• చిత్రంగాధ నా బెస్ట్ సినిమా

    జర్నీ తో టాలీవుడ్ కు వచ్చినా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తోనే  తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. అంజలి. ఇప్పుడు ఆమె నటించిన…

  • నీహారికా , శనిదశలో శుక్ర మహాదశలో ఉన్నాయా అని అడిగావు. వేమన పద్యం ఒకటి చెపుతాను. బల్లి పలుకుల్ విని ప్రజలెల్ల తమ పనులు సఫలములగుననుచు సంతసించి కానీ పనులకు తామే ఖర్మమటందుకు విశ్వదాభిరామ వినురవేమ. ఎలావుందీ ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా బల్లి పలికితే ఏమవుతుంది అంటారు. ఒకవేళ పనికాకపోతే ఖర్మ అంటారు. ఇలా ఉంటుంది. నీ ప్రశ్నకు సమాధానం. మనం ఒక పని మొదలుపెట్టి సఫలం కాకపోతే అదెక్కడ ఎలా జరిగిందో ఎనాలిసిన్ చేసి ఎక్కడ పొరపాటు జరిగిందో దాన్ని దిద్దుకుని మళ్ళీ పని మొదలు పెడతాం. ఆ ప్రయత్నంలో పదిసార్లు విఫలమైనా 11 వ సారయినా సక్సెస్ అవుతాం. ఇది శనిదస అనుకున్నామనుకో అసలు ప్రయత్నం మానేస్తాం . ఇక దశ తిరిగి రోజు కోసం ఎదురుచూస్తాం. అంటే ఇకెప్పటికీ పరాజయమే నన్నమాట. ఎవరో ముక్కు వంకరగా ఉందని అద్దాన్ని నిందించాడంటాడు ఇంకో పర్వంలో వేమన. అంచేత ఈ దశలు మహాదశలు పక్కనపెట్టి పనిచేయటం నేర్చుకో ఏమంటావు !!

    ఏ నమ్మకాలూ వద్దమ్మాయీ !

    నీహారికా , శనిదశలో  శుక్ర మహాదశలో ఉన్నాయా అని అడిగావు. వేమన పద్యం ఒకటి చెపుతాను. బల్లి పలుకుల్  విని ప్రజలెల్ల తమ పనులు సఫలములగుననుచు సంతసించి…

  • వయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటే ఉబ్బినట్లు కనిపించి ముఖం చాలా డల్ గా అనిపించిందనుకోండి. ఈ వేసవిలో శరీరంలో తగినంత నీరు లేని కారణంగా డీహైడ్రేషన్ వల్ల రక్త నాళాలు వ్యాకోచం చెంది నీరు చేరుతుంది. నీరు బాగా తాగకపోతే మొహం ఉబ్బరిస్తుంది. అలాగే శరీరంలో అధిక శాతం ఉప్పుచేరినా ముఖం వస్తుంది. కార్బోనేటేడ్ కూల్ డ్రింక్స్ తాగినా ప్యాకేజీ ఫుడ్స్ తో సోడియం శరీరంలో చేరినా ఈ ప్రాబ్లమ్ కావచ్చు . ఇలా ముఖం ఉబ్బరించుకోకుండా ఉండాలంటే డైట్ లో ఎక్కువ పీచు పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి . బొప్పాయిపండు తింటే పొట్ట చిన్న ప్రేవుల ఆరోగ్యం సరిగా ఉంటుంది . ముఖంలో ఉబ్బరింపు ఉండదు విటమిన్ సి బీటాకెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పండ్లు తినాలి. ఇవి చర్మం లో నీళ్లు నిలిచిపోకుండా సహాయపడతాయి. చర్మం మెరిసిపోతుంది. మొహం తేజోవంతంగా ఉంటుంది.

    ముఖ కాంతి తగ్గినట్లుంటే

    ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటే ఉబ్బినట్లు కనిపించి ముఖం చాలా డల్ గా అనిపించిందనుకోండి. ఈ వేసవిలో శరీరంలో తగినంత నీరు లేని కారణంగా…

