• నలభై ఏళ్ళు దాటాక మేకప్ విషయం లో కొన్ని మార్పులు తీసుకోవాలంటున్నారు ఎక్సపర్ట్స్. చిన్నప్పుడు ఎలాంటి మేకప్ అయినా సరే అప్పుడు గొప్ప సెలబ్రేషన్. 40 ఏళ్ళు దాటితే ముందు కళ్ళ కింద నల్లని వలయాలు వస్తాయి. ఆలా కనిపించకుండా మేకప్ లో క్లీన్సర్ ని ఒకటికి రెండు సార్లు వేస్తె నల్లని వలయాలు కనబడకుండా చేయచ్చు. కొన్ని రకాల ఐషాడోలు అంటే గ్రే ముదురు రంగులో కళ్ళని అలసి పోయినట్టు కనబడేలా చేస్తాయి. లేత రంగులు బావుంటాయి. ఐషాడో లైనర్ వంటివి వాడటం ఇష్టంలేకపోతే కనీసం ప్రైమర్ అయినా రాసుకోవాలి. కళ్ళు చక్కగా వుంటాయి. మస్కారా ఎంత తక్కువ వుంటే అంత బావుంటుంది. పైన ఉండే కనురెప్పలకే మస్కారా వేయాలి. ముఖం లోని మడతలు దాచి పెట్టేందుకు షమ్మర్ వాడుతుంటారు. దాని వల్లనే ప్రమాదం మడతలు స్పష్టంగా కనిపిస్తాయి. బదులుగా మ్యాటీ ఫెథర్స్ వాడితే అలంకరణ సహజంగా కనిపిస్తుంది. అలాగే జుట్టు గట్టిగా దువ్వి పోనీ లా కూడా మానేయాలి. బిగువుగా లాగి కడుతుంటే నడి నెత్తి మీద జుట్టు కుదుళ్ళు వదులై జుట్టు రాలిపోతుంది. 40 గంట కొట్టగానే కొన్ని మార్పులు చేసుకుంటే వయసుని అక్కడే ఫ్రీజ్ చేయచ్చు.

    మేకప్ కాస్త మారిస్తే ఉత్తమం

    నలభై ఏళ్ళు దాటాక మేకప్ విషయం లో కొన్ని మార్పులు తీసుకోవాలంటున్నారు ఎక్సపర్ట్స్. చిన్నప్పుడు ఎలాంటి మేకప్ అయినా సరే అప్పుడు గొప్ప సెలబ్రేషన్. 40 ఏళ్ళు…

  • మంచి ఆరోగ్యానికి షార్ట్ కట్స్ అనేవి ఏవీ ఉండవు. అందుకోసం కేవలం కష్టపడాలి. హెల్త్ ఫిట్ గా ఉండే ఎక్సర్సైజు లు చేయాలి. పెరఫార్మేన్స్ మెరుగుదల కోసం ముందుగా స్నాక్స్ తినాలి. ఏదీ తినకుండా వర్కవుట్స్ చేస్తే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ముందుగా ప్రతి వర్కవుట్ తర్వాత స్ట్రెచింగ్ చేస్తే శరీరం కూలవుతుంది. కూర్చునే ఉద్యోగాల చేసేవాళ్ళు ప్రతి 30 నిమిషాలకు బ్రేక్ తీసుకోవాలి. కొన్నిసార్లు టైట్ డెడ్ లైన్స్ వుంటే అలారం గంటకోసారి ఫోన్ లో సెట్ చేస్తే వెంటనే లేచి తిరిగే అలవాటు అవుతుంది. ఇలా కొన్నాళ్ళు గంటకు సరి లేచి తిరిగే అలవాటు తో ఎనర్జీ స్థాయిలు ఎంత పెరుగుతాయో ఆశ్చర్యం వేస్తుంది కదూ. క్రమం తప్పకుండా ఎనిమిది గంటలు నిద్రపోవాలి. లేకపోతే నిద్రలేమి ప్రభావం శరీరం పైన వుంటుంది. అప్పుడు ఎప్పుడు కుదిరితే అప్పుడో 20 నిముషాలు విశ్రాంతి తీసుకున్నా నష్టమేం లేదు. శరీరం ఆ విశ్రాంతిని అర్ధం చేసుకోగలదు. బ్రేషింగ్ తర్వాత నోరంతా నీటిని నింపుకుని కుదుపుతూ పుక్కలించటం చేస్తే నోటిలో ఉన్న చెడు బాక్టీరియా పోయి నోరు శుభ్రపడుతుంది. రాత్రి పడుకోవటానికి రెండు గంటల ముందే తినే ఆహరం ఎదో తినేయాలి. లేదా తిని తినగానే నడక చేరితే అదనపు క్యాలరీలు చేరటం లేదా క్యాలరీలు కరిగాక పోవటం జరుగుతుంది. ఆరోగ్యం కోసం సమయం లేదనవద్దు. కేటాయించి తీరాలి అంతే.

