హోటల్ మేనేజ్మెంట్ చేసి పేస్ట్రీ షెఫ్ గా పనిచేస్తున్న కైనాజ్ మెస్మాన్ కిచెన్ లో జారిపడి వెన్నెముక దెబ్బ తగిలి నిలబడలేని స్థితి వచ్చింది.తల్లి తండ్రి అప్పటికే కెఫె కామ్ బేకరీ బిజినెస్ లో ఉన్నారు. కైనాజ్ తన చెల్లెలు టీనా మెస్మాన్ తో కలిసి ‘థియోబ్రోమా’ పేరుతో బ్రౌనీ లు, పేస్ట్రీ లు తయారు చేసే వ్యాపారం మొదలుపెట్టారు. టీనా చార్టెడ్ అకౌంటెంట్ ఈ పేస్ట్రీల రుచి అందరికీ నచ్చి, ఆ వ్యాపారం ఇవ్వాళా 225 ఫ్రాంచైజ్ లతో పాన్ ఇండియా పేస్ట్రీ గా మారిపోయింది. ఈ మధ్యనే తమ కంపెనీలో 90 శాతం వాటాను క్రిస్ కేపిటల్ కు 2410 కోట్ల రూపాయలకు అమ్మి వార్తలో నిలిచారు ఈ అక్కాచెల్లెళ్ళు.













