ఊర్వసి శారద కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ లో ఆ రాష్ట్ర సర్వోన్నత పురస్కారం జేసి డేనియల్ అవార్డు అందుకున్నారు డేనియల్ తొలి మలయాళ సినీ దర్శకుడు. 1965 నుంచి నటిస్తున్న శారద మలయాళ చిత్రాల్లో నటించారు. 125 చిత్రాల్లో నటించిన ఆమె తులాభారం 1968 చిత్రానికి మొదటి జాతీయ అవార్డు తీసుకున్నారు. నిమజ్జనం తెలుగు సినిమా లో మూడో జాతీయ అవార్డు తీసుకున్నారు తెలుగులో శారద బలిపీఠం, కార్తీకదీపం,న్యాయం కావాలి వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. కేరళ ప్రభుత్వం ఆమెకు డేనియల్ అవార్డు తో పాటు ఐదు లక్షల నగదు కూడా అందించింది.