    షార్ట్ కట్స్ తో ఆరోగ్యం సాధ్యం

    మంచి ఆరోగ్యానికి షార్ట్ కట్స్ అనేవి ఏవీ ఉండవు. అందుకోసం కేవలం కష్టపడాలి. హెల్త్ ఫిట్ గా  ఉండే ఎక్సర్సైజు లు చేయాలి. పెరఫార్మేన్స్ మెరుగుదల కోసం…

  • మోడ్రన్ డిజైన్స్ పేరు చెపితే రీతూ కుమార్ పేరు ముందుంటుంది. అనేక దశాబ్దాలుగా ఫ్యాషన్ రంగంలో ఉన్న ఆమెలో క్రియేటివిటీ కొంచెం కూడా తగ్గలేదు. ఇటీవలే ఎవర్స్టోన్ కాపిటల్ నుంచి అందిన వంద కోట్ల పెట్టుబడిలో రీతూ కుమార్ ఇంకో మూడు కొత్త బ్రాండ్స్ మార్కెట్ లోకి తీసుకొచ్చారు. దుబాయ్ లో పారిస్ లో ఆమె షాపులున్నాయి. సొంత డిజైన్ వ్యాపారంతో పాటు హ్యాండ్ లూమ్ బోర్డ్స్ , వీవర్స్ సర్వీస్ సెంటర్స్ బోర్డు లో సభ్యురాలిగా ఉన్నారు. వారణాసి ,బీహార్ ,ఒరిస్సా లోని సంప్రదాయ డిజైన్లకు ప్రచారం తీసుకొచ్చారు. రీతూకుమార్. ఫ్యాషన్ డిజైనింగ్ ఇది అంతం అంటూ ఉండదు అంటారామె. ఆన్ లైన్లో ఆమె డిజైన్స్ కళ్ళు చెదిరేలా వుంటాయి. లక్షరూపాయల పైమాటే ఒక్కో చీర. బెనారెసీ ,ఒవేన్ రెడ్ గోల్డెన్ శారీస్ , రిచ్ గోల్డెన్ శారీ, ఎమరాల్డ్ మిర్రర్ వర్క్ శారీస్ , కోరల్ ఎంబ్రాయిడరీ చీరలు ఐవరీ గోటూ బ్లింక్ ఎంబ్రాయిడరీ చీరలు ఇవన్నీ రియల్ జరీ వర్క్ లు , రాయల్ లుక్ తో పార్టీలకు ,పెళ్లిళ్లకు, ఫెస్టివల్స్ కు రైట్ అవుట్ ఫిట్స్ కుర్తీలు ,సూట్స్ ,శారీస్ ,బాటమ్స్ , లెహెంగాస్ ఈ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రీతూ కుమార్ చేతుల్లోంచి ఫ్యాషన్ వీక్ లో మెరిసి అమ్మాయిల కళ్ళలో పడిపోయి బెస్ట్ సెల్లింగ్ అయిపోతాయి.

    ఎన్నేళ్లొచ్చినా ఆమె స్టిల్ యంగ్

    మోడ్రన్ డిజైన్స్ పేరు చెపితే రీతూ కుమార్ పేరు ముందుంటుంది. అనేక దశాబ్దాలుగా ఫ్యాషన్ రంగంలో ఉన్న ఆమెలో క్రియేటివిటీ కొంచెం కూడా తగ్గలేదు. ఇటీవలే ఎవర్స్టోన్…

