• వేసవి తాపం తీర్చడం మాత్రమే పుచ్చకాయ పని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. పుచ్చకాయలో బహుళ ప్రయోజనాలున్నాయి. దాహం తీర్చడంలో, బరువు తగ్గించడంలో, రక్త ప్రసరణ మెరుగు పరచడంలో, రక్త పోటు తగ్గించడంలో సహకరిస్తుంది. ఇందులో ప్రత్యేకమైన విశేషం ఇది సహజమైన వయాగ్రా. పుచ్చకాయలోని సిట్రల్లినో ఎమినో యాసిడ్ బ్లడ్ ఫ్లోను మెరుగు పరుస్తుంది. సిట్రల్లినోను మన శరీరం ఉపయోగించుకుని ఆర్గినైన్ అనే మరో ఎమినో యాసిడ్ రూపొందించటానికి పుచ్చకాయ సహకరిస్తుంది. దీనికి వయగ్రా ప్రభావం వుంది. రక్త నాళాలను రిలాక్స్ చేస్తుంది. వయాగ్రాకు ఇదే ప్రాధమిక స్వభావం వుంటుంది. 90 శాతం నీరుండే ఈ జ్యూసీ పండులో ఎనిమిది శాతం చక్కెర వుంటుంది. విటమిన్-c అధికంగా వుంటుంది. ఒక్క సెర్వింగ్ కు 71 క్యాలరీలు మాత్రం ఉంటాయి.

    పుచ్చకాయలో ఈ సీక్రెట్ వుంది

    వేసవి తాపం తీర్చడం మాత్రమే పుచ్చకాయ పని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. పుచ్చకాయలో బహుళ ప్రయోజనాలున్నాయి. దాహం తీర్చడంలో, బరువు తగ్గించడంలో, రక్త ప్రసరణ మెరుగు పరచడంలో,…

  • సాంప్రదాయ నగరాల్లో జూకాలు చాలా బావుంటాయి. సెలబ్రేషన్ లుక్ రవాలి అంటే అమ్మాయిలు జూకీలు పెట్టుకోవాల్సిందే. అదే అదే బంగారు జూకీలు కాకుండా బ్లాక్ మెటల్ జూకీలు పెట్టుకుంటే ప్రత్యేకమైన ఎధ్నిక్ లుక్ వస్తుంది. ఇప్పటి వాతావరణంలో చేనేత చీరలపై, లేదా నేత, కాటన్ డ్రెస్సుల పైకి ఈ ఎధ్నిక్ డిజైన్ మెటల్ జూకీలు ఎంటో చక్కగా మాచ్ అవ్వుతాయి. ఇది సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ కూడా, టెంపుల్ జ్యూవెలరీగా ముద్దుగా పిలిచే ఈ జూకీలు రంగు మరే సరికి ఫ్యాషన్ జూకాలైతే అందరిలో డిఫరెంట్ గా కనిపించడం ఖాయం. ఒక సారి వెరైటీస్ చుస్తే అర్ధమైపోతుంది. ఈ జూకీలు ఎంత అందంగా ఎంత విభిన్నంగా వున్నాయో. అందమైన డిజైనర్ చీర కట్టుకుని ఈ జూకీలు మేచింగ్ గా పెట్టుకుంటే మరే నగలు ధరించక పాయినా బావుండి తీరుతాది.

    కాటన్ కి జుకాలందం

    సాంప్రదాయ నగరాల్లో జూకాలు చాలా బావుంటాయి. సెలబ్రేషన్ లుక్ రవాలి అంటే అమ్మాయిలు జూకీలు పెట్టుకోవాల్సిందే. అదే అదే బంగారు జూకీలు కాకుండా బ్లాక్ మెటల్ జూకీలు…

