• దేశంలోని సినిమా హాళ్లలో తప్పనిసరిగా జాతీయ గీతాన్ని వినిపించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఉత్పాదులు జారీ చేసింది. ఈ గీతాన్ని రచించిన రవీంద్ర నాథ్ ఠాగూర్ మన దేశాన్ని ఎంతో ప్రేమించారు. భారత భాగ్య విధాత అనే శీర్షిక 1911 లో రాసిన ఈ గీతం దేశ భవిష్యత్తును ఒక రధసారధి లా ఎలా ముందుకు నడిపించాలో చెపుతుంది. జనగణమన ఇక నుంచి మన కొత్త గణ తంత్ర రాజ్యానికి జాతీయగీతమని దాన్ని అందరూ గౌరవించాలని 1950 జనవరి 29 న రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఓ ప్రకటన చేసారు. ఆ ప్రకటనే ఒక శాసనంగా ఇప్పటివరకు అమలు జరుగుతూ వుంది. జాతీయ గీతం జాతీయ పతాకం వల్ల గౌరవం ప్రేమాభిమానాలు ప్రదర్శించటం అంటే మాతృ భూమిని గౌరవించుకోవటమే. దీన్ని గౌరవించి ఆదరించటం ప్రజల్లో సహజ సిద్ధంగా రావాలని సుప్రీమ్ కోర్టు తన ఉత్పాదుల్లో వ్యాఖ్యానించింది. ఇప్పుడు సినిమా హాళ్లలో వేస్తున్నారు. తప్పనిసరిగా లేచినిలబడి గౌరవించండి.

    లేచి నిలబడి గౌరవించండి

    దేశంలోని సినిమా హాళ్లలో తప్పనిసరిగా జాతీయ గీతాన్ని వినిపించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఉత్పాదులు జారీ చేసింది. ఈ గీతాన్ని రచించిన రవీంద్ర నాథ్ ఠాగూర్ మన…

  • ఆరోగ్యం ఇవ్వటంలో సోయాగింజల పాత్ర ఎక్కువే ఉందంటున్నాయి అధ్యయనాలు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న సొయా దాని ఉత్పత్తులు మన దేశపు మార్కెట్ నీ ఆకట్టుకున్నాయి. సొయా నట్స్ సొయా బీన్స్ సొయా మిల్క్ సొయా యోగర్ట్ సొయా ఇసోలెన్స్ సొయా లెసిటిన్స్ మన మార్కెట్ నింపేస్తున్నాయి. శాఖాహారులకు అవసరం అయ్యే ప్రోటీన్లు అందేది సొయా ద్వారానే సొయా అనేది మాంసానికి ప్రత్యామ్నాయం అన్నది ప్రచార అంశం . సొయా ఎడమేమ్ అనేది ఉడికించి ఉప్పుతో కలిపి చిరుతిండిగా తినచ్చు. సోయాను సూప్ లు సలాడ్స్ లో కలుపుకుని తినచ్చు. సొయా సూప్ మంచిదే. ఆవుపాలు బదులు సొయా పాలు వాడటం మొదలు పెట్టచ్చు. సోయా ఉత్పత్తులు ఉదయపు అల్పాహారం మధ్యాహ్నం చిరుతిండిగా బేకింగ్ చేసిన వంటకాల్లో శాండ్ విచెస్ కాస్ రోల్స్ స్టెరిఫీడ్ ద్వారా సోయాకి ఎదో రకంగా తీసుకుంటే ఈ పోషక విలువల్ని సోయా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

    ప్రోటీన్ల మయం సోయా

    ఆరోగ్యం ఇవ్వటంలో సోయాగింజల పాత్ర ఎక్కువే ఉందంటున్నాయి అధ్యయనాలు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న సొయా దాని ఉత్పత్తులు మన దేశపు మార్కెట్ నీ ఆకట్టుకున్నాయి. సొయా నట్స్…

