• నెమ్మదిగా విండో షాపింగ్ తో నడక మొదలుపెట్టండి తర్వాత గబగబా నడవటం అదే అలవాటవుతుంది అంటారు నిపుణులు. కొద్దిపాటి ప్రాక్టీస్ తో ప్రతి అడుగులో ఎంతో కొంత ఫలితాన్ని చూపిస్తుంది. స్పీడ్ వాక్ జాగింగ్ కంటే కూడా స్పీడ్ వాకింగ్ జాయింట్ల పై సులువుగా ఉంటుంది. జాగింగ్ కంటే సగం ఫోర్స్ చాలు స్పీడ్ గా నడిచేందుకు చక్కని వాకింగ్ షూ తో నడకను కొవ్వు కరిగించేదిగా కండరాలను టోనింగ్ చేసేదిగా మలుచుకోవాలి. చిన్న అడుగులు పెద్దవాటికంటే సమర్ధవంతంగా తక్కువ అలసటగా ఉంటాయి. సరైన పోశ్చర్ చాలా అవసరం. చుబుకం పైకెత్తి తిన్నగా ముందుకు చూస్తూ నడవాలి. ముందుకి వెనక్కి చేతులు బాగా కదిలిస్తూ నడవాలి. ఇలా చేతులు ఊపటం ద్వారా క్యాలరీలు ఖర్చవుతాయి. పై భాగం శక్తి పెరుగుతుంది. వేళ్ళ వాపులు కావు. ఉదర కండరాలు సరైన పొజిషన్ లో వుంటాయి. కాళ్ళ కండరాలకు నడక ఇంజన్ వంటిది. నడిచేటప్పుడు కండరాలు బిగించేలా నడవాలి. నడక వేగంగా కొనసాగించలేకపోతే మధ్యల;ఓ ఇంటెర్వెల్స్ తీసుకుంటూ ఉండచ్చు. త్వరగా సాగటానికి ఫిట్నెస్ కు ఇదే ఉపయోగం. క్యాలరీలు భారీగా ఖర్చు చేసే అవకాశం ఉన్న ఈ స్పీడ్ వాక్ తో శరీరం లోకోవ్వూ శుభ్రంగా కరిగిపోతుంది. నడక ఆరంభించి సూచనలు అనుసరిస్తూ వీలైనంత వేగం పెంచుకుపోతే ఏ అడుగుల సవ్వడి తగ్గే బరువుతో పెరిగే ఫిట్ నెస్ కనబడుతుంది.

    ఇది పవర్ వాక్

    నెమ్మదిగా విండో షాపింగ్ తో నడక మొదలుపెట్టండి తర్వాత గబగబా నడవటం అదే అలవాటవుతుంది అంటారు నిపుణులు. కొద్దిపాటి ప్రాక్టీస్ తో ప్రతి అడుగులో ఎంతో కొంత…

  • ఆరోగ్యం కోసం ప్రతి నిత్యం వ్యాయామాలు చేస్తూనే వుంటాం కదా అలసట దగ్గరకు రాకుండా షేర్ తింటున్నాం అన్నదాని పైన మన ఆరోగ్యం ఆధారపడి వుంది కొన్ని కాంబినేషన్స్ తినాలి. సాధారణంగా కండరాలు అలసిపోకుండా వుండాలంటే పనీర్ కాఫీ అరటిపండు సీమకోడి గుడ్లు ఖర్జురాలు ఓట్స్ చిలకడదుంపలు లాంటి శక్తి నిచ్చే పదార్ధాలు తినాలి. శరీరం లోని జీర్ణ క్రియలకు అవసరం అయ్యే పనీర్ మంచి ఫుడ్. అలాగే అరటిపండు పిండి పదార్ధం పుష్కలంగా పొటాషియం ఎక్కువగా ఉన్నాయి. ఇక కాఫీలో వుండే కెఫీన్ వ్యాయామం ముందు తీసుకుంటే కొవ్వు కరగటాన్ని వేగవంతం చేస్తుంది. సీమకోడిలో సోడియం తక్కువ కాబట్టి సంతృప్తి కొవ్వుల వల్ల అరుగుదల ఎక్కువగా ఉంటుంది. గుడ్లు ఇన్సులిన్ స్థాయిలకు సరైన స్థితిలో వుంచుతాయి కనుక ఉడికించి నేరుగా తినటం వల్ల కండరాల నిర్మాణం లో ఎంతో ఉపయోగపడుతుంది ఓట్స్ ఆకలిని ఆపగలుగుతాయి ఖర్జురాలు తేలికగా అరుగుతాయి. చిలకడ దుంపలు గొప్ప శక్తి నిస్తాయి. వ్యాయామానికి వెళ్లే ముందర ఇవే తినవలిసిన పదార్ధాలు.