  • నీహారికా, ఒక్క కొత్త నివేదిక వచ్చింది చూడు. భారత్ లో ఏటా 67 మిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతుందని అంచనా. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఆహారంలో అసలు మొత్తం వార్షిక ఉత్పత్తులు 40 శాతం అంటే 8.3 బిలియన్ డాలర్ల మేర ఆహారం వృధా అవ్వుతుంది. ఇప్పుడు ఆ ఆహారం వృధా చేస్తున్న వారి లిస్టులో మనము ఉన్నామా అని చెక్ చేసుకోవాలి. ఎలాగంటే కూరలు, పండ్లు, పచారీ సరుకులు కావలసినంత వరకే కొని ఇంట్లో శ్రద్దగా వాడుకుంటున్నాము. ఆఫర్లు, డిస్కౌంట్లు చూసి అవసరం లేనివన్నీ కొంటున్నామా? అప్పుడు ఆహారం, డబ్బు రెండూ వృధానే కదా ఇంకా నీహారికా, మనం అల్పాహారమైనా, భోజనమైనా ఎంత కావాలో అంతే ప్లేట్ లో పెట్టుకోవాలి. హోటళ్ళు రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు కావలసినంతే ఆర్డర్ ఇవ్వాలి. ఒక వేళ మిగిలితే మోహమాట పడకుండా పార్సిల్ చేసి ఇవ్వమని అడగాలి కూడా ఎవరికైనా ఇవ్వొచ్చు. లేదా మనమే తినొచ్చు తప్పేముంది. అనవసరమైన భేషజాలు దండగ. అలాగే ఇప్పుడు పార్టీలు, పెళ్ళిళ్ళలో వృధా అయ్యే ఆహారం లెక్కేలేదు. మెనూ జాబితా చుస్తేనే అస్సలు ఇందులో సగం పదార్ధాలైనా టేస్ట్ చేయగలమా అనుకుంటాము. ఇలాంటివాన్ని కాస్త చుసుకోగాలమేమో. 2013లో వచ్చిన ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం 78 ఆకలి దేశాల జాబితా లో భారత్ రాంక్ 63 గా వుంది. ఇప్పటి నివేదిక అందరికీ తిండి చేరడమే లేదంటోంది. మనకి ఎందుకు బాధ్యత లేకుండా పోయింది?

    44 వేల కోట్ల రూపాయిల ఆహారం వృధా

    నీహారికా, ఒక్క కొత్త నివేదిక వచ్చింది చూడు. భారత్ లో ఏటా 67 మిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతుందని అంచనా. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న…

  • మన దేశంలో పంచదార వాడకం గురించి 50 సంవత్సరాలలో విపరీతంగా పెరిగి పోయింది. పంచదార అంటే ఇష్టపాడనీ వారుండరు. 15 శాతం మందికే స్వీట్లు అంటే ఇష్టం వుండదు. మనం ప్రస్తుత అంతర్జాతీయ ఆరోగ్య హెచ్చరికలకు అనుగుణంగా చక్కరకు దూరంగా, వాయిదాల పద్దతిలో మారుతూ రవళి. మెల్లగా తీపి పదార్ధం దాని సాంపుల్ ఎక్కువగా వుండే పదార్ధాల వాడకం తగ్గించాలి. ఆహార వస్తువుల పై వుండే లేబుల్స్ లో మిశ్రమ పదార్ధాలలో చక్కర స్థాయి ఏమిటో చూడాలి. పంచదార లేకుండా బతకలేం అనుకుంటే డిజర్ట్స్ వదులుకోవాలి. కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా వుండాలి. పంచదార లేని నిమ్మరసం, జీలకర్ర, ఉప్పు కలిపి తాగాలి. పళ్ళు తినాలి. పంచదార తక్కువ వుండే స్వీట్లు ఎంచుకోవాలి. పండ్లు మినహా మరేమీ లేని జామ్లు స్వీట్లు తింటే బావుంటుంది. మద్యం వల్ల శరీరంలో కాలేయానికి ఎంత నష్టం కలుగుతుందో ఆ స్థాయిలో నిమ్మరసం పంచదార నీళ్ళు తాగినా అంత నష్టం కలుగుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

    మద్యం తాగితే ఎంతో పంచదార నీళ్ళు అంతే ప్రమాదం

    మన దేశంలో పంచదార వాడకం గురించి 50 సంవత్సరాలలో విపరీతంగా పెరిగి పోయింది. పంచదార అంటే ఇష్టపాడనీ వారుండరు. 15 శాతం మందికే స్వీట్లు అంటే ఇష్టం…

