• నీహారికా నువ్వడిగిన దానికి ఓ పద్యం సమాధానంగా ఉంది. 'నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ ' అని. ఎవళ్ళనీ నొప్పించకుండా సంతోషపెడుతూ స్నేహంగా ఉండటం కష్టమే. కానీ అసాధ్యం కాదు. అందుకు సుమతీ శతకం లో చెప్పినట్లు తప్పించుకు తిరగనక్కర్లేదు కానీ మాటలు రువ్వినట్లు కాకుండా పిల్ల తెమ్మెర లాగా తాకినట్లు వాడితే అందరితో కలుపుకుపోవచ్చు. ఇరుగు పొరుగు స్నేహితులు బంధువులు తోటి ఉద్యోగులు కుటుంబ సభ్యులు ఎవరితోనైనా చెరగని చిరునవ్వుతో మాట్లాడితే చాలు. రోజువారీ పనులు బాధ్యతలు మధ్యనే ఎన్ని వత్తిడులు ఉంటాయి. మూడ్స్ మారిపోతుంటాయి. వాటి తాలూకు ప్రభావం ఇతరులతో మాట్లాడేటప్పుడు పడకుండా జాగ్రత్తగా వుండాలి. అలాగే ఎదుటివాళ్ళకు హేళన చేస్తున్నట్లో కించ పరుస్తన్నట్లు అస్సలు మాట్లాడకూడదు. అలాగే అతిగా చనువు తీసేసుకోకూడదు. వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో జోక్యం వద్దు. నలుగురిలో మన మాటే కరెక్ట్ ని మన మాటే చెల్లాలనీ అనుకోకూడదు. సరైన సాయం చేయవలిసిన అవసరం వస్తే చేతనైతే చేయటం లేదా లేదు. ఎప్పుడూ మాటలతో ఎదుటి వాళ్ళను తక్కువ చేయకుండా ఉంటే ఈ పువ్వులాంటి సువాసన భరితమైన పోగడపువ్వుల్లాంటి సంపెంగల్లాంటి మాటలు మాట్లాడటం చేతనైతే నీహారిక ఈ ప్రపంచంలో నాకెదురైన ప్రతి మనిషీ నీకు ఆప్తుడే ఆత్మీయుడే !!

    తేనెల్లాంటి మాటలు స్నేహితుల్ని తెస్తాయి

    నీహారికా, నువ్వడిగిన దానికి ఓ పద్యం సమాధానంగా  ఉంది. ‘నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ ‘ అని. ఎవళ్ళనీ నొప్పించకుండా సంతోషపెడుతూ స్నేహంగా ఉండటం…

  • రోజంతా ఆకలి అంతగా వేయకుండా శక్తితో ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ భారీగా ఉండాలంటూ ఉంటారు అసలింతకీ మహారాజుల్లాగా తినగలిగే ఆ బ్రేక్ ఫాస్ట్ లో ఏముండాలి అంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ప్రోటీన్ సూత్రాన్ని అనుసరించాలి. ప్రోటీన్లు అధికంగా వుండే బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు చికెన్ ఫిష్ వంటి లీన్ ప్రోటీన్లు వాల్ నట్స్ బాదం పప్పులూ వుండాలి. శాఖా హారులైతే పనీర్ మొలకలు మంచి ఛాయిస్. ఇటువంటి బ్రేక్ ఫాస్ట్ నెమ్మదిగా జీర్ణం అవుతుంది. కనుక మిడ్ మార్కింగ్ ఆకలి ఉండదు. చిరుతిళ్ళ మీదకి మనసు పోదు. బాదం వాల్ నట్ పప్పుల తో పనివుండదు శరీరానికి శక్తి ఉంటుంది.

    భారీ బ్రేక్ ఫాస్ట్ అంటే ఇదే

    రోజంతా ఆకలి అంతగా వేయకుండా శక్తితో ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ భారీగా ఉండాలంటూ ఉంటారు అసలింతకీ మహారాజుల్లాగా తినగలిగే ఆ బ్రేక్ ఫాస్ట్ లో ఏముండాలి అంటే…

