ఫోటో జర్నలిస్ట్ గా ప్రింట్ మీడియా లో తన సత్తా చాటుకుంది హోమై వ్యారావాలా డాల్డా పేరుతో సుపరిచితురాలైన భారత దేశపు తొలి మహిళా ఫోటో జర్నలిస్ట్. 1938 లో బాంబే క్రానికల్ లో ఆమె తొలి ఉద్యోగం ప్రారంభించింది. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు ఆమె ముంబై లోని ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా లో పనిచేస్తుంది. గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి ప్రముఖ నాయకుల ఫోటోలు భారత దేశ చరిత్ర లోనే ముఖ్యమైన ఘట్టాలు ఆమె తన ఫోటోల్లో పదిలం చేశారు మహిళలు అన్నిచోట్ల ఆటోల్లో తిరగడం తప్పుగా భావించే రోజుల్లో మేడలో కెమెరాతో ఫోటోలు తీసే హోమై వ్యారావాలా అప్పటి సెన్సేషన్ స్వాతంత్రోద్యమ కాలం నాటి ఫొటోలు చాలావరకు ఈమె తీసినవే ఉన్నాయి.