  • మూడు కొవ్వలు కలిపేస్తే పెద్ద యుద్ధం జరుగుతుంది, ఆడవాళ్ళలోనే ఐక్యమత్యం ఉండదనీ దేశమంతా బోల్డు జోకులున్నాయి. ఇప్పుడిది చూడండి. నలుగురు తోడికోడళ్ళు కలిసి ఓ ఏడాదిలో బావి తవ్వి నీళ్ళా కరువు తీర్చారు. అది రాజస్థాన్ రాష్ట్రం ఈ నలుగురు మహిళలు వున్న గ్రామం లామ్ బహాల్డ్. ఇది ఉదయపూర్ కి 130 కిలో మిటర్ల దూరంలో వుంది. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా ఈ వ్యక్తికి ఏ మోక్షము లేదు. నీళ్ళు ఇవ్వండి అని గొంతు పోయేలాగా అరచినా ప్రభుత్వం మొదట వినలేదు. ఈ ఊరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తోడికోడళ్ళు. ఉలి, సుత్తి లాంటి పరికరాలతో మూడేళ్ళపాటు శ్రమ పడి. 40 అడుగుల లోటు 20 అడుగుల వెడల్పు వున్న బావిని తవ్వేసారు. ఇంట్లో మొగాళ్ళు, చుట్టు పక్కల వాళ్ళు వెక్కిరించారు కానీ సాయం మాటకు రాలేదు. మూడేళ్ళు వొళ్ళు విరిగేలా శ్రమ పడితే బావిలో వూట పడింది. గ్రామానికి నీళ్ళు దొరికాయి. కేవలం నలుగురు కోడళ్ళు నిరంతర శ్రమ ఫలితం.

    తోడి కోడళ్ళు భావి తవ్వేసారు

    మూడు కొవ్వలు కలిపేస్తే పెద్ద యుద్ధం జరుగుతుంది, ఆడవాళ్ళలోనే ఐక్యమత్యం ఉండదనీ దేశమంతా బోల్డు జోకులున్నాయి. ఇప్పుడిది చూడండి. నలుగురు తోడికోడళ్ళు కలిసి ఓ ఏడాదిలో బావి…

  • వేసవిలో వాతావరణం లోని వేడి కారణంగా ప్లాస్టిక్ బాటిల్స్ లో గోరు వెచ్చగా అయిపోయిన నీటిని తాగొద్దని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరీకొ ఇన్ స్టిట్యుట్ అఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సైన్స్ కు చెందిన పరిసోధకులు చేఅపుతున్నారు. ఇందుకోసం ఎన్నో బ్రాండెడ్ వాటర్ బాటిళ్ళనే పరిశోధించారట. వేడి వాతావరణంలో వున్న బాటిళ్ళలోని నీళ్ళు అంటిముని, బైసెఫినాల్ అనే రసాయినాలు వున్నట్లు గుర్తించారు. సాధారణంగా వాటర్ బాటిళ్ళు పాలీ ఇధిలీన్ టెరిప్తాలేట్ తో తయ్యారు చేస్తారు. అవి వేడెక్కినప్పుడు ఆ పదార్ధం నీళ్ళలోకి ఈ రసాయినాలు విడుదల చేస్తుంది అని అనేకనేక అనారొగ్యాలకి గురిచేస్తాయని నీళ్ళని ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ చెయద్దనీ ఒకవేళ అలా చేయవలసి వచ్చినా అవి చల్లని వాతావరణంలో వుండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇప్పుడు ఇంకెంతో అందమైన బాటిళ్ళు, కంటికి ఆకర్షిణీయంగా ఉండేవి వస్తాయి. పిల్లలు స్కూల్లకు తీసుకు పోయే బాటిళ్ళు, కంటికి ఆకర్షణీయంగా ఉండేవి వస్తున్నాయి. పిల్లలు స్కూళ్ళకు తీసుకు పోయే బాటిళ్ళు వేడెక్కకుండా ఉంటున్నాయా?

    నీళ్ళు వేడెక్కాయంటే ప్రమాదమే

    వేసవిలో వాతావరణం లోని వేడి కారణంగా ప్లాస్టిక్ బాటిల్స్ లో గోరు వెచ్చగా అయిపోయిన నీటిని తాగొద్దని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరీకొ ఇన్ స్టిట్యుట్ అఫ్ ఫుడ్…