  • ఈ ఏడాది ప్రపంచ సుందరి కిరీటాన్ని కరేబియన్ దీవుల్లో ఒకటైన ప్యూర్టోరికో చెందిన స్టీఫెనీ డెల్ వాలే సొంతం చేసుకున్నారు. అమెరికాలోని ఆక్సిన్ హిల్ సిటీలో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. గత ఏడాది ప్రపంచ సుందరి విజేత మిరెయాలాలా గునా 2016 విజేత స్టీఫెనీ తలపై మిస్ వరల్డ్ కిరీటాన్ని అలంకరించింది. స్పెయిన్ ఇంగ్లిష్ ఫ్రెంచ్ అనర్గళంగా మాట్లాడగల ఈ 19 సంవత్సరాల స్టీఫనీ త్వరలో వినోద రంగంలోకి అడుగుపెడుతోందిట. ఇంత ప్రతిష్టాత్మిక పోటీలో తన దేశం తరఫున బరిలోకి దిగటం తనకెంతో గర్వకారణమని ఈ కరేబియన్ సుందరి స్టీఫనీ చెపుతోంది. మొదటి రన్నరప్ గా డొమినియన్ రిపబ్లిక్ కు చెందిన యరిట్టామిగులే నారెయిన్ రమిరేజ్ , రెండో రన్నరప్ గా ఇండోనేషియాకు చెందిన నటాషా మాన్యుయెల్లా నిలిచారు.

    ప్రపంచ సుందరిగా స్టీఫెనీ డీవాలే

    ఈ ఏడాది ప్రపంచ సుందరి కిరీటాన్ని కరేబియన్ దీవుల్లో ఒకటైన ప్యూర్టోరికో చెందిన స్టీఫెనీ డెల్ వాలే సొంతం చేసుకున్నారు. అమెరికాలోని ఆక్సిన్ హిల్ సిటీలో మిస్…

  • సహజంగా ఈ సీజన్ ను బద్దకపు సీజన్ అనచ్చు. సూర్యకాంతి అంతగా లేకపోవటం చలికారణంగా ఉదయాన్నే లేవాలనిపించకపోవటం ఇవన్నీ మెలిటోనిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువకావటం వల్లనే. సూర్యకాంతి లేక విటమిన్ డి ఉత్పత్తి దాకా తగ్గిపోతుంది. బద్ధకం వదిలించుకోవటం కోసం సూర్యకిరణాలు తగిలేలా గడపటమే పరిష్కారం. మంచి పోషకాలున్న టిఫిన్ తీసుకుంటే శరీరంలో శక్తి నిల్వలు పెరుగుతాయి. తప్పనిసరిగా సింపుల్ ఏరోబిక్స్. ధ్యానం ప్రాణాయామం రిలాక్సేషన్ పద్ధతులు ఉపకరిస్తాయి. శరీరంలో తగినంత నీరు లేకపోతే కూడా పని సామర్ధ్యం తగ్గిపోతుంది. అన్ని అవయవాలకు రక్తప్రసరణ తగ్గి మెదడు పని విధానం నెమ్మదిస్తుంది. దప్పిక అయ్యేవరకు ఆగకుండా నీళ్లు తాగాలి. కార్బోహైడ్రాట్స్ చక్కర తక్కువగా వుండే పదర్ధాలు తినాలి. దీనివల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. చల్ల గాలి వస్తున్నా కిటికీలు తీసేవుంచాలి. పడుకునేముందర వేడినీళ్లు స్నానం వల్ల కొత్త ఉత్తేజం కలుగుతుంది. చక్కని నిద్రకోసం ఉపకరిస్తుంది. సీజన్ ఏదైనా వాతావరణం ఎలా వున్నా దేనినైనా హాయిగా ఎంజాయ్ చేయాలి.

