రోహిణి నీలేకని భారతీయ రచయిత్రి.త్రాగునీరు పిల్లలకు ఉచిత విద్య,పారిశుద్ధ్య సమస్యల పైన పనిచేసే అర్ఘ్యం ఫౌండేషన్ స్థాపించారు.అలాగే అక్షర ఫౌండేషన్ అధ్యక్షురాలు కూడా.లాభ పేక్ష లేని ఏక్ స్టెప్ సహ వ్యవస్థాపకురాలు.రోహిణి నీలేకని ఫిలాంత్రోపీస్ చైర్ పర్సన్.గత ఐదేళ్లుగా హరూన్ ఫిలాంత్రోపీ జాబితాలో చోటు దక్కించు కొంటున్నారు.ముంబాయ్ లో పుట్టిన రోహిణి ఫ్రెంచ్ లిటరేచర్ లో డిగ్రీ తీసుకొన్నారు.ప్రముఖ వార్తా పత్రికల్లో పని చేశారు ప్రభుత్వం తో,ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసిన రోహిణి సహజ వనరులు,పర్యావరణ సమతుల్యత కాపాడే అన్ని సాయిలు చేస్తున్నారు.