  • ఎండలు మాడ్చేస్తుంన్నాయి. సహజంగానే చర్మం కమిలిపోయి వాడిపోయి కనిపిస్తుంది. ఈ నలుపు తగ్గి కాంతి వంతంగా ఉండాలంటే ఇంట్లో అందుబాటులో వుండే పదార్ధాలతో బ్యూటీ ప్యాక్ తాయారు చేసుకోవచ్చు. బాదాం నూనె లో ఇ-విటమిన్ వుంటుంది. ఇది చర్మం ముడతలు పడనీయదు. ఇందుకోసం రోజ్ వాటర్, గ్లిజరిన్, బాదాంనూనె కలిపి ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ తయారీ కోసం ఎండిన గులాబీ రేకుల్ని గిన్నెలో వేసి మరిగించిన నీళ్ళు అందులో పోసి రాత్రంతా అలా వుంచి ఉదయాన్నే వడకడితే రోజ్ వాటర్ తయ్యారవ్వుతుంది. ఈ రోజ్ వాటర్ లో గ్లిజరిన్ బాదాం నూనె కలిపి ఆ మిశ్రమాన్ని మునివేళ్ళతో చర్మానికి పట్టించి మసాజ్ చేయాలి. తర్వాత వేడి నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా తయ్యారవ్వుతుంది. ఇది ఫ్రిజ్ లో రెండు మూడు రోజులు ఉంచుకోవచ్చు. లేదా ఎప్పటికప్పుడు తాయారు చేసుకున్నా పర్వాలేదు. కానీ ముడతల నివారణకు ఇది మేలైన వైద్యం.

    కమిలిన చర్మం మెరుస్తుంది

    ఎండలు మాడ్చేస్తుంన్నాయి. సహజంగానే చర్మం కమిలిపోయి వాడిపోయి కనిపిస్తుంది. ఈ నలుపు తగ్గి కాంతి వంతంగా ఉండాలంటే ఇంట్లో అందుబాటులో వుండే పదార్ధాలతో బ్యూటీ ప్యాక్ తాయారు…

  • ఫ్యాషన్ డిజైనర్లు ఎన్నో కాంబినేషన్స్ తయ్యారు చెస్తారు. దాదాపు ప్రతి డ్రెస్ మార్కెట్ అయిపోయి వుంటుంది. ఇదెలా సాధ్యం అంటే వాళ్ళు ఒక్క డ్రెస్ ని కొందరిని, ఏజ్ దృష్ట్యా, వాళ్ళ వృత్తి, ఉద్యోగం దృష్ట్యా, కొందరి అభిరుచిని కలగలిసి డిజైన్ చేస్తారు. ఇప్పుడు సమ్మర్ స్పెషల్స్ డిజైన్ చేయాలంటే కూల్ గా, సింపుల్ గా, స్టైల్ గా, స్మార్ట్ గా వుండాలి. ఫస్ట్ కంఫర్ట్ ద్రుష్టిలో తర్వాత రంగు కలయిక అటు తర్వాత ఫలానా వయస్సు అవీ డ్రెస్సులు డిజైనింగ్ చేస్తారు. వేసవికి సౌకర్యంగా వుండే డ్రెస్సులు ఆన్ లైన్ లో చుస్తే, లాంగ్ స్లీవ్ కాటన్ గౌన్, జీన్స్, లూజ్ పాంట్ స్టైల్ గా అమరినట్లు వుంటుంది. జీన్స్ పైకి లాంగ్ కాటన్ టాప్ , లాంగ్ స్కర్ట్ పైన కాటన్ టీషర్టు , పలాజో, లాంగ్ మాక్సి గౌన్, సివిల్ వీన్ మాక్సి డ్రేస్సులు కలంకారీ కాటన్ టీ షర్టులు . ఇవన్నీ చక్కని మోడల్స్ వేసుకుని కనిపిస్తారు కనుక ఫర్ ఫెక్ట్ గా ఎలా ఉంటాయో ఫోటోల్లో చూడవచ్చు.

    సమ్మర్ కూల్ సింపుల్ స్మార్ట్ ఫ్యాషన్

    ఫ్యాషన్ డిజైనర్లు ఎన్నో కాంబినేషన్స్ తయ్యారు చెస్తారు. దాదాపు ప్రతి డ్రెస్ మార్కెట్ అయిపోయి వుంటుంది. ఇదెలా సాధ్యం అంటే వాళ్ళు ఒక్క డ్రెస్ ని కొందరిని,…