  • వైట్ హౌస్ లోని ఈస్ట్ రూమ్ లో మిచెల్లీ ఒబామా దీపావళి దివ్వెను వెలిగించి పండుగ సంబరాన్ని ప్రారంబించారు. హిందూ, సిక్కు, జైన్ కమ్యూనిటీస్ నుంచి 240 మంది ప్రతిభా వంతులైన సెలబ్రెటీస్ లో ప్రెసిడెంట్ ఒబామా ఇల్లు నిజమైన దీపావళికి అద్దం పట్టినట్లు వుంది. మిచెల్లీ ఒబామా మాట్లాడుతూ ఇక్కడున్న మేధావులే నిజంగా ప్రపంచాన్ని వెలిగించే జ్యోతుల్లాంటి వాళ్ళు ఎంతో మంది యువతరానికి ఆదర్శ ప్రాయమైన మీతో ఈ సమావేశ మందిరానికి వెలుగొచ్చింది అన్నారామె. ప్రతి సంవత్సరం మేం దీపావళి జరుపుకునేనేదుకు ఒకే కారణం ఈ వైట్ హౌస్ పీపుల్స్ హౌస్ మన అందరిదీ ఇది. మనందరి సంస్కృతీ సంప్రదాయాలు ఇక్కడ గౌరవించబడతాయి. రాక్షస సంహారం అనంతరం వేడుక చేసుకుంటూ వెలిగించే దీపాలు, చీకటి చీల్చే వెలుగు కిరణాలు. అన్నారామె తీయ్యని మిఠాయిలు తిన్నాక మీచెల్లీ లో ఆడి పాడిన దృశ్యాలు మాధ్యమాల్లో అందరూ చూసి సంతోషించారు. దివ్య దీపావళికి మనం కూడా స్వగతం చెపుదాం.

    మిచెల్లీ ఒబామా ఇంట్లో దీపావళి సంబరాలు

    వైట్ హౌస్ లోని ఈస్ట్ రూమ్ లో మిచెల్లీ ఒబామా దీపావళి దివ్వెను వెలిగించి పండుగ సంబరాన్ని ప్రారంబించారు. హిందూ, సిక్కు, జైన్ కమ్యూనిటీస్ నుంచి 240…

  • ఫేస్ బుక్ అలా పెరిగిపోతుంది. ఇండియాలో ఫేస్ బుక్ ఉపయోగించే వారి సంఖ్య 94 మిలియన్లకు చేరింది. ప్రతి నిమిషం ఈ సంఖ్య పెరుగుతుంది. ఇండియాలోని ఫేస్ బుక్ మేనేజింగ్ డైరెక్టర్ క్రితిగా రెడ్డి. భారీ ఎత్తున ఉన్న ఈ సోషల్ మీడియా పిథం పైన కూర్చున్న క్రితిగా రెడ్డి కంపెనీ అభివృద్ధిలో ముఖ్య భాగంగా వుంది. ఫోర్బ్ స్ పత్రికలో ఆమె మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్స్ లిస్టులో 50 స్థానంలో చూపెట్టింది. పెద్ద కంపనీలైన టాటా డోకొమో,యూనిలివర్, లోరియల్ వంటివి ఫేస్ బుక్ ద్వారానే వినియోగ దారునికి చేరుతున్నాయి. వారి అనుబంధ సంస్థల అమ్మకాలు మార్కెటింగ్ టీమ్లను రెట్టింపుగా కొంటున్నాయి. ముంబాయి గుర్ గాన్ లో ఆఫీసులు అద్భుతంగా పని చేస్తున్నాయి. చిన్న చిన్న పట్టణాలలో వ్యాపారం పెరిగేందుకు, కొత్త స్టార్ట్ అప్స్ ఫేస్ బుక్ ను ఉపయోగించుకుంటున్నాయి. ఈ ప్రోత్సాహం మొత్తం క్రిత్తిగా రెడ్డి సమర్ధత కారణంగానే అని చెప్పడంలో సందేహం లేదు.

    ఫేస్ బుక్ తెర వెనుక…………..

    ఫేస్ బుక్ అలా పెరిగిపోతుంది. ఇండియాలో  ఫేస్ బుక్ ఉపయోగించే వారి సంఖ్య 94 మిలియన్లకు చేరింది. ప్రతి నిమిషం ఈ సంఖ్య పెరుగుతుంది. ఇండియాలోని ఫేస్…

  • నీళ్ళల్లో సాంబార్లో పాయసంలో గరిటలు పడేస్తే అవి నిలువుగా లేచి నిలబడి కనబడుతూ వుంటే దానింగ్ టేబుల్ పైన ఇంద్రజాలం లాగా వుండదు. సాధారనంగా పెద్ద గిన్నెల్లో సాంబార్, పులుసు, పాయసం, లాంటివి టేబుల్ పైన పెడతాం. అన్ని వడ్డించుకుని ఇలా ఆ గరిటె అందులో వుంచామో లేదో జారి గిన్నె అక్కడికి వెళ్ళిపోతుంది. వేడి వేడిదైన చల్లనిది అయినా వాటిలో చెయ్యి పెట్టి గెలికి తీయడం అంత బాగుండదు. నువ్వేసిన ఇంకో గరిటలో సామ్బారో, పాయసమో ఎన్ని పడతాం. ఈ సమస్యకు పరిష్కారం గా ఫ్లోటింగ్ కట్లరీ వచ్చాయి. డిజైనర్ సియోంగ్ యాంగ్ లీ రూపొందించిన ఈ ఫ్లోటింగ్ కట్లరీ స్పూన్లు, గరిటెలు, ఫోర్క్ లు మధ్యభాగంలో బంతిలా బోలుగా వుంటాయి. ఆఖరికి చిన్న బౌల్ లో స్పూన్ తాగాలన్నా దీన్లో వేసిన స్పూన్ నిలువుగా నిలబడుతుంది. సింకులో గిన్నెలు కడిగే టప్పుడు కూడా నీళ్ళల్లో ఈ స్పూన్లు తేలుతూ వుంటాయి. ఈ తేలే గరిటల ఆలోచన బాగుంది. వీలైతే ఆన్లైన్ లో వీక్షించండి.

    తేలే గరిటలు

    https://scamquestra.com/news/26-privet-iz-1994-goda-andrey-andreevich-abakumov-gendirektor-atlantic-global-asset-management-agam-34.html

  • అత్యంత ఖరీదైన ఉత్పత్తులను వాడుతున్న వయసులో వచ్చే మార్పులు మొహంపోయిన కనబడుతూనే ఉన్నాయే నని ఎంతో మంది సందేహం. ఎన్నో రకాల క్రీములు అనవసరపు ప్రయోగాల వల్లనే ముఖచర్మం దెబ్బతింటుందని వైద్యులు చెపుతున్నారు. పరిశుభ్రమైన నీళ్లతో కడుక్కోవటం కంటే సౌందర్య చిట్కా మరొకటిలేదని వాళ్ళ వాదన. ఇప్పుడు మార్కెట్ లో దొరికే యాంటీ ఏజింగ్ ఉత్పత్తులో హైల్యూజనిక్ యాసిడ్ షియా బటర్స్ ,గ్లిజరిన్ వుంటే అవి మాయిశ్చరైజర్ గా కుడా పనిచేస్తాయి. లేకపోతే సహజమైన తేమ కుడా ఈ ఏజింగ్ క్రీములు కడిగేయగానే పోతుంది. యాంటీ ఏజింగ్ క్రీములో ఆల్మండ్ ఆయిల్ .వీట్ జెర్మ్ ఆయిల్ వుందో లేదో చూసుకోవాలి. లేదా ఆ క్రీములో ఏ ఏ పదార్ధాలు వుంటాయో తెలుసుకోలేం కనుక చర్మం మడతలు పడదు. ముఖ సౌందర్యాన్ని పెంచేది సహజమైన నిద్ర. కంటినిండా నిద్ర వేలకు తిండి మించిన ఆరోగ్య సూత్రం లేదు. రాత్రివేళ ముఖం శుభ్రంగా కడుక్కుని రెట్ నాల్ కలిగిన నైట్ క్రీమ్ ని రాసుకుంటే చాలు. చందనపు పేస్ట్ దగ్గర నుంచి పసుపు తేనె నిమ్మ పాలు సెనగపిండి దాకా సహజమైన పదార్ధాలను వాడి చూడండి. యాంటీ ఏజింగ్ క్రీమ్ పక్కన పడేస్తారు.