    అలసటగా వుందా

    సహజంగా ఈ సీజన్ ను బద్దకపు సీజన్ అనచ్చు. సూర్యకాంతి అంతగా లేకపోవటం చలికారణంగా ఉదయాన్నే లేవాలనిపించకపోవటం ఇవన్నీ మెలిటోనిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువకావటం వల్లనే. సూర్యకాంతి…

  • చేతిలో చాక్ పీస్ చిక్కితే చాలు పిల్లలు ఇల్లంతా వాళ్ళ ఆర్ట్ తో నింపేస్తారు. వాళ్లకు వేసే బొమ్మల్లో ఇష్టమైనదేదో ఉంటుంది . దాన్ని మళ్ళీ మళ్ళీ గీస్తుంటారు. ఆ ఇష్టమైన చిత్రం ఒక బొమ్మగా మారిపోయి వాళ్ళ చేతుల్లోకి వస్తే ఇలాంటి ఆలోచనలు అమెరికాలో కొన్ని సంస్థలు ఇలాంటి బొమ్మలు తయారుచేస్తున్నారు. మన పిలల్లకు వాళ్ళు గీసిన బొమ్మలను బహుమతిగా ఇవ్వాలనిపిస్తే బడ్ సీస్ ద్వారా తెప్పించుకోవచ్చు. ART@ BUDSIES.COM మెయిల్ చేస్తే సంస్థకు సంభందించిన వివరాలు ఫోన్ నెంబర్ దొరుకుతాయి. ఇలాంటివి కాన్సర్ చికిత్స చేయించుకుంటున్న చిన్న పిల్లల కోసం ఇవ్వచ్చు. పేద పిల్లలకు పంచవచ్చు. మనింట్లో బంగారుపాప పుట్టినరోజు వస్తే ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే . పిల్లలు గీసే చక్రాల్లాంటి కళ్ళు పుల్లలాంటి కాళ్లు, చేతులు ఒక్కసారి నాలుగైదు చేతులు పెద్దపొట్ట ఇవన్నీ యధాతధంగా బొమ్మలై పోయి మనింటికొస్తాయి. childsown .com ట్రై చేయచ్చు.

    గీస్తే బొమ్మ చేసిస్తారు

    చేతిలో చాక్ పీస్ చిక్కితే చాలు పిల్లలు ఇల్లంతా వాళ్ళ ఆర్ట్ తో నింపేస్తారు. వాళ్లకు వేసే బొమ్మల్లో ఇష్టమైనదేదో ఉంటుంది . దాన్ని మళ్ళీ మళ్ళీ…

  • సంక్రాంతి పండుగ మొదలైంది. ఇది ఉత్తరాయణ పుణ్యకాలం. దేవునికి సంబందించిన కార్యాలనే చేయాలనే ఓ నియమాన్ని చేస్తూ సూర్యుడు ధనరాశి లోకి ప్రేవేశించిన రోజుని నెల పెట్టడం అనే పేరు తో పిలిచారు పెద్దలు. ఈ నెల రోజులు నెల నిండగా తెల్లని ముగ్గులు శ్రీ హరిని కీర్తిస్తూ హరి దానుల దాకా, జంగమ దేవరల పలకరింపు కాలపు మార్పులను సూచిస్తూ వినోదాన్ని పంచే పిట్టల దోరలు బూడ బుక్కల పాటలు ఇవన్నీ సంక్రాంతి పర్వ దినాల్లో పల్లెటూరులో సందడి చేసేవి. కాలం మారి పోయి పట్టణాలకు తరలి వచ్చిన ఈ సంప్రదాయపు పండుగని జరుపుకుంటునే ఉన్నారు. చివరకు అమెరికాలో స్థిరపడిన ఆంధ్రులు కూడా ఈ పండుగని మరచిపోలేదు. అలాగే గోదాదేవి రచించిన ౩౦ పాశుణలనీ పాడుతూ ఈ నెల రోజులు పండుగ జరపడం ద్రవిడ దేశాల్లో ఆచారంగా వుంది.