    జిమ్ కు వెళ్లే ముందు ఇవే తినాలి

    ఆరోగ్యం కోసం ప్రతి నిత్యం వ్యాయామాలు చేస్తూనే వుంటాం కదా అలసట దగ్గరకు రాకుండా షేర్ తింటున్నాం అన్నదాని పైన మన ఆరోగ్యం ఆధారపడి వుంది కొన్ని…

  • శరీరంలో ఎక్కడ ఏ అసౌకర్యం ఉన్నా ఏ చిన్న నొప్పి వచ్చినా చాలా మంది సొంత వైద్యమే చేసేసుకుంటారు. మెడికల్ షాపుకు వెళ్లి తెలిసిన మాత్ర కొనేసి లేదా షాపతను సజెస్ట్ చేసిన మాత్రను మింగేస్తారు. మన దేశంలో ప్రిస్కిప్షన్ లేకుండా మందులు అమ్మేయటం ఈ ధోరణికి మరింత దోహదం చేస్తోంది. కానీ ప్రతి మాత్రకు ఇతర ప్రభావాలుంటాయి. సొంత వైద్యంతో ఈ లక్షణాలకు మందు పడుతుంది. కానీ శరీరంలో లో వచ్చిన వ్యాధికి కాదు. తల నొప్పి కడుపు నొప్పికి లేదా ఏదైనా చిన్న సమస్యకు రెగ్యులర్ సొంత వైద్యం మొదలు పెడితే ఆ డ్రగ్స్ ఎడిక్ట్ అయిపోతారు ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ స్లీపింగ్ పిల్స్ యాంటాసిడ్స్ విటమిన్లు ఇలాంటివి ఈ కోవా లోకి వస్తాయి. కొన్ని రకాల మందులకు ఎలక్ట్రిక్ రియాక్షన్లు ఉంటాయి. తరచూ వాడటం వల్ల ఓవర్ డోసేజ్ అయిపోతాయి. రోగ నిరోధక వ్యవస్థ ప్రభావితం అవుతోంది. చాలాసార్లు ఒక డ్రగ్ మరో డ్రగ్ తో రియాక్ట్ కావచ్చు. గర్భిణులు డయాబెటిక్ పేషంట్లు సొంతవైద్యాల వైపుకు అసలు తొంగే చూడవద్దు.వైద్యుల సిఫార్స్ లేకుండా ఎలాపడితే అలా మాత్రలు మింగేస్తుంటే దీర్ఘ కాలంలో ఆ ప్రభావం శరీరం పైన పడుతుంది.

    సొంత వైద్యం శరీరానికి ముప్పు

    శరీరంలో ఎక్కడ ఏ అసౌకర్యం  ఉన్నా ఏ చిన్న నొప్పి వచ్చినా చాలా మంది సొంత వైద్యమే చేసేసుకుంటారు. మెడికల్ షాపుకు వెళ్లి తెలిసిన మాత్ర కొనేసి…

  • లీవైజ్ స్ట్రాస్ కంపెనీ కార్మికుల కోసం ముతో కాటన్ ని అంటే జీన్స్ ని పరిచయం చేస్తుంది. ఈ జీన్స్ లేక పొతే ఇవాల్టి యూత్ ఎం ధరించే వాళ్ళు మరి ఎటూ 750 కోట్ల అడుగుల డెనిమ్ క్లాత్ ప్రపంచ వ్యాప్తంగా తాయారు అవుతుంది. దీని కోసం ఎంతో నీరు, ఎంతో శ్రమ, ఎంతో ఇండిగో రంగు కావాలి.ఈ జీన్స్ ఎటూ వెయ్యి కిలోల చెత్త కింద పేరుకు పోతుంది. మరి దీన్ని తిరిగి ఉపయోగించ పొతే ఎలా? ఈ పనికి లీవైజ్ స్ట్రాస్ కంపెనీ నే శ్రీకారం చుట్టింది అమెరికా లో ని ఇళ్ళు నిర్మాణం లో ఇన్సులేషన్ ప్రక్రియను వాడుతుంది. అలాగే జీన్స్ క్లాత్ తో రకరకాల ప్రయోగాలు వస్తున్నాయి. బుక్ స్టాండ్లు చెప్పులు, గొడుగులు, సాఫ్ట్ టాయ్ లు, దిళ్ళు, టీ పాయి లు, ఫోటో ఫ్రేములు, టేబుల్ మ్యాట్లు, మొక్కల్ని పెంచే కుండీలు, కూడా చేస్తున్నారు. పాత బంగారం కరగాబెట్టి కొత్త నాగ చేసి నట్లు పాత జీన్స్ ప్యాంటు తో ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ వచ్చేస్తున్నాయి. ఇలా జీన్స్ రీసైకిలింగ్ చేసి ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా డెనిమైట్ అనే ధృడమైన ప్లాస్టిక్ ని రూపొందించారట. ఐరిష్ ఇండస్ట్రీస్ వాళ్ళు దీనిలో బాటిల్స్ దగ్గర నుంచి దశ బోర్డ్ ల దాకా తాయారు చేసారు.