  • హీరోయిన్ల డ్రెస్సుల గురించి ఇప్పుడు విమర్శలు వస్తాయి. కానీ వాళ్ళు ధరించే దుస్తులు డిజైనింగ్, సెలక్షన్స్ లో అంత చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని ఎలా వుంటారు? అని కాజల్ అగర్వాల్ ను అడిగితే, వచ్చిన సమాధానం మాత్రం పాపం అనిపిస్తుంది. 'లోకేషన్ మేం తప్ప అంటే హీరోయిన్స్ తప్పా అందరూ ఫుల్ కావర్డ్ గా వుంటారు. వాళ్ళను చూసి ఒక నిట్టూర్పు వదలాలి. మన పోఫెషన్ ఇలాగే వుంటుంది అనుకోని ప్రేపేర్ అవ్వాలి. అస్సలు సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడే మొహమాటం బిడియం వంటివి పక్కన పెట్టాలి. మేం వింత వింత కాస్ట్యుమ్స్ వేసుకోవాలి. వాటి పైన దృష్తి పెడితే ధ్యాస నటన మీద ఏముంటుంది? చుట్టూ జనాల్ని చూసినా మన కాన్సెన్ట్రెషన్ పోతుంది. కళ్ళెదుటే జనాలున్నా లేనట్లే పట్టించుకోకుండా వుండాలి. ఒక్కోసారి నేను నేను రాత్రి ఒంటిగంటకు నిద్ర పోయి ఉదయం ఐదు గంటలకల్లా నిద్ర లేచి షూటింగ్ కు పోయిన రోజులున్నాయి. అంత హార్డ్ వర్క్ చేస్తేనే ఈ ఫీల్డ్ లేకపోతె ఇంటికి పోవాల్సిందే అంటోందామె . నిజమే ఒక కెరీర్ లో సెలబ్రెటీ హోదాలో నిలబడటం ఆషామషి కాదు.

    ఆ భరీ ఆ డ్రెస్సులు ఎంత కష్టమో తెలుసా!

    హీరోయిన్ల డ్రెస్సుల గురించి ఇప్పుడు విమర్శలు వస్తాయి. కానీ వాళ్ళు ధరించే దుస్తులు డిజైనింగ్, సెలక్షన్స్ లో అంత చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని ఎలా వుంటారు?…

  • మొక్కలు పెంచటం అందరకి ఇష్టం. కుండీలు పెట్టుకునే సౌకర్యం లేని ఇళ్ళు. అపార్ట్మెంట్ లో వున్న చిన్న సిటవుట్ లో కుండీలు పెట్టలేము. ఒక వేళ పెట్టినా ఆకాశమంటే ఇళ్ళ మధ్యకి ఎండ ఎక్కడ నుంచి వస్తుంది. ఇలాంటి అలా సరదా వుండీ, చోటు లేక అయ్యో అనుకొనే వాళ్ళకోసం లివి, ఈడెన్ సక్షన్ ప్లాంటర్లు వచ్చాయి. ఈ కుండీల వెనక వుండే రబ్బరు నిర్మాణం సయం తో వీటిని నునుపుగా వుండే అద్దాల గోడలు టైల్స్ కి సులభంగా అంటించ వచ్చని స్థలం లేదన్న సమస్య వుండదు. ఎక్కువ ఎండ ఎక్కడ పడితే అక్కడికి మార్చుకోవచ్చు. లేదా ఒక పెద్ద సైజు ఇంకో చిన్న సైజు కొని గోడకి అతికించిన కుండీ తీసేయ కండి లోపల పెట్టిన చిన్న కుండీలో మొక్కలు కాసేపు ఎండలో పెట్టొచ్చు. నీరు ఎక్కువగా పోసినా కింది కుండీలోకే కారుతుంది. జాగ్రత్తగా క్లీన్ చేసుకోవచ్చు. డ్రాయింగ్ రూమ్లో ఇంకెంత బావుంటుందో. హాలు గోడకి పచ్చని గడ్డి మొలిస్తే ఎంత బావుంటుంది. వంటగదిలో కొత్తిమీర, పుదినా వంటివి పెంచుకోవచ్చు.

    అతికించే కుండీలు

    మొక్కలు పెంచటం అందరకి ఇష్టం. కుండీలు పెట్టుకునే సౌకర్యం లేని ఇళ్ళు. అపార్ట్మెంట్ లో వున్న చిన్న సిటవుట్ లో కుండీలు పెట్టలేము. ఒక వేళ పెట్టినా…