  • పిల్లల్ని మట్టిలో వేళ్ళు పెడితే కోప్పడుతూ ఉంటాం . కానీ ఏ కార్టూన్ నెట్వర్క్ చూస్తూ టీవీ ముందర గడిపేకన్నా వాళ్ల్లు మట్టిలో ఇసుకతో ప్రకృతి మధ్య ఆడుకుంటూ గడిపితే మంచిదంటున్నారు ఎక్స్ పెర్ట్స్ . మనం చెప్పలేని ఎన్నో పాఠాలు ప్రకృతి నేర్పిస్తుంది . ప్లాస్టిక్ కప్పుల్లో మట్టిపోసి మెంతులు ఆవాలు వంటి మొక్కలు ఎలా పెరుగుతాయో గమనించవచ్చు. ఇసుక మట్టితో ఆదుకునేలా ఇంటి ముందు కాస్త దిబ్బలా ఏర్పాటుచేసి చిన్న చిన్న బొమ్మలేస్తే వాళ్ళ క్రేయేటివిటీ చూపించేస్తారు. ఒక బ్లాక్ బోర్డు సుద్ద ముక్కలు ఇస్తే ఇక ఆర్టిస్ట్ లు అయిపోయేంత పని చేస్తారు. వాళ్ళు ఎదో ఒక విద్య నేర్చుకునే దిశగా ప్రోత్సహించటం పెద్దవాళ్లుగా మన బాధ్యత. నలుగురి పిల్లలతో ఆడుతూ ఉంటే భావ బ్యాక్తీకరణకు మాట్లాడేందుకు అవకాశం వస్తుంది. నలుగురితో కలిసి మెలిసి వుండటం అలవాటవుతోంది.

    ఎదో ఒక విద్య నేర్చుకునే దిశగా ప్రోత్సహించాలి

    పిల్లల్ని మట్టిలో వేళ్ళు పెడితే కోప్పడుతూ ఉంటాం . కానీ ఏ కార్టూన్ నెట్వర్క్ చూస్తూ టీవీ ముందర గడిపేకన్నా వాళ్ల్లు మట్టిలో ఇసుకతో ప్రకృతి మధ్య…

  • ఎండలోచిస్తున్నాయి ఎండ నుంచి రక్షణ కోసం గొడుగులు చర్మం పాడవకుండా సన్ స్క్రీన్ లు కాదు శరీరం చల్లబడే ఆహారం కూడా తీసుకోవాలి . ఇప్పుడు పుచ్చ కాయల సీజన్ మొదలైంది. ఇందులో మొత్తం నీదే. యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దాహం తీరుస్తాయి. కానీ కోసి ఫ్రిజ్ లో నిలువ చేయద్దు. అలాగే కొబ్బరి నీళ్లు కూడా మంచి ఆహారం. ఈ నీళ్లలో సహజ చక్కెరలు ఖనిజాలు అధికంగా ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీలు ఎక్కువగా తీసుకోవాలి . శరీరం డీ హైడ్రేషన్ కు లోనవకుండా కాపాడతాయి. ఈ కాలంలో పెరుగు మజ్జిగ వాడకం ఎక్కువ చేయాలి. ఎండలోకి వెళ్ళే ముందర మజ్జిగ తాగాలి. కూరలు మసాలాలు ఎక్కువ టీయూస్కుని పెరుగన్నం తినటం అన్ని విధాలా మేలు. అలాగే పుదీనా కూడా వేసవిలో తీసుకునే ఆహారాల్లో ఉండాలి. తీపి మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు ల్యూటిన్ వంటివి ఎక్కువ. కీరా దోసకాయ కూడా తప్పనిసరిగా తీసుకునే పదార్ధాల జాబితాలో చేర్చాలి.

    వేసవి లో ఇవి మంచివి

    ఎండలోచిస్తున్నాయి ఎండ నుంచి  రక్షణ కోసం గొడుగులు చర్మం పాడవకుండా సన్ స్క్రీన్ లు కాదు శరీరం చల్లబడే ఆహారం  కూడా తీసుకోవాలి . ఇప్పుడు పుచ్చ…

  • వెనిగర్ పేరు చాలా సార్లు వినబడుతూ ఉంటుంది. దీన్ని అనేక పదార్ధాల తయారీలో ఉపయోగిస్తారు. ఎన్నో ప్రయోజనాలుంటాయి కూడా. ఈ పల్చని ద్రవంలో సౌందర్య ఆరోగ్య గృహ ప్రయాజనాలున్నాయి. తెల్లని డిస్టిల్ట్ వెనిగర్ తో వారంలో కనీసం రెండు సార్లు పళ్ళు తోముకుంటే పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి. నోటి దుర్వాసన పోతుంది. ఒక బకెట్ నీళ్లలో అరకప్పు వెనిగర్ కలిపి స్పాంజ్లు పాత్రలు టోమ్ బ్రష్ లు రాత్రంతా నాననిస్తే క్రీములు మురికి పోతాయి. వాషింగ్ మిషన్ లో చివరి వాష్ సైకిల్ లో అరకప్పు వైట్ వెనిగర్ కలిపితే దుస్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి . నెయిల్ పాలిష్ వేసేముందర వెనిగర్ లో ముంచిన కాటన్ తో గోళ్లు తుడిస్తే చాలా రోజులు పాలిష్ చెక్కుచెదరదు. తలపులు కిటికీలు మూలల్లో వైట్ వెనిగర్ చల్లితే చీమలు రావు.