    పాత జీన్స్ తో కొత్త ధీమ్

    లీవైజ్ స్ట్రాస్ కంపెనీ కార్మికుల కోసం ముతో కాటన్ ని అంటే జీన్స్ ని పరిచయం చేస్తుంది. ఈ జీన్స్ లేక పొతే ఇవాల్టి యూత్ ఎం…

  • అందం కోసం ఇంట్లో అలంకరించుకునే గాజు బొమ్మల్లాగే ఆహారం అందంగా కనిపించడం కోసం ప్రత్యేక బొమ్మలోస్తున్నాయి. షుగర్ షో పీసెస్. అచ్చంగా అందమైన కళాకృతులు ల్లాంటి పంచదార బొమ్మలు చూస్తుంటే అందమైన గాజు బొమ్మని టాబుల్ పైన పెట్టి నట్లు కనిపిస్తాయి. పంచదార నీరు పోసి బాగా వేడి చేసి సిలికాన్ రబ్బర్ మ్యాట్ పైన పోసి కావాలనుకున్న రంగు కలిపి గాజు వంటి పదార్ధం తాయారు అవుతుంది. దీన్ని వుల్డ్ షుగర్ అంటారు. బొమ్మలు చేసే క్లే లాంటిది ఇప్పుడు ఇది కాస్త వేడిగా ఉండగానే దేనితో నెమళ్ళు, పక్షులు, పువ్వులు, జలపాతాలు అందమైన ప్రక్రుతి మొత్తం ఈ సాగరాన్నే ఈ ముద్ద లో నుంచి రూపం పోసుకుంటాయి. ఈ బొమ్మలు చూసేందుకు కొన్ని అచ్చుల సాయం లేదా గాలి వూరే పరికరం ద్వారా బోలుగా ఉచ్చేట్టు చేస్తూ ఈ చూడ చెక్కని బొమ్మలు చేస్తారు. ఎండ తడి తగలక పొతే ఈ పంచదార బొమ్మలు ఏడాది దాకా చెక్కగా ఉంటాయి. ఈ షుగర్ శ్వ పిసెస్ కోసం ఇమేజస్ ఎన్నో వున్నాయి. చూస్తేనే కళ్ళు చేడురుతాయి.

    కళ్ళను కట్టేసే పంచదార బొమ్మలు

    అందం కోసం ఇంట్లో అలంకరించుకునే గాజు బొమ్మల్లాగే ఆహారం అందంగా కనిపించడం కోసం ప్రత్యేక బొమ్మలోస్తున్నాయి. షుగర్ షో పీసెస్. అచ్చంగా అందమైన కళాకృతులు ల్లాంటి పంచదార…

  • ఇంట్లో తాయారు చేసుకున్న స్క్రబ్ లు ఒక రకంగా పేరున్న కంపెనీలు ప్యాక్ చేసి అమ్మే వాటి కంటే బాగా పని చేస్తాయి. ఇందులో వాడేవి రాసాయినాలు లేనివి కనుక సైడ్ ఎఫెక్ట్ లు వుండవు. ఆరంజ్ పీల్ పొడి, ఓట్స్ ఒక్కటి, ఒక్కో స్పూన్ చొప్పున తీసుకుని అందులో సరిపడా తేనె కలిపి ముఖం మెడ పై సర్కులర్ కదలికల తో అప్లయ్ చేయాలి. అలాగే అరటి పండు, పంచదార పొడి, ఓ టేబుల్ స్పూన్ తేనె కలిపినా మిశ్రమం కూడా మంచి స్క్రబ్. పెరుగు, పండిన బొప్పాయి గుజ్జు, నిమ్మ రసం తేనె కలిపి మసాజ్ చేసినా మంచి ఫలితం. నిమ్మ కాయ సగంగా కోసి రెండు చెంచాల పంచదార పొడిలో అద్ది ముఖం పై సున్నితంగా మసాజ్ చేయాలి. ముందుగా ముఖంపై చల్లని నీరు చల్లుకుని, ఈ స్క్రబ్ ఎదో ఒక్కటి ఒక స్పూన్ తీసుకుని ముఖం పై మసాజ్ చేయాలి. కళ్ళ కింది భాగం వదిలేయాలి. ఎక్కువ ప్రెజర్ ఉపయోగించ కూడదు. రెండు నిముషాల మించి స్క్రబ్ చేయకూడదు. ఇంట్లో వీటిని చాలా తేలికగ్గా తాయారు చేసుకో వచ్చు.