  • ఈనాటి కూతుళ్లు ఎంతోమంది తండ్రి వ్యాపారంలో బాధ్యత తీసుకుంటున్నారు. ముఖేష్ అంబానీ పేరు వినని వాళ్లుండరు. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేత ఆయన కూతురు ఇషా అంబానీ చిన్నప్పటినుంచే చదువుల్లో దిట్ట. సైకాలజీ లో డిగ్రీ పూర్తీ చేసింది. అతి చిన్న వయసులో తండ్రి నడిపే సంస్థలకు బోర్డు డైరెక్టర్ గా ఎన్నికైంది. ఫోర్బ్స్ గ్లోబల్ యంగెస్ట్ బిలీనియర్ గా ద్వితీయ స్థానం లో వుంది. పవర్ బిజినెస్ ఉమెన్ గా ఎన్నికైంది. వ్యాపార మెళకువలు కోసం న్యూయార్క్ బిజినెస్ అనాలజిస్ట్ ఎమ్ .సీ కీన్ సేన్ తో కలిపి పనిచేసింది. ప్రత్యేక శిక్షణ తీసుకున్నాకే వ్యాపార బాధ్యతల్లోకి వచ్చింది. చదువు అయ్యి అంతర్జాతీయ వ్యవహారాలపై ఇషా కు అవగాహనా వుంది. తండ్రి పేరు ఉపయోగించకుండా ఇషా సొంత గుర్తింపు తెచ్చుకుందని తల్లి నీతూ అంబానీ ఎంతో సంతోషంతో వుంటుంది. ఎలాంటి సమస్య నైనా వెంటనే పరిష్కరిస్తుందనీ ఏ పనైనా చేసేందుకు ఆమె వెనకాడదని రిలయన్స్ కంపెనీ ఉద్యోగులు చెప్తారు.

    సొంత గుర్తింపు కోసం నిరంతర శ్రమ

    ఈనాటి కూతుళ్లు ఎంతోమంది తండ్రి వ్యాపారంలో బాధ్యత తీసుకుంటున్నారు. ముఖేష్ అంబానీ పేరు వినని వాళ్లుండరు. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేత ఆయన కూతురు ఇషా…

  • ఇప్పటి యూత్ చాలా మంది ఛాయిస్ బుల్లితెర లేదా సినిమా లేదా సినిమా చుట్టూ వుండే ఉద్యోగావకాశాలు గురించే ఆలోచిస్తూ వుంటారు. మంచి ఫేస్ ఫీచర్స్ వుండే తెర పైకి ఇతరత్రా క్రియేటివ్ లక్షణాలుంటే తెరవెనక్కీ తేలికగానే అవకాశాలు దొరికే రోజులివి. మంచి వాయిస్ ఉంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ లేదా వాయిస్ వోవర్స్ కు ట్రై చేయచ్చు. చక్కని గొంతును అథారిటేటివ్ గామార్చాలంటే వాయిస్ డిమాండింగ్ గా వుండాలంటే పోశ్చర్ నిఠారుగా వుండాలి. మెడ భుజాలు వెన్ను సరైన ఎలైట్ మెంట్ లో వుండే డయాఫ్రాగమ్ డ్రాప్ అయి ఊపిరి తిత్తులను మరింత గాలి ఇస్తుంది. దృఢమైన స్పష్టమైన టోన్ కోసం ఎల్ల వేళలా హైడ్రేషనూ అవసరం. వోకల్ ఫోల్డ్స్సరైన లూబ్రికేషన్ వున్నప్పుడు ఉత్తమంగా పనిచేస్తాయి కాన్ఫిడెంట్ గా గొంతు పెగలాలంటే శరీరం ముందు అందుకు సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ నేర్చుకుంటేనే వచ్చేవే. నటన తో సహా ఫలానా వృత్తిలో నిలబడాలి అనుకుంటే అందుకు అవసరమైన శిక్షణ తీసుకోవాలి. తీసుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి కూడా.

    ప్రతీదానికీ శిక్షణోకటుంది

    ఇప్పటి యూత్ చాలా మంది ఛాయిస్ బుల్లితెర లేదా సినిమా లేదా సినిమా చుట్టూ వుండే ఉద్యోగావకాశాలు గురించే ఆలోచిస్తూ వుంటారు. మంచి ఫేస్ ఫీచర్స్ వుండే…