    యాంటీ ఏజింగ్ క్రీమ్స్ తో ప్రమాదం

    అత్యంత ఖరీదైన ఉత్పత్తులను వాడుతున్న వయసులో వచ్చే మార్పులు మొహంపోయిన కనబడుతూనే ఉన్నాయే నని  ఎంతో మంది సందేహం. ఎన్నో రకాల క్రీములు అనవసరపు ప్రయోగాల వల్లనే…

  • సినిమా ప్రపంచం ఒక మహేంద్రజాలం. నటన వచ్చి డాన్స్ లొచ్చి ,పంచ్ డైలాగ్స్ పండించేస్తే యాక్టర్స్ అయిపోరు. స్టార్ మెటీరియల్ ను గుర్తు పట్టే కాస్టింగ్ డైరెక్టర్స్ షానూ శర్మ లాంటి వాళ్ళ కళ్ళలో పడాలి. పబ్స్ , మాల్స్ , కాలేజీ ఫంక్షన్స్ కాఫీ షాప్స్ కుర్రకారును అన్వేషించే షానూ శర్మ శబాష్ అనుకుంటే చాలు వెండితెర వేల్పులైపోతారు. రణబీర్ సింగ్ దగ్గర నుంచి ఆలియా భట్ , పరిణీతి చోప్రా ,వాణీ కపూర్ ,భూమిక ఇలా చాలా పెద్ద లిస్టే వుంది. ఆమె రికమెండ్ చేసిన వాళ్లలో వున్నారు. కాస్టింగ్ డైరెక్టర్ గా సినిమాకు కావలిసిన నటీనటులను ఎంపిక చేస్తారు. ఫేస్ బుక్ ,ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ వంటి సామజిక మాధ్యమాలు ఫొటోలో షానూ శర్మ కార్యాలయంలో ఆమె అసిస్టెంట్స్ వడపోసి ఆమె ముందు పెడతారు. ఆడిషన్స్ నిర్వహించి కొందరిని సెలెక్ట్ చేసి వాళ్ళని దర్శకులకు రికమెండ్ చేస్తుందామె. దర్శకులు చెప్పే కధ పాత్రల తీరుతెన్నులు అర్ధం చేసుకుని ఆ ఊహలను ఆధారంగా నటుల్ని సెలెక్ట్ చేయటం ఆమె వృత్తి. తెరముందు తారలు మనకు తెలుసు. తెర వెనుక ఒక మహా సముద్రం వుంది. సెట్ లో బాయ్ దగ్గర నుంచి కెమెరాలు, లైట్లు , కాస్ట్యూమ్స్ , సెట్లు , ఆ సెట్టు సరిగ్గా నిలబడేందుకు అందులో మేకులు ఎక్కడ దిగ్గొట్టాలో తెలిసిన అసిస్టెంట్ తో సహా సినిమా అనే అందమైన కధని మన ముందు సృష్టించేందుకు తలో చేయి వేస్తారు. మనం జూనియర్ ఎన్టీఆర్ మీసాలు మెలేస్తే రెచ్చిపోతాం. ఆ మీసాలు అంటించి అవి ఊడిపోకుండా జాగ్రత్తగా కాపాడే మేకప్ అసిస్టెంట్ మొహం మీరు చూడగలరా ?

    స్టార్ మెటీరియల్ ను గుర్తుపట్టే షానూ శర్మ

    సినిమా ప్రపంచం ఒక మహేంద్రజాలం. నటన వచ్చి డాన్స్ లొచ్చి ,పంచ్ డైలాగ్స్ పండించేస్తే యాక్టర్స్ అయిపోరు. స్టార్ మెటీరియల్ ను గుర్తు పట్టే కాస్టింగ్ డైరెక్టర్స్…