    ఈ స్క్రబ్ లు సురక్షితం

    ఇంట్లో తాయారు చేసుకున్న స్క్రబ్ లు ఒక రకంగా పేరున్న కంపెనీలు ప్యాక్ చేసి అమ్మే వాటి కంటే బాగా పని చేస్తాయి. ఇందులో వాడేవి రాసాయినాలు…

  • మైక్రో వేవ్ లో పదార్ధాల తయారీ మంచిదా కాదా అన్న సందేహాలు, చర్చలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. పోషకాలు పోతాయని, అంత వేడిలో సహజమైన రుచి పోతుందని చాలామంది అంటున్నారు కానీ ఇది నిజాం కాదు ఏ రకం వంట పద్దతిలో అయినా కొన్ని పోషకాలు, విటమిన్లు పోవడం సహజం. మిగతా వాటి తో పోలిస్తే మైక్రో వేవ్ లో తక్కువ పోషకాలు తక్కువ పోతాయి. పోషకాలు పోవడం అనేది ఉష్ణోగ్రత వంటి సమయం పై ఆధార పడి వుంటుంది. మైక్రో వేవ్ లో విటమిన్లు వేడి తక్కువ సమయంలో మాత్రమే ఎక్స్ పోజ్ ఆవుతాయి. ఎక్కువ భాగం హీట్ సెన్సిటివ్ న్యూట్రిషన్లే నీటిలో కరిగే విటమైన్లు ఫాలిక్ యాసిడ్, బి,సి విటమిన్లు వంటివే కనుక పాలకూర(ఫోలెట్), బెండకాయ(విటమిన్-సి), మాంసం(విటమిన్-బి) ఇవి అతిగా ఉడికిస్తే విటమిన్లు పోతాయి. అందుకే మైక్రో వేవ్ లో అతి తక్కువ సమయంలో కావాల్సినంత వేడెక్కుతాయి కనుక సందేహం లేకుండా ఉపయోగించ వచ్చు.

    మైక్రో వేవ్ మంచిదే

    మైక్రో వేవ్ లో పదార్ధాల తయారీ మంచిదా కాదా అన్న సందేహాలు, చర్చలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. పోషకాలు పోతాయని, అంత వేడిలో సహజమైన రుచి పోతుందని…

  • ఉదయం నాలుగంటలకే నిద్ర లేస్తాం. అందరి కంటే ముందే ఆఫీసులో వుంటాం అని చెపుతున్న ఇద్దరి ఇంటర్వ్యూలు వచ్చాయి. ఒకామె ఒకామె ఇంద్రానూయి, ప్రపంచ సెకండ్ లార్జెస్ట్ ఫుడ్ బిజినెస్ ఆమెదే. రెండో ఆమె విజయవాడలో పుట్టిన పద్మశ్రావారియర్ ఈమె యు.ఎస్ కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ కంపనీ సి.ఇ.ఓ ఫోబ్స్ జాబితాలో అత్యంత శక్తి వంతమైన మహిళల్లో ఈమె పేరు వుంది. ఇంతటి శ్రీమంతులైనా వెలిగే తూర్పు కిరణాల్లాంటి వాళ్ళయినా వాళ్ళ జీవితంలో ఆచరించి చూపింది, వాళ్ళ జీవితం పైన, వ్యాపారాల పైన, కెరీర్ పైన, శ్రద్ధ. నిబద్ధత అనే వాళ్ళకి పేరు ప్రాముఖ్యతలు తెచ్చి పెట్టాయి. జీవితంలో పైకి రావాలనుకునే యువత ఇలాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొండి. ఎవరో ఒక్కరే గొప్పవాళ్ళు కానవసరం లేదు. తలుచుకుంటే మీరు లక్ష్యాన్ని చేరొచ్చు. రేపటి రోజు మీదే!

