పసిపిల్లలకు వాడే ఎన్నో ఉత్పత్తులలో హానికరమైన రసాయనాలు ఉంటున్నాయంటున్నారు ఎక్సపర్ట్స్.పిల్లల దుస్తుల్లో వాడే రంగులు కూడా పిల్లలