమైన కళాకృతులు చేసేస్తుంది. అతి సున్నితం గా వుండే గుడ్డు పెంకు పైన చిత్రాలు వేయడం, వాటికి అలంకరణ చేయడం చాలా కష్టమైన పని. కానీ ఫరా సయిద్ ఈ పనులన్నీ చాలా తేలికగా చేయగలదు. ఈ అందమైన గుడ్డు బొమ్మల డెకోరేషన్ పీసెస్ గా చాలా బాగుంటాయి. ఆమె ఎగ్గ్ కలక్షన్స్ అన్ని చూడాలంటే ఆమె పెర్స్ నల్ వెబ్ సైట్ www.eggdocs.com లో చూడోచ్చు. స్త్రీల కోసం ఆమె ఎన్నో చారిటి ఈవెంట్స్ క్రియేట్ చేస్తుంది.

    ఈ బొమ్మలన్నీ వెరీ ‘గుడ్డు’

    కోడి గుడ్డును డాక్టర్ల నడిగితే పోషకాల మాయం అంటున్నారు. అదే ఫరా  సయిడ్స్ ని అడిగితే అందమైన కళారూపం అంటుంది. అమెరికాలోని స్థిరపడ్డ భరతీయిరాలు ఈమె. ప్రముఖ…

  • కళాకారులు నుతనత్వాన్ని ప్రవేస పెట్టాలని చూస్తారు. అందరు పాడిన పాటే మనం పాడితే తప్పేం ఉంది. ఆస్ట్రియన్ మ్యుసికల్ గ్రూప్ వెజిటబుల్ అర్కిస్త్రా తో సంగీత ప్రియులను అలరించేందుకు ముందుకొచ్చారు. పది మంది గాయకులు, ఒక కుక్, ఒక సౌండ్ టేక్నీషియన్ ఉంటారీ గ్రూప్ లో, క్యారెట్, ముల్లంగి పిల్లన గ్రోవి, బీరకాయ, క్యాప్సికమ్ తో ట్రంపెట్ ఇలాగే కూరగాయలతో సంగీత పరికరాలు అప్పటికి అప్పుడు తాయారు చేస్తారు. తమ అనుభవం తో ఒక అద్భుతమైన సంగీత కచేరి ఇస్తారు. కేవలం వినుల విందైన సంగీతాన్ని ఆస్వాదించడమే కాదు సంగీత వాయిద్యాలను తాయారు చేసే క్రమంలో మిగిలిన కురగాయలతో షో కు వచ్చిన వాళ్ళకు మంచి విందు కూడా ఇస్తారు. ఈ పసందైన వినుల విందు కార్యక్రమానికి ఎంతో ప్రోత్సాహం. ఎంతో మంది అభిమానులు ఇప్పటికే ఎన్నో రికార్డులు రిలీజ్ చేసారు కూడా.

    ఇది పసందైన పాటల విందు భోజనం

    కళాకారులు నుతనత్వాన్ని ప్రవేస పెట్టాలని చూస్తారు. అందరు పాడిన పాటే మనం పాడితే తప్పేం ఉంది. ఆస్ట్రియన్ మ్యుసికల్ గ్రూప్ వెజిటబుల్ అర్కిస్త్రా తో సంగీత ప్రియులను…

  • Christian Dior కలక్షన్స్ లో ఒక తెల్లటి టీ షర్టుల పైన వేసిన నినాదం ఇవ్వాళ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. We should all be fiminists. ఈ నినాదం ఎంతో మంది స్త్రీలను ఆకట్టు కుని ట్రెండ్ సెట్టర్ అయింది. ఇవాల్టి ఫ్యాషన్ ప్రపంచపు బెస్ట్ టీ షర్టు ఇది. అమ్మాయిల మనస్సు దోచుకుంటుంది అని వేరే చెప్పాలా? ఇదే పేరు తో నైజీరియన్ రైటర్ Chimamanda Ngozi Adichie లో రాసిన నవల కూడా బెస్ట్ సెల్లర్స్ లో ఒకటి. సొసైటీలో మార్పు వస్తేనే సమానత్వం సాధ్యం అంటుంది రచయిత్రి Adichie.