    వెనిగర్ తో సౌందర్య ఆరోగ్య ప్రయోజనాలు

    వెనిగర్ పేరు చాలా సార్లు వినబడుతూ ఉంటుంది. దీన్ని అనేక పదార్ధాల తయారీలో ఉపయోగిస్తారు. ఎన్నో ప్రయోజనాలుంటాయి కూడా. ఈ పల్చని ద్రవంలో సౌందర్య ఆరోగ్య గృహ…

  • జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకో ఇమేజ్ సృష్టించుకున్న నటి ప్రియాంకా చోప్రా. హాలీవుడ్ లో తనదైన ఓ స్టయిల్ లో సాగుతోంది. హెయిర్ స్టయిల్ వస్త్రాలంకరణ మార్చేస్తూ రూపంలో రోజుకో ప్రత్యేకత చూపిస్తోందామె. చక్కని చర్మం విల్లులా వంగిన కనుబొమ్మలు చక్కని కనురెప్పలు ఆమె ప్రత్యేకత. ఈ మధ్య కాలంలోని కొన్ని డ్రెస్ లు ఆమె ఎంతో ప్రత్యేకంగా కనిపించింది. బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్లు ఫిష్ టెయిల్ జడను స్టయిల్ గా అల్లేసి భుజాలపైకి వదిలేస్తే ఇంకో రోజు ఎల్లో కలర్ స్ట్రాప్ లేస్ జార్జెట్ గౌన్ ను పోనీతో ఎర్రని పెదాలతో అన్ మ్యాచ్డ్ అయినా డోంట్ కేర్ అన్నట్లు చూస్తోంది. డీప్ చాక్లేట్ బ్రౌన్ లిప్స్ మెటాలిక్ గ్లాస్ మెరుపులా జుట్టుతో అదే కలర్ డ్రెస్ తో స్టన్నింగ్ గా కనిపిస్తోంది. వస్త్రధారణకు అనువుగా హెయిర్ స్టయిల్ మేకప్ ఎలా చేసుకోవాలో మెళుకువలు తెలిస్తే ఎవరైనా అందాల కొండల్లాగే వుంటారు. ప్రియాంక ఫ్యాషన్ ఐకాన్. ఎవరైనా ఆమె సీక్రెట్ ను తెలుసుకోవచ్చు. అంటే తాము ఎలా వుంటారో గుర్తించ గలిగితే తమకేది మ్యాచ్ అవుతుందో తెలుసుకోగలుగుతారు.

    అందానికి ప్రతిబింబం ప్రియాంక

    జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకో ఇమేజ్ సృష్టించుకున్న నటి ప్రియాంకా చోప్రా. హాలీవుడ్ లో తనదైన ఓ స్టయిల్  లో సాగుతోంది. హెయిర్ స్టయిల్ వస్త్రాలంకరణ మార్చేస్తూ…

  • సినిమా విజయాల కోసం హీరో హీరోయిన్స్ ఎన్నెన్నో ఎక్సపెరిమెంట్ చేస్తున్న సమయం ఇది. ఈ మధ్య ఒక సినిమా కోసం అనుష్క చాలా బరువు పెరిగింది. అలా బొద్దుగా ముద్దుగా ఉన్న అనుష్క ఆ సినిమా కాన్సెప్ట్ వరకు బావుంది. ఇంకా ఆ తర్వాత ఆ పెరిగిన బరువు తగ్గించుకోవటం అనుష్క కి చాలా కష్టం అయిందట. సింగం 3 నమో వెంకటేశాయ లో అనుష్కను చుస్తే అభిమానులకు చాలా నిరాశ కలిగిందని కామెంట్స్ వచ్చాయి . కానీ తమాషా గా బాహుబలి - 2పోస్టర్ తో అనుష్క చాలా అందంగా వుంది. కానీ సినిమా లేటయిపోతుందనే భయంతో అనుష్కను గ్రాఫిక్స్ తో చక్కగా మార్చేశారని టాక్. గ్రాఫిక్స్ తో ఎలాంటి అద్భుతాలైన చేయచ్చని దానికి అనుష్క ఒక లైవ్ ఉదాహరణ అని చెపుతున్నారు. ఇది అమ్మాయిలకో హెచ్చరిక. మొదటినుంచి యుక్త వయసు వచ్చిన దగ్గరనుంచి ఒక తీరైన సౌందర్యం తో ఉండాలంటే ముందుగా తినే వాటిపైన దృష్టి పెట్టాలని బరువు చూసుకుంటూ మితంగా మాత్రమే తింటూ నోటికీ కళ్ళకీ రుచి ఇచ్చే తియ్యని పదార్ధాలకు వీడ్కోలు చెపుతూ ఆరోగ్యంగా ఉండండంటున్నారు డైటీషియన్లు.

