ఆఫ్రికా లోని మారిటానియా లో విడాకులు ఒక వేడుకగా పండగలా చేస్తారు.ఈ దేశం లోని మారి తెగ లోని మాతృస్వామ్య పద్ధతులే అందుకు కారణం ఇక్కడ ఒక వివాహిత ఎన్ని విడాకులైన తీసుకోవచ్చు.ఇక్కడ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఉంటుంది.విడాకులు తీసుకున్న ఆడవాళ్లు తమ సమన్లు ఇక్కడ అమ్మేస్తారు.పాత భారాన్ని వదులుకొని కొత్త జీవితానికి సిద్ధంగా ఉన్నామని దీనికి సంకేతం విడాకులు తీసుకున్న యువతులు తమ అభిరుచుల్లో ప్రావీణ్యాన్ని సంపాదించుకొనే ప్రయత్నం చేస్తారు.కొందరు పై చదువులు చదువుకొంటారు.పిల్లల సంరక్షణ తల్లికే.ఇంకో విశేషం, కొత్త పెళ్లి కొడుకులు,విడాకులు తీసుకున్న వనితలనే పెళ్లాడేందుకు ఆసక్తి చూపిస్తారు.సంసారంలో వాళ్ళ అనుభవం తో మంచి జీవితం ఉంటుందని నమ్ముతారట.