    వాళ్ళు ఆచరించి చూపింది అందుకోండి

    ఉదయం నాలుగంటలకే నిద్ర లేస్తాం. అందరి కంటే ముందే ఆఫీసులో వుంటాం అని చెపుతున్న ఇద్దరి ఇంటర్వ్యూలు వచ్చాయి. ఒకామె ఒకామె ఇంద్రానూయి, ప్రపంచ సెకండ్ లార్జెస్ట్…

  • అమ్మ గురించి పుస్తకాలూ రాసినా సరిపోనాన్ని విషయాలున్నాయి. ఎంత పెద్దయి పోయినా అమ్మ అనే రెండక్షరాలు పసివాళ్ళని చేసేస్తాయి. అమ్మ ప్రేమ అమ్మ స్పర్శ బిడ్డకు భద్రత ని ఇస్తుందని తెలిసిన నుభవం లోకి వచ్చిన విషయమే. అంతేకాదట. ఆ స్పర్శ బిడ్డ మెదడుని ప్రభావితం చేస్తుందని ముఖ్యంగా పసిబిడ్డ కు అమ్మ స్పర్శ నొప్పిని తెలియనివ్వదని న్యూయార్క్ స్కూల్ ఆఫ్ మెడిసన్ కుచెందిన నిపుణులు ఒక అభిప్రాయం వెళ్లబుచ్చారు. ఇంకా ఇప్పుడే పుట్టిన బిడ్డ మెదడు పెరుగుదలకు కూడా అమ్మ స్పర్శ ఉపయోగపడుతుందిట. ముఖ్యంగా నొప్పి తెలియకుండా పసి పిలల్లకు ఇచ్చే మందుల కన్నా అనారోగ్యంగా ఉన్న బిడ్డకు తల్లి సమక్షం ఆమె చేతుల స్పర్శ. ఆమె వంటి నుంచి వచ్చే అలవాటైన వాసనకూడా మొప్పి తెలియకుండా చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందిట. అంటే పసిబిడ్డకు తల్లి ఎంత దగ్గరగా ఉంటే వాళ్ళు మానసికంగా శారీరికంగా అంత ఆరోగ్యంగా ఉంటారన్నమాట.

    రక్ష రక్ష అమ్మ స్పర్శ

    అమ్మ గురించి పుస్తకాలూ రాసినా సరిపోనాన్ని విషయాలున్నాయి. ఎంత పెద్దయి పోయినా అమ్మ అనే రెండక్షరాలు పసివాళ్ళని చేసేస్తాయి. అమ్మ ప్రేమ అమ్మ స్పర్శ బిడ్డకు భద్రత…

  • అందమైన పూణే నగరం లాగా సృష్టికర్త ఫల్గుణి గోఖలే.. ఎన్నో ఉత్పత్తులకు బ్రాండింగ్ డిజైన్ ప్యాకేజీ డిజైన్ ఇంటరాక్షన్ డిజైన్ వంటివి చేశారామె. అలాగే ఆరోగ్యరంగానికి సంబంధించి ఆస్తమా ఇన్ హేలర్ 600 రక్త నమూనాలను ఒకేసారి పర్యవేక్షించే బ్లడ్ ఎనలైజర్ వంటి పరికరాలు రూపొందించారామె. నగల డిజైనింగు చేసారు. ప్రజల అవసరాలకు తగట్టు అద్భుతమైన సృజనాలు చేసే ఈమె తాజాగా పబ్లిక్ ఆర్ట్ పేరుతో ప్రజా రవాణా బస్ లు , సర్కారీ భవంతులు చక్కని బొమ్మలతో అలంకరించే పనికి పూనుకున్నారు. ఆమె సృజనతో పూణే లో బస్ లన్నీ పువ్వులతో పిట్టలతో అలంకరణలు చేసుకోబోతున్నాయి. ఓ చిన్న కొట్లాట జరిగినా ఏ ఉద్యమం ఎవరు చేపట్టినా ముందుగా వాళ్ళ దృష్టి పాడేది ఈ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పైనే. నేను చేసే డిజైన్లు చూశాక వాటిపైన చిన్న రాయి విసరాలన్నా మనసొప్పదు అంటున్నారామె. నిజంగా ఆలా జరిగితే ఎంతెంత విధ్వంసాలు తప్పుతాయి. ఎన్ని ఆస్తులు ధ్వంసం కాకుండా మిగులుతాయి.

    పూణే ని పువ్వులతో పిట్టలతో అలంకరిస్తుందిట

    అందమైన పూణే నగరం లాగా సృష్టికర్త ఫల్గుణి గోఖలే.. ఎన్నో ఉత్పత్తులకు బ్రాండింగ్ డిజైన్ ప్యాకేజీ డిజైన్ ఇంటరాక్షన్ డిజైన్ వంటివి చేశారామె. అలాగే ఆరోగ్యరంగానికి సంబంధించి…