  • కొన్ని రకాల డ్రెస్ లు పురుషులకే పరిమితం అనుకుంటారు అమ్మాయిలు మంచి సూట్లు ప్యాంట్లు షర్టులు ఇలాంటివి కానీ ఇప్పుడు ఇలాంటివన్నీ శ్రీ పురుష బేధం లేకుండా ఆఫీస్ లకు వేసుకునే ఫార్మర్స్. కాకపోతే మరీ సీరియస్ గా కనిపించకుండా కొన్ని కొత్త ప్రయోగాలు చేయాలి. జీన్స్ కాటన్ ప్యాంట్లు స్ట్రెయిట్ పెన్సిల్ కట్ తో ఉండేలా చూసుకుని దానిపైన పొడవాటి కుర్తీ వేసుకుంటే బావుంటుంది. పొడవాటి కుర్తీలకు లూజ్ గా వుండే షర్టుల్లకు పలాజో లు వేసుకోవటం ఇప్పటి ఫ్యాషన్. రెండు మూడు రంగుల పలాజో లు ఉంటే కాంబినేషన్స్ చూసుకోవచ్చు. కాస్త సన్నగా ఉంటే చిన్న ప్రింట్లున్న పొడవాటి స్కర్టులు వేసుకోవచ్చు. స్కర్టులు ప్యాంట్లు రెగ్యులర్ గా వేసుకోవాలి అనుకుంటే వదులుగా అలాగని వంటికి అతుక్కుపోయేలా కాకుండా నడుము దగ్గర పట్టి వుంటే ఏ లైన్ తరహాకి ప్రాధాన్యత ఇవ్వచ్చు. జీన్స్ టీషర్ట్స్ పైకి కోటు కూడా చక్కగానే ఉంటుంది. కోట్లు సాధారణంగా సూటింగ్ క్లాత్ లో వుంటాయి.కానక నేతతో కూడా వస్తున్నాయి. అవి తేలిగ్గా బావుంటాయి. మోడ్రన్ కనబడాలి అనుకుంటే కొన్ని కొత్త కాంబినేషన్స్ జత చేస్తే ప్యాంట్లు షర్టులు అమ్మాయిల వార్డ్రోబ్ లో లక్షణంగా వుంచుకోవచ్చు.

    ఇవి అమ్మాయిల వార్డ్రోబ్ లో ఉండాల్సినవే

    కొన్ని రకాల డ్రెస్ లు పురుషులకే పరిమితం అనుకుంటారు అమ్మాయిలు మంచి సూట్లు ప్యాంట్లు షర్టులు ఇలాంటివి కానీ ఇప్పుడు ఇలాంటివన్నీ శ్రీ పురుష బేధం లేకుండా…

  • ఉత్సాహం కొద్దీ అప్పుడున్న మూడ్ కొద్దీ టాటూలు వేయించుకొంటారు గానీ తర్వాత అదేదో ఫ్యాషన్ ట్రెండ్ కాదని సరదా పోతుంది. దాన్ని తొలగించుకోవటం అదో సమస్య. సరైన పరికరాలు వాడితే చర్మం పైన ఆ జ్ఞాపకం తొలగించుకోవచ్చు. డెర్మటాలజిస్టులైతే క్యూ స్విచ్ ఇండియా లేజర్లను టాటూ మరకల్ని తొలగించేందుకు వాడతారు. అయితే టాటూల రిమూవల్ టెక్నిక్స్ ని నిర్ణయించేది టాటూలో వాడిన రంగులు. నలుపు నీలం రంగుల పచ్చ బోట్లను క్యూ స్విచ్ ఇండియా లేజర్లతో తొలగించవచ్చు. ఎరుపు నారింజ పసుపు ఆకుపచ్చ టాటూల పల్స్ డై లేజర్లతో తొలగించాలి. ఐదంగుళాల స్క్వేర్ లేదా అంతకంటే పెద్దవాటిని తొలగించటం కష్టం. పాదాలు కాళ్లపై గల పచ్చబొట్లు మూడు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలవ్యవధిలోవైతే వాటికి లేజర్లు పనిచేయవు. మంచి డెర్మటాలజిస్టులను సంప్రదించాల్సిందే. కొన్ని నెలల పాటి ఈ ప్రక్రియ సమయం తీఉస్కోవచ్చు. సూర్య కిరణాల్ని తగలనివ్వకూడదు. లేజర్ చికిత్స చర్మం సహజ పిగ్మెంట్ ను తొలగిస్తుంది. సూర్య కిరణాల తాకిడికి రంగుమారి కనపడుతుంది. దాంతో చికిత్స ఎక్కువ కాలం పడుతుంది.

    పచ్చ బొట్టు పోగొట్టచ్చు

    ఉత్సాహం కొద్దీ అప్పుడున్న మూడ్ కొద్దీ టాటూలు వేయించుకొంటారు గానీ తర్వాత అదేదో ఫ్యాషన్ ట్రెండ్ కాదని సరదా పోతుంది. దాన్ని తొలగించుకోవటం  అదో సమస్య. సరైన…

  • ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ లో నిద్రకోసం కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ. నిద్ర కాస్త తక్కువైతే ఏమవుతుంది. నిద్రించే విశ్రాంతి కదా రోజుల్లో ఎదోలాగా శరీరానికి విశ్రాంతి ఇస్తే సరిపోదా అనుకుంటే చాలా పొరపాటు. నిద్ర చాలినంత లేకపోతే జీర్ణ వ్యవస్థ క్రమబద్దీకరణ గ్లూకోజ్ మెటాబాలిజమ్ రక్తపోటు వంటి ముఖ్యమైన శారీరిక పనితీరు ప్రభావితం అవుతుందని చికాగో పరిశోధకులు పేర్కొంటున్నారు. నిద్రపోయిన ప్రయోగాత్మక పరిశీలనాత్మక అధ్యయనాలు జరిపి ఈ విషయాన్నీ గుర్తించారు, ఆరుగంటల కంటే తక్కువసేపు నిద్రపోవటం వల్ల బాడీ మాస్ ఇండెక్స్ లేదా స్థూల కాయం పెరుగుతుందని తెలుసుకున్నారు. చాలినంతగా నిద్రలేకపోవటం వల్ల ఘ్రోలిన్ అనే హార్మోన్ల ఉత్పత్తి ప్రభావితం అవుతుంది. దీనివల్ల ఆకలి పెరుగుతుంది. ఫలితంగా చాలినంత శక్తి అవసరం లేకుండానే ఆహారం తీసుకోవటం పెరిగిపోతుంది.బరువు పెరిగిపోతూ నిద్ర లేమి వల్ల గ్లూకోజ్ మెటబాలిజమ్ అసంభంధిత రక్తపోటు పెరిగి పోతాయి. ఈ ప్రభావాలు పిల్లలూ యుక్తవయస్సు వచ్చిన వాళ్లలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి దాకా కంప్యూటర్ ముందు సెటిలయ్యే పిల్లల్ని టైం ప్రకారం నిద్రపోనివ్వాలి. అలాగే సమయానికి నిద్రలేపాలి కూడా.

    హాయిగా నిద్రపోకపోతే ప్రాబ్లమ్

    ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ లో నిద్రకోసం కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ. నిద్ర కాస్త తక్కువైతే ఏమవుతుంది. నిద్రించే విశ్రాంతి కదా రోజుల్లో ఎదోలాగా శరీరానికి విశ్రాంతి…

  • జిమ్ లో లేదా యోగానెషన్ లో ఎంత ఉష్ణోగ్రత వుండాలో ఎప్పుడూ డౌట్ గా వుంటుంది. అంటుంటారు. చాలా మంది ఎక్సర్సైజులు చేస్తున్నపుడు ఎ.సి కట్టేస్తారు. కూడా. కానీ ఎక్స్పర్ట్స్ ఏం చెపుతారంటే ఎక్సర్ సైజులు చేస్తుంటే 23 డిగ్రీల ఉషోగ్రత ఐడియల్ టెంపరేచర్ అమీ . ఈ విషయం అధ్యయనాల్లో కూడా తేలింది. వేడి వాతావరణంలో వర్కవుట్ల వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. ఒక్కసారి వడ దెబ్బ కూడా తగిలే అవకాశాలు ఉంటాయి. వేడిగా వున్న గదిలో వర్కవుట్లు లేదా యోగ వంటివి చేయటం అలసటగానే వుంటుంది. చేయాలన్నా ఉత్సాహం స్ఫూర్తి కుడా తగ్గిపోతాయి. ఇప్పటి చల్లని రోజులను మినహాయిస్తే సాధారణంగా గదిలో చక్కని వెంటిలేషన్ వుండాలి. ఆక్సిజన్ స్థాయిలు సరిగా ఉండాలి. వేడి వాతావరణం అదనపు సైద్యం. శారీరిక ఎలక్ట్రోలైట్ బాలన్స్ కు ఇబ్బంది కలిగిస్తాయి. ఇలాంటి సమయాల్లో వట్టి మంచినీరు తాగటం సిఫార్స్ చేయదగినది కాదు. పంచదార ఉప్పు కలిపినా నిమ్మనీళ్లు లేదా ఓరల్ డిహైడ్రేషన్ సొల్యూషన్ తాగుతుండాలి.