    సంక్రాంతి వేడుక మొదలైంది

    సంక్రాంతి పండుగ మొదలైంది. ఇది ఉత్తరాయణ పుణ్యకాలం. దేవునికి సంబందించిన కార్యాలనే చేయాలనే ఓ నియమాన్ని చేస్తూ సూర్యుడు ధనరాశి లోకి ప్రేవేశించిన రోజుని నెల పెట్టడం…

  • సీజన్ ఫ్యాషన్ తో సందర్భం లేకుండా క్రేప్ సిల్క్ శారీస్ ఏ సందర్భానికైనా చెక్కగా సరిపోతాయి. మెత్తగా, పల్చగా వుండే ఈ చీరల పైన ఎలాంటి డిజైన్ అయినా అందమే క్రేప్ డిజిటల్ ప్రింట్స్ ఏ చిన్నపాటి ఫంక్షన్ లో అయినా ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి. ఎలాంటి పెద్ద హడావిడి లేకుండా కాజువల్ గా ఆఫీస్ వేర్ గా కూడా బాగుంటాయి. బ్లూ, రెడ్, నేవీ బ్లూ, రానీ పింక్ ప్రత్యేకంగా ఎల్లో శారీస్ ఫ్యాషన్ డిజైనర్ల కలక్షన్స్ లో చోటు చేసుకుంటున్నారు. ఎల్లో కలర్ క్రేప్ ఫెస్టివల్ శారీస్ అయితే ప్రేత్యేకంగా రేపు రాబోయే పండుగల కోసం డిజైన్ చేసినవే. ఈ చీరల పైకి స్లీవ్ లెస్, ఫుల్ హాండ్స్, నెక్ బ్లౌజులు కూడా చాలా చెక్కగా నప్పుతాయి. కంఫర్టబుల్ శారీస్ ఈ ముందు వరసలో ఈ క్రేప్ డిజైన్స్ ఉంటాయి.

    ఫెస్టివల్స్ ప్రత్యేకం క్రేప్ శారీస్

    సీజన్ ఫ్యాషన్ తో సందర్భం లేకుండా క్రేప్ సిల్క్ శారీస్ ఏ సందర్భానికైనా చెక్కగా సరిపోతాయి. మెత్తగా, పల్చగా వుండే ఈ చీరల పైన ఎలాంటి డిజైన్…

  • యు ఎన్ ఫౌండేషన్ నేతృత్వంలోని ప్రపంచ మహిళా నేతల మండలి సభుయురాలి గా భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఎంపికయ్యారు. ప్రస్తుత మహిళా ప్రధానులు, మహిళా రాష్ట్రపతులు సభ్యులు గా వుండే ఈ మండలి లో సభ్యత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైంది. భారత చరిత్రలో దేశ ప్రధమ పేరుల స్థానంలో దక్కించుకున్న మొదటి మహిళ కూడా ప్రతిభ పాటిలే. మహారాష్ట్రకు తరలి వచ్చిన రోజుల కుటుంబంలో పుట్టిన ప్రతిభా పాటిల్ భారత రాష్ట్రపతి స్థానానికి ఎంపికైన రాష్ట్రపతి భవన్ లో అడుగు పెట్టడం ఒక చరిత్ర.

    అక్షరాల ఇది విశ్వ ప్రతిభ

    యు ఎన్ ఫౌండేషన్ నేతృత్వంలోని ప్రపంచ మహిళా నేతల మండలి సభుయురాలి గా భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఎంపికయ్యారు. ప్రస్తుత మహిళా ప్రధానులు, మహిళా…