  • క్వీన్ ఆఫ్ పాప్ గా పిలిచే మడోన్నా సంగీత రంగంలో సంచలనం ఈవిడ పాటల రికార్డ్స్ 300 మిలియన్లు అమ్ముడుపోయాయి. అత్యంత ప్రతిభావంతమైన మడోనా సంగీతకోవిదురాలు మహిళా వ్యాపారవేత్త ప్రజలకు ఆదర్శం కూడా. నిరంతరం నూతన కల్పనలు ఆమె విజయ రహస్యం. మోడల్తో మొదలైన హెయిర్ స్టైల్ తో వైల్డ్ గా కనిపించే మడోనా రాను రానూ ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోయింది. కాటుక కళ్ళు ఫిట్ నెస్ గా వుండే శరీరం కాప్రీ లు డెనిమ్ లతో ఆమె యువత కు ఆరాధ్య దేవతగా మారిపోయింది. తన దైన అసాధారణ మార్గంతో ఫ్యాషన్ పరిశ్రమనే శాసించగలదీమె. సంగీత ప్రపంచాన్ని ఎలా మార్చగలిగిందో ఫ్యాషన్ ను కూడా ఇంతే. ఈ వెడ్డింగ్ గౌన్ దగ్గర నుంచి డెనిమ్ టీ షర్ట్ దాకా ఆమె ఏం ధరించినా ఫ్యాషన్. బ్రిట్నీ స్పియర్స్ ఈమె ద్వారానే స్ఫూర్తి పొందనంటోంది. మడోన్నా ను ప్రత్యేకంగా ఎందుకు పరిచయం చేసుకుంటున్నామంటే ఈ ఆధునిక వ్యాపారప్రపంచాన్ని సరైన అంచనా తో అందుకోగలిగే వ్యక్తులను గుర్తుచేసుకుంటే మనం వెళ్లే దరి స్పష్టంగా కనిపిస్తోస్తుందని. అంతేగానీ మడోన్నా ఎలా జీవించిందా జెస్సికా ఎలా బతికిందా వాళ్ళ పర్సనల్ జీవితాలు ఎవరిదైనా అనవసరం. ప్రపంచంలో టాప్ స్టార్ గా నిలబడాలంటే వాళ్ళు చేసిన కృషి మాత్రం తెలుసుకోవాలి. అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమన్ గా ఫోర్బ్స్ మ్యాగజైన్ ఆమెను ఒక ర్యాంక్ లో నిలబెట్టింది.

    ఫ్యాషన్ దేవత మడోన్నా

    క్వీన్ ఆఫ్ పాప్ గా పిలిచే మడోన్నా సంగీత రంగంలో సంచలనం ఈవిడ పాటల రికార్డ్స్ 300 మిలియన్లు అమ్ముడుపోయాయి. అత్యంత ప్రతిభావంతమైన మడోనా సంగీతకోవిదురాలు మహిళా…

  • టూత్ పేస్ట్ లు మౌత్ వాష్ లు చూయింగ్ గమ్స్ పెర్ఫ్యూమ్స్ వేటిలో చూసినా పుదీనా ఘుమఘుమలుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ వంటకాలతో ఈ హెర్బ్ వాడతారు. కూరల పొడులు, సలాడ్లు, బిర్యానీ లు , చట్నీలు ,జెల్లీలు ,క్యాండీలు ,ఐస్ క్రీమ్ లు కూడా పుదీనా విరివిగా ఉపయోగిస్తారు. వాటర్ మింటీ ,స్పియర్ మింట్ లీ కలిపి పెప్పర్, మింట్ సృష్టించారు. ఈ హైడ్రేటెడ్ పెప్పర్ మింట్ తో అనేక ప్రయోజనాలు. ఇది బ్రిత్ ఫ్రెష్నర్. నీళ్లలో ఒక్క చుక్క పెప్పర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని తాగితే అజీర్ణం ,వికారం , గ్యాస్ సమస్యలు నిమిషంలో పోతాయి. ఈ ఎసెన్షియల్ ఆయిల్ తో యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలుంటాయి. మూడ్ ను అనుకూలంగా మార్చే గుణం వుంది. ఎండిన పుదీనా ఆకుల పొడితో పళ్ళు తోమితే చక్కగా తెల్లగా మెరిసిపోతాయి. సాధారణ జలుబులు తగ్గిస్తుంది. పుదీనా ఆకుల్ని ఐస్ క్యూబ్స్ గా చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. లెమన్ టీ, లెమనేడ్ కోసం ఈ క్యూబ్స్ ని వాడుకోవచ్చు. ఘాటైన వసంతో మంచి ఫ్లేవర్ గల మింట్ లో ఔషధ గుణాల కోసం ఒక పుస్తకం రాయచ్చు. ఇన్ని వస్తువుల పుదీనాతో తయారై కార్పొరేట్ ప్రపంచంతో అమ్ముడుపోతున్నాయంటే పుదీనా ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవచ్చు. పుదీనా ఎస్సెన్షియల్ ఆయిల్ నుంచి తీసే మెంథాల్ ను కాస్మొటిక్స్ లో పెర్ఫ్యూమ్స్ వాడతారు.

    ప్రకృతి ఇచ్చిన వరం పుదీనా

    టూత్ పేస్ట్ లు మౌత్ వాష్ లు చూయింగ్ గమ్స్ పెర్ఫ్యూమ్స్ వేటిలో చూసినా  పుదీనా ఘుమఘుమలుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ వంటకాలతో ఈ హెర్బ్ వాడతారు.…