    స్వీటీ ముచ్చట ఇదే

    సినిమా విజయాల కోసం హీరో హీరోయిన్స్ ఎన్నెన్నో ఎక్సపెరిమెంట్  చేస్తున్న సమయం ఇది. ఈ మధ్య ఒక సినిమా కోసం అనుష్క చాలా బరువు పెరిగింది. అలా…

  • పిల్లల పాల సీసాల్లో అంటే ప్లాస్టిక్ తో చేసిన సీసాల్లో వుండే బి సి ఎస్ అంటే బిస్ ఫినాల్ అనే పదార్ధం పిల్లల అనారోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని పరిశోధనలు చెపుతున్నాయి. ఇది కొంచెం వింతగా ఉన్నా నిజమే అంటున్నారు పరిశోధకులు. ఈ ప్లాస్టిక్ సీసాలతో పాలు తాగిన పిల్లలతో పెద్దయ్యాకఆస్తమా సంతానలేమి డయాబెటిక్ వంటి ఆరోగ్య సమస్యల తలెత్తే ప్రమాదం వుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధన కోతులపైనా చేశారట . ఈ బిపి ఎస్ రసాయనం కోతుల్లోకి పంపిన అనంతరం తల్లి కోతుల్లో విపరీతమైన మార్పు వచ్చిందట. ఈస్ట్రోజెన్ హార్మోన్ పైన ఈ రసాయనం విపరీతమైన ప్రతికూల ప్రభావం చూపించటం వారి దృష్టికి వచ్చిందట. అంచేత ఈ విషయం దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ సీసాల బదులు గాజు లేదా స్టీలు సీసాలు ఎంచుకోమని చెపుతున్నారు పరిశోధకులు.

    ప్లాస్టిక్ పాల సీసాలతో అనారోగ్యం

    పిల్లల పాల సీసాల్లో అంటే ప్లాస్టిక్ తో చేసిన సీసాల్లో వుండే బి సి ఎస్ అంటే బిస్ ఫినాల్  అనే పదార్ధం పిల్లల అనారోగ్యం పైన…

  • అలంకరణ కోసం వాడే ఫెస్ క్రీము రసాయనాలున్న ఇతర ఫౌండేషన్లు క్రీములు వాతావరణ కాలుష్యం కారణంగానూ చర్మ రంధ్రాల్లోకి జిడ్డు మురికి చేరిపోతాయి. దానితో చర్మ గ్రంధులు మూసుకుపోతాయి. మొటిమలు వైట్ హెడ్స్ మచ్చలు మొదలవుతాయి. వాటిని నివారించాలంటే ఆవిరి పట్టటం తప్పనిసరి. దీనివల్ల చర్మం గ్రంధులు తెరుచుకుంటాయి. మురికి జిడ్డు మృతకణాలు పోతాయి. వేడి నేతిలో ముంచి పిండిన మెత్తని నూలు గుడ్డతో ముఖం తుడిచేసినా ఫలితం ఉంటుంది. చెంచా దాల్చిన చెక్క పొడి ఓట్స్ పిండి తీసుకుని గోరువెచ్చని నీళ్లతో ముద్దగా చేయాలి. దాన్ని ముఖానికి రాసి కొద్దిసేపు మర్దనా చేసి పావుగంట తర్వాత నీళ్లతో కడిగేయాలి. మొటిమలు వాటి తా తాలూకు మచ్చలు పోతాయి. రెండు చెంచాల సెనగ పిండి లో సరిపోయేంత పెరుగు వేసి ముద్దగా చేసి ముఖానికి రాయాలి. పది నిముషాలు అయ్యాక కడిగేస్తే సరిపోతుంది. ఇందులో పసుపు కలిపితే ఏ సమస్యలు తగ్గటం తో పాటు ముఖం కళగా మారిపోతుంది. అలాగే నిమ్మరసం లోనే ఆల్ఫా హైడ్రాక్స్ ఆమ్లాలు చర్మాన్ని శుభ్రం చేస్తాయి. నిమ్మరసంలో దూది ముంచి మొహం పైన రాసి పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.

    మొటిమలు మచ్చలు నివారణ కోసం

    అలంకరణ కోసం వాడే ఫెస్ క్రీము రసాయనాలున్న ఇతర ఫౌండేషన్లు క్రీములు వాతావరణ కాలుష్యం కారణంగానూ చర్మ రంధ్రాల్లోకి జిడ్డు మురికి చేరిపోతాయి. దానితో చర్మ గ్రంధులు…