    ఫ్యాషన్ ప్రపంచపు బెస్ట్ నినాదం

    Christian Dior కలక్షన్స్ లో ఒక తెల్లటి టీ షర్టుల పైన వేసిన నినాదం ఇవ్వాళ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. We should all be fiminists. ఈ…

  • ఉదయపు అల్పాహారం మంచి శక్తిని ఇచ్చేదిగా కొవ్వు తగ్గించేదిగా ఉండాలంటున్నారు డైటీషియన్లు. వాల్నట్ బాదం శరీరానికి శక్తి ఇస్తాయి. కొవ్వు తగ్గిస్తాయి. పెరుగు పాల పదార్ధాలు పండ్లు కలిపి ఎండుఫలాలు వాల్నట్స్ బాదం పలుకులు కలిపి తింటే రోజంతా ఉత్సాహమే. ఓట్స్ ఎంతో మంచివి. బరువు తగ్గటమే కాదు ఆరోగ్యానికీ మంచివే. వెన్న లేని పాలతో తింటే కేలరీలు తగ్గుతాయి. అరటి పండ్లు ముక్కలు. ఎండు ద్రాక్ష పండ్లు నానబెట్టి పొట్టు తీసిన బాదం గింజలు తింటే బలానికి బలం. ఆరోగ్యం రాగి జావ ఎంతో మంచిది. ఇనుము కాల్షియం ఎక్కువ. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తహీనత దూరం అవుతుంది. బెల్లం యాలకులు వెన్న లేని పాలు బాగా మగ్గిన పండ్లు కలిపి తీసుకుంటూ త్వరగా ఆకలివేయకుండా పైగా ఎంతో బలం కూడా.

    బరువు తగ్గించి శక్తి నిచ్చే అల్పాహారం

    ఉదయపు అల్పాహారం మంచి శక్తిని ఇచ్చేదిగా కొవ్వు తగ్గించేదిగా ఉండాలంటున్నారు డైటీషియన్లు. వాల్నట్ బాదం శరీరానికి శక్తి ఇస్తాయి. కొవ్వు తగ్గిస్తాయి. పెరుగు పాల పదార్ధాలు పండ్లు…

  • అన్నదమ్ములూ అక్కాచెల్లెళ్లు ఎంత ఎక్కువమంది ఉంటె అంత లాభం అని అమెరికన్ సోషియాలజికల్ అసోసియేషన్ చేసిన ఒక సర్వే లో తేలింది. ముఖ్యంగా విడాకుల తీసుకుని సంఖ్య చాలా తక్కువగా ఉంటుందీ అంటున్నారు. అలాగని తోబుట్టువులు భార్యాభర్తల మధ్య వచ్చే తగువులు తీరుస్తారని కాదు. ఒక్కరుగా పెరిగిన వారికంటే ఎక్కువ మందితో పెరిగిన వారిలో ప్రేమానందాలతో పాటు పంతాలు పట్టింపులూ ఆ వెనకనే పట్టువిడుపులు సర్దుబాటు జీవితంలో ఒక భాగమై పోతాయి. ఈ రకమైన నైపుణ్యాలు అలవర్చుకునేవాళ్లు వైవాహిక జీవితంలో చాలా సులభంగా సర్దుకుపోగలుగుతారు. అందుకే కుటుంబం అన్నది ఎంత ఉంటే అంత లాభం అంటున్నారు సామజిక నిపుణులు. ఆలా కాకుండా ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున పెరిగిన వాళ్లలో అన్నది ఈ రకమైన నైపుణ్యాలు తక్కువనీ వాళ్ళకి సర్దుకుపోవటం అన్నది జీర్ణం కాదనీ అందుకే విడాకుల సంఖ్యా ఎక్కవవుతున్నాయంటున్నారు విశ్లేషకులు.

    విడాకుల సంఖ్యా తగ్గాలంటే ………!

    అన్నదమ్ములూ  అక్కాచెల్లెళ్లు  ఎంత ఎక్కువమంది ఉంటె అంత లాభం అని అమెరికన్ సోషియాలజికల్ అసోసియేషన్ చేసిన ఒక సర్వే లో తేలింది. ముఖ్యంగా విడాకుల తీసుకుని సంఖ్య …