• మన శరీరంలో విశ్రాంతి లేకుండా పనిచేసేది శ్వాసకోశాలే . ఆయష్షుని ఆరోగ్యాన్ని పెంచే ఈ శ్వాస కోశాలు పట్ల మనం ఎలాంటి శ్రద్ధ తీసుకోమ్. రోజూ పది పదిహేను నిముషాలు లోతైన శ్వాస తీసుకోగలిగినా శ్వాస కోశాల శక్తి పెరుగుతోంది. స్విమ్మింగ్ జాగింగ్ ట్రెకింగ్ లాంటి ఏ వ్యాయామమైన ఊపిరితిత్తుల శక్తి వృద్ధి చేసేవే. సహజంగానే నీటికి ఎన్నో వ్యాధుల్ని నయం చేసే శక్తీ వుంది. సరిపడా నీళ్లు తాగితే చాలు. రక్త ప్రసరణ పెరిగి శ్వాస కోశం తేమగా వుంటూ ఎక్కువ ఆర్గ్యంగా పనిచేస్తాయి. ఉల్లి వెల్లుల్లి లాంటివి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. కాప్సికమ్ కూడా శరీరంలో ఇన్ఫెక్షన్లను వ్యతిరేకంగా పోరాడే శక్తిని నిలుపుతాయి. నాట్స్ ఇతర ధాన్యాలు సిట్రస్ పండ్లు గుమ్మడికాయ క్యారెట్లు వల్ల కూడా ఈ ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. గ్లాసు పాలలో కాస్త పసుపు వేసి తాగితే శ్వాసకోసం లో ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడే శక్తీ పెరుగుతుంది. అల్లంలో వాపు తగ్గించే గుణం వుంది కనుక దాన్ని ఎక్కువగా వాడితే మంచిది.

    ఈ విషయంలో శ్రద్ధగా వున్నామా ?

    మన శరీరంలో విశ్రాంతి లేకుండా పనిచేసేది శ్వాసకోశాలే . ఆయష్షుని ఆరోగ్యాన్ని పెంచే ఈ శ్వాస కోశాలు పట్ల మనం ఎలాంటి శ్రద్ధ తీసుకోమ్. రోజూ పది…

  • ఈ సంవత్సరపు హెల్త్ రిపోర్ట్ చుస్తే మొత్తంగా ఆరోగ్యమే మహా భాగ్యం అనుకున్నారట అధ్యయనం నివేదిక ప్రకారం ఇంట్లో జిమ్ లో వర్కవుట్స్ చేయటం మానేసి ప్రకృతి తో వ్యాయామం చేస్తున్నారు. ప్రవతలు ఎక్కటం స్విమ్మింగ్ చేయటం పై ద్రుష్టి పెట్టారు చాలా మంది. సూపర్ హెర్బ్స్ వాడకం పై ఆసక్తి పెట్టారు. ఈ ఏడాది చాలా మంది పంచదార వాడకం తగ్గించారు . సహజ సిద్దమైన ఆహారం తీసుకుంటున్నారు. ఆకలి వేస్తేనే ఏదైనా తింటున్నారు. టీ కాఫీ లకు బదులుగా గ్రీన్ టీ తాగుతున్నారు. ఎంత దూరం నడిచాం ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి అన్న విషయాలు దాదాపుగా సగానికి పైగా ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ ఫిట్నెస్ ఇన్స్పిరేషన్ గా ఉపయోగపడింది. ఆఫీసుల్లో వెల్ నెస్ కాన్సెప్ట్ బాగా పెరిగింది. ఆఫీసుల్లో యోగ క్లాసులు నిర్వహించారు. అలాగే ఫిట్ నెస్ అంశాలన్నీ వంట పట్టించుకుంటున్నారు. రన్నింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మొత్తానికి ఆరోగ్య ప్రాధాన్యత లిస్ట్ లో మొదటి స్థానంలో వుంది.

    ఆరోగ్య స్పృహ పెరిగింది

    ఈ సంవత్సరపు హెల్త్ రిపోర్ట్ చుస్తే మొత్తంగా ఆరోగ్యమే మహా భాగ్యం అనుకున్నారట అధ్యయనం నివేదిక ప్రకారం ఇంట్లో జిమ్ లో వర్కవుట్స్ చేయటం మానేసి ప్రకృతి…

  • సంగీతం ఎందుకు ఆనందపెడుతోంది. పశువులూ శిశువులూ కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయంటారు ఎందుకూ ? అంటే సమాధానం దొరికింది. సరిగామలతో ఆహ్లాద పరిచే భారతీయ సంగీతమైనా కోరేమీ అంటూ సాగే పాశ్చాత్య సంగీతమైనా వినగానే మెదడు లోని డోపమైనను ఈ ధ్వనులు నియంత్రించటం వల్ల సంతోషం కలుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. కొంతమందికి మనసుకు నచ్చిన సంగీతంతో తమ కోపాల్ని భావోద్వేగాలను నియంత్రించుకోగలగటం చిరాగ్గా ఉన్నా సరే సంగీత ధ్వనులు కంతులేని ఆహ్లాదం ఇస్తాయిట. డోప్ మైన్ సంబంధించిన మానసిక సమస్య తో బాధపడేవారికి సంగీతం దివ్యౌషధంలా పనిచేస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. అంతేకాదు మానసిక వత్తిడికి గురైనా ఆందోళన కలిగినా సంగీతం వినటం ద్వారా ఉపశమనం పొందవచ్చునన్నారు.

    సరిగామలతో సంతోషం

    సంగీతం ఎందుకు ఆనందపెడుతోంది. పశువులూ శిశువులూ  కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయంటారు ఎందుకూ ? అంటే సమాధానం దొరికింది. సరిగామలతో  ఆహ్లాద పరిచే భారతీయ సంగీతమైనా కోరేమీ అంటూ…

  • షారుక్ ఖాన్ నటించిన రాయిస్ చిత్రంలో అలనాటి లైలా మే లైలా రీమేక్ చేసారు. ఈ రీమిక్స్ లో షారుఖ్ ఖాన్ తో పాటు సన్నీ నటించింది. ఈ వీడియో ఇప్పుడు రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా చూసిన వీడియోలో లైలా మే లైలా పాట టాప్ ప్లేసులో వుంది. ఇప్పటికే ఏ ఈపాటను యూట్యూబ్ ద్వారా మూడు కోట్లకు మందికి పైగా చూసారు. తాజాగా సృష్టించిన ఈ రికార్డు లో బాలీవుడ్ లో తన స్థానం పదిలమైందని చెపుతోంది . సన్నీ. సినిమాలో నటన పాత్ర తన చేతిలో ఉండదని అది స్క్రిప్ట్ పైన ఆధారపడి ఉంటుందని స్క్రిప్ట్ బావుండి పాత్ర నచ్చితే తనకు నటించేందుకు పరిమితులు లేవన్నాది సన్నీ. ఒకవేళ తన బయోపిక్ కానక తీస్తే అందులో తన పాత్రలు విద్యా బాలన్ ఒక్కలే న్యాయం చేస్తుందని చెపుతోంది సన్నీ.

    ఈ పాటలు మూడు కోట్ల మంది వీక్షకులు

    షారుక్ ఖాన్ నటించిన రాయిస్ చిత్రంలో అలనాటి లైలా మే లైలా రీమేక్ చేసారు. ఈ రీమిక్స్ లో షారుఖ్ ఖాన్ తో పాటు సన్నీ నటించింది.…

  • ఒక అధ్యయనం ప్రకారం కార్బోహైడ్రాట్స్ తక్కువగా ఉన్న ఆహారం ఆరు నెలల పాటు తీసుకోగలిగితే బరువు గ్యారెంటీ గా తగ్గిపోతారు. తక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ కన్నా లో కార్బోహైడ్రాట్స్ ఉన్న ఆహారం తినటం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది బరువు తగ్గిపోవటం ఖాయం. లో ఫ్యాట్ డైట్ వల్ల ఆరోగ్యానికి అపకారమే జరుగుతుందంటున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ మంచిది కాదు కాబట్టి వాటికి దూరంగా వుండాల్సిందే. అలాగే కార్బోహైడ్రాట్స్ తగ్గిస్తునామ్ము కదా అని మాంసాహారం ఎక్కువగా తీసుకోవటం కూడా కష్టమే. కార్బోహైడ్రాట్స్ లో కూడా 46 శాతం క్యాలరీలు ఉంటాయి అయినా కొవ్వు కరిగించే విషయంలో కార్బోహైడ్రాట్ వల్లనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందంటున్నారు అధ్యయనాలు. ఎలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకుండా కేవలం లో కార్బోహైడ్రాట్ తీసుకుంటే జీవన శైలిలో మార్పులు అంటే ఉదయాన్నే వాకింగ్ కొద్దిపాటి వ్యాయామం చేస్తే ఆరు నెలలు ఒక కిలో నుంచి నాలుగు కిలోలు బరువు తగ్గిపోతారు అంటూ చెపుతున్నారు పరిశోధకులు.

    బరువు తగ్గటం గ్యారెంటీ

    ఒక అధ్యయనం ప్రకారం కార్బోహైడ్రాట్స్ తక్కువగా ఉన్న ఆహారం ఆరు నెలల పాటు తీసుకోగలిగితే బరువు గ్యారెంటీ గా తగ్గిపోతారు. తక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ కన్నా…

  • ప్రభుత్వ కార్యాలయాలు, పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగినులపై జరిగే లైంగిక వేధింపుల ఘటనలపై 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కేంద్రప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మహిళా ఉద్యోగినులపై దర్యాప్తు నెలల తరబడిగా సాగుతుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మనేకా గాంధీ గుర్తించారు. బాధిత మహిళలకు న్యాయం చేసేందుకు వీలుగా 30రోజుల్లోగా దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశించారు. మహిళలపై లైంగిక వేధింపుల కేసుల వివరాలు 8 ప్రభుత్వ శాఖల నుంచి వచ్చాయని, వీటిలో ఆటామిక్ ఎనర్జీ డిపార్టుమెంట్ లో ఎక్కువమంది మహిళలు లైంగికవేధింపులకు గురయ్యారని తేలింది.

    30 రోజుల్లో తెల్చేయండి

    ప్రభుత్వ కార్యాలయాలు, పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగినులపై జరిగే లైంగిక వేధింపుల ఘటనలపై 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కేంద్రప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.…

  • ఈ ఏడాది వరస హిట్స్ అన్నీ కాజల్ వే. అగ్ర కథానాయక అనిపించుకోవటం అంత ఈజీ ఏం కాదు. అందం అభినయం అదృష్టం అన్నీ కలిసి రావాలి. స్టార్ హీరోల తో పాటు పోటీగా నటించగలగాలి. కధానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు న్యాయం చేయాలి. కాజల్ కి ఈ లక్షణాలన్నీ వున్నాయి. కనుకనే చిరంజీవి ఖైదీ నెంబర్ 150 లో నటించగలిగింది. ఎంతో మంది వడపోత తర్వాతే కాజల్ ని ఎంచుకున్నారు. క్రిస్మస్ కి రిలీజ్ చేసిన ఒక పాత సన్నజాజిలా పుట్టేసిందిరో అంటూ చిరంజీవి కాజల్ ని వర్ణిస్తూ పాడిన పాట ఫాన్స్ ఫిదా అయ్యారు. ఏడేళ్లుగా నటిస్తున్న నేను నా కెరీర్ చివరిదశకు వచ్చిందనుకోను. ప్రతి సినిమా నా తోలి సినిమా లాగే భావిస్తాను.చేతిలో ఎన్ని విజయాలున్నా అశ్రద్దగా ఉండను. అంటూ వినయంగా చెప్పగలిగింది. కనుకే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సినిమాల్లోకొస్తున్న చిరంజీవి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకోగలిగిందామె. ఈ చిత్రంలో పాటలన్నీ విన్నారా ?

    ఖైదీ సుందరీ సాంగ్ విన్నారా ?

    ఈ ఏడాది వరస హిట్స్ అన్నీ కాజల్ వే. అగ్ర కథానాయక అనిపించుకోవటం అంత ఈజీ ఏం కాదు. అందం అభినయం అదృష్టం అన్నీ కలిసి రావాలి.…

  • ఇది వరకు వెండి తో కాళ్ళకు పెట్టుకునే పట్టీలు మాత్రమే పెట్టుకోనేవాళ్ళు. మోడ్రన్ డిజైనర్స్ ఆ ట్రెండ్ మార్చేసారు. ఘల్లున మోగే వెండి మువ్వల పట్టీలు కాస్తా మామిడి పిందెలతో రంగులు అద్దుకుని వడ్డానాలు అయిపోతాయి. ఇలాంటివే రెండు వరుసలు వస్తే నడుము పైన అమరిపోతాయి చీరకే అందాన్ని ఇస్తున్నాయి. క్రిస్టల్స్ ని కలుపుకుని అందమైన నగలు అవుతున్నాయి. మెటాలిక్ మెరుపులద్దుకుంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ అందమైన తెల్లని నగలు ఫ్యాషన్ పరుగుల్లో ఒక్క అడుగు ముందే వున్నాయి.

    మురిపిస్తున్న వెండి నగలు

    ఇది వరకు వెండి తో కాళ్ళకు పెట్టుకునే పట్టీలు మాత్రమే పెట్టుకోనేవాళ్ళు. మోడ్రన్ డిజైనర్స్ ఆ ట్రెండ్ మార్చేసారు. ఘల్లున మోగే వెండి మువ్వల పట్టీలు కాస్తా…

  • నీహారిక, చాలా కరక్టయిన ప్రశ్న అడిగావు. మనకో లక్ష్యం తప్పని సరిగా వుండాలా? మన కధేమీటో ముందే తలుస్తుందా? గుడ్. జీవితం లో జీవించి వుండేందుకు ప్రతి వ్యక్తికి తనదైన కారణం వుంటుంది. ఆ కారణమె జీవిత లక్ష్యం. దాన్ని మనం రుచి చూడాలి. నాతో ఏముంది ఒక లక్ష్యం సృష్టించేందుకు అనుకోని వాళ్ళకి వాళ్ళ బలం మీద వాళ్ళ ద్రుష్టి పెట్టలేదన్నదే సమాధానం. పుట్టి పెరిగేటప్పుడు మన సర్వెంద్రియాలు ఎదో ఒక ఇష్టంతో ఉంటాయి. ఆ ఇష్టాన్ని దక్కించుకోవడం మన లక్ష్యం ఐన్ స్టిన్, రామానుజం వంటి వాళ్ళు నేనేం చేయాలి అనుకుని కూర్చోలేదు. వాళ్ళలోని సృజన వాళ్ళకి తెలిసిపోయింది.

    ఆ నవ్వు వెల ఎంత?

    నీహారిక, చాలా కరక్టయిన ప్రశ్న అడిగావు. మనకో లక్ష్యం తప్పని సరిగా వుండాలా? మన కధేమీటో ముందే  తలుస్తుందా? గుడ్. జీవితం లో జీవించి వుండేందుకు ప్రతి…

  • తమిళనాడు రాష్ట్రం లో ప్రజల శ్రేయస్సు కోసం వచ్చిన సంక్షేమ పధకాల విషయంలో తెర వెనక నుండి ఎంతో కృషి చేసిన గిరిజా వైద్యనాధన్ తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. తంజావూరుకు చెందిన గిరిజ తండ్రి ఎన్.వెంకట్రామన్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా విధులు నిర్వహించారు. 1981 లో సివిల్ సర్వీసెస్ లో చెరో వైద్య, వ్యవసాయ, రవాణా శాఖల్లో పని చేసారు. ఆమె శ్రద్ధ తీసుకుని కసరత్తు చేసిన ఆరు నెలల ప్రసూతి సెలవుల పెంపు నిర్ణయంతో మహిళల నుంచి నూరు శాతం మార్కులు సంపాదించారు గిరిజ. పదవీ విరమణకు ఇంకా ముడేళ్ళే సమయం వుండగా ఇప్పుడీ పదవికి ఎంపిక కావడం సంతోషించే విషయం.

    ఆరు నెలల సెలవు ఆమె ఆలోచనే

    తమిళనాడు రాష్ట్రం లో ప్రజల శ్రేయస్సు కోసం వచ్చిన సంక్షేమ పధకాల విషయంలో తెర వెనక నుండి ఎంతో కృషి చేసిన గిరిజా వైద్యనాధన్ తాజాగా ప్రభుత్వ…