    వేడిగా ఉంటే చాలా కష్టం

    జిమ్ లో లేదా యోగానెషన్ లో ఎంత ఉష్ణోగ్రత వుండాలో  ఎప్పుడూ డౌట్ గా వుంటుంది. అంటుంటారు. చాలా మంది ఎక్సర్సైజులు చేస్తున్నపుడు ఎ.సి కట్టేస్తారు. కూడా.…

  • మన శరీరంలో 60 శాతం నీటిలో కూడిన ద్రవాలుంటాయి. ఇవి ఆహారం జీర్ణం అయ్యేందుకు పోషకాలను గ్రహించేందుకు రక్త సరఫరా సాఫీగా జరగటానికి లాలా జాలం ఉత్పత్తికీ రకరకాలుగా తోడ్పడతాయి. తగినంత నీరు తాగితేనే ఈ ద్రవాలన్నీ సరైన పాళ్ళలో చక్కని నియంత్రణలో ఉంటాయి. నీరు బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. ఇందులో ఎలాంటి క్యాలరీలు లేవు. అలాగే తగినన్ని నీళ్లు అందకపోతే కండరాలు అలసిపోయి నిస్సత్తువ కలుగుతుంది. వృధాప్య ఛాయలు బయటపడనీయకుండా చర్మం నిగనిగలాడేలా చేసేది నీరే. వ్యర్ధాలను ఎప్పటికప్పుడు బయటకు పంపేస్తుంది. కనుక మొటిమలు రాకుండా ఉంటాయి. పిక్కలు కండరాలు కీళ్లు పట్టేయకుండా సాఫీగా పనిచేయటానికి నీళ్లు ఎంతో ఉపయోగపడతాయి. నీరు లేకపోతే జీవం లేదు. శరీరంలో అత్యధిక భాగం నీరే . తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు వ్యర్ధాలు బయటకు పోయేందుకు శరీరంలో నీరే అధికం. అన్ని వ్యవస్థలూ నీటి ఆధారం టోన్ పనిచేస్తాయి. కానక దాహం వేసినప్పుడే నీళ్లు తాగటం కన్నా నీళ్లు తాగుతూ ఉండటం అలవాటుగా ప్రాక్టీస్ చేయాలి.

    నీళ్లు తాగటం ప్రాక్టీస్ చేయాలి

    మన శరీరంలో 60 శాతం నీటిలో కూడిన ద్రవాలుంటాయి. ఇవి ఆహారం జీర్ణం అయ్యేందుకు పోషకాలను గ్రహించేందుకు రక్త సరఫరా సాఫీగా జరగటానికి లాలా జాలం ఉత్పత్తికీ…

  • అనేక పోషక పదార్ధాలున్న ధాన్యం కాంతివంతమైన చర్మాన్ని ఇవ్వటంలో ముందుంటుంది. సహజ స్థిరమైన శరీర కాంతి కోసం బియ్యం పిండి లో పాలు కలిపి స్పా ట్రీట్మెంట్ లో వాడతారు. పెద్ద పెద్ద ఒబెరాయ్ బాలినీస్ స్పా ముంబై లోని నారిమన్ పాయింట్ స్పా ల్లో ఈ ట్రీట్మెంట్ ను అతిధుల కోసం ఇస్తారంటే బియ్యంలో శరీర లావణ్యలను పెంచే పోషకాలు ఉండటమే కారణం. మస్సాజ్ తర్వాత స్క్రబ్బింగ్ చేయటం వల్ల మృత కణాలు పూర్తిగా పోయి శరీరం శుభ్రపరుస్తుంది. మంచి మెరుపు నిగారింపు పటుత్వం వస్తుంది. ఇదే బియ్యపిండి పాలు మిశ్రమానికి అలొవెరాని కలిపి పెదవులు ఎండిపోకుండా తేమతో మెరిసిపోయేందుకు వాడతారు. తాజాగా ఉన్న బియ్యపిండి రైస్ బ్రాన్ నూనె లో రకరకాల పదార్ధాలు కలిపి రకరకాల ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. ఆర్గానిక్ కొబ్బరి షియా బటర్ లతో కలిపి డ్రై స్కిన్ కు అధిక తేమను ఇచ్చేందుకు వాడతారు. బియ్యం పిండి శరీరానికి రుద్దుకొనే సబ్బు లాంటిది. బియ్యం పిండి తేనె పాలు మిశ్రమం ఫేస్ ప్యాక్ గా చక్కగా ఉంటుంది. ఈ మిశ్రమాన్నే బాడీ స్క్రబ్బర్ లాగా ఉపయోగిస్తారు.అయితే శరీరానికి దీన్ని మృదువుగా అప్లయ్ చేయాలి. బియ్యం వండి తినేందుకే కాదు మంచి బ్యూటీ ట్రీట్ మెంట్ కూడా.

    బియ్యంతో అద్భుత సౌందర్యం

    అనేక పోషక పదార్ధాలున్న ధాన్యం కాంతివంతమైన చర్మాన్ని ఇవ్వటంలో ముందుంటుంది. సహజ స్థిరమైన శరీర కాంతి కోసం బియ్యం పిండి లో పాలు కలిపి స్పా ట్రీట్మెంట్…