కేరళ కు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బిస్మి విల్లు వన్యప్రాణి సంరక్షణ కోసం స్వయంగా కెమెరా పట్టుకున్నది.వృత్తిలో భాగంగా అరణ్యంలోకి వెళ్ళినప్పుడు,చెట్ల ఆకులు సీతాకోకచిలుకలు మొదలుకొని ఏనుగులు సాంబార్ డీర్ ఎలుగుబంట్లు, వాటి పైన దాడి చేయగలిగిన అడవి కుక్కలు ఇలా ఎన్నో వన్యప్రాణుల ఫోటోలు తీసి ఎన్నో జంతువుల డేటాను రికార్డ్ చేసింది. ఇవన్నీ భద్రపరచడం కోసం ఒక యాప్ ను సృష్టించింది. తిరువనంతపురంలోని పరస్సలకు చెందిన బిస్మి తీసిన ఫోటోలు ఏకంగా కేరళ అటవీశాఖ డేటా కోసం ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి.