  • ఈది తప్పనుసరిగా అందరు తెలుసుకోవల్సిన వార్తా. ఒక మంచి రిపోర్ట్ కుడా.రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక విశ్లేషణ చేశారు. మొదటి సంతానం అమ్మయి ఐతే తర్వాత అబ్బాయి కావలనుకుంటారు. కాని అధి కుడా అమ్మాయి ఐతే నిర్ధక్షాణ్యంగా వద్దనుకుంటారు. దినిని ఉపాధి కొణం నుంచి విశ్లేషించారు. వ్యవసాయ రంగంలో పని చెసే మహిళలు ,ఉద్యోగినులు,గృహిణులు ఇలా మూడు కోణాలలో విశ్లేషిస్తే వ్యవసాయ రంగంలో మహిళలకు ఇద్దరు ఆడపిల్లలుంటే ముడో సంతానం అబ్బాయి కావలనుకుంటారు. గృహిణులైతే మొదటి సంతానం అమ్మయి ఐతే రెండవ సంతానం అమ్మాయి వద్దనుకుంటారు.ఉద్యోగినులు మాత్రం ఇద్దరు అమ్మయిలు ఐనా ఎలాంటి భారం లేకుండా కనిపెంచుకుంటున్నారు. చదువు,విషయపరిజ్నానం ఉంటాయి కనుక ఆడపిల్లలైన మగ పిల్లలైన పర్లేదు  అనుకుంటారు. గృహినులు మాత్రం రెండో సంతానం కుడా ఆడపిల్ల ఐతే మాత్రం వద్దనుకుంటారు. ఈ కారణం తోనే ఈ వర్గంలో ఆడపిల్లల కోరత ఏర్పడింది. ఎదో ఒక రంగంలో ఉపాధి లొ ఉన్న మిగిలిన్ వర్గాలలో ఈ పరిస్థితి లేదు.

    ఆర్ధిక పరిస్థితులే ఈ సమస్యలకు కారణం

    ఈది తప్పనుసరిగా అందరు తెలుసుకోవల్సిన వార్తా. ఒక మంచి రిపోర్ట్ కుడా.రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక విశ్లేషణ చేశారు. మొదటి…

  • శిఖామగన్ రూపోందించిన డాక్యుమెంటరి బ్యాచిలర్ గర్ల్స్ యూట్యూబ్ లో విడుదలకు ముందే అందరి ప్రశంసలు అందుకుంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ వార్త చిర ప్రోమోలు అమ్మయి ఆత్మకు అద్దం పట్టేలా ఉన్నాయి. మహనగరాలలో ఒంటరిగా జీవించాలనుకునే మహిళలకు ఇళ్ళు దోరకడం ఎంత సమాస్యగా ఉంటుందొ వారు ఎంత వేదనకు గురవుతారో చూపిస్తుంది ఈ డాక్యుమెంటరీ. ఒంటరిగా ఉంటావా పెళ్లి కాలేదా,మగ స్నేహితులు ఉన్నారా వాళ్ళు ఇంటికి వాస్తరా లాంటి ప్రశ్నలతో మహానగరాలలో అమ్మయిలను ఆహ్వనిస్తున్నారు అని చెప్పింది శిఖామగన్ ఓ ఇంటర్యూలో. ఈ ప్రముఖ ప్రకటనల రూపకర్త టివిఏస్,బజాజ్ ,హిరో వంటి ప్రముఖ దిగ్గజ కంపెనీలకు యాడ్స్ డైరక్ట్ చెస్తున్న ఎకైక మహిళా దర్శకురాలు. ఈ చిత్రంలో ప్రముఖ నటి కల్ని కొబ్లిన్ లతో సహ మిగిలిన 15 మంది అమ్మయిలు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రపంచం అమ్మయిల పట్ల ఎలా ప్రవర్తిస్తుందో  స్త్రీల గొంతును ఈ చిత్రం వినిపిస్తుంది. ఇది మానవత్వానికి,స్త్రీల మనుగడకు సంభందించిన కథా అంటుంది శిఖామగన్

    ఇల్లడిగితే ఇన్ని ప్రశ్నలా….

    శిఖామగన్ రూపోందించిన డాక్యుమెంటరి బ్యాచిలర్ గర్ల్స్ యూట్యూబ్ లో విడుదలకు ముందే అందరి ప్రశంసలు అందుకుంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ వార్త చిర ప్రోమోలు అమ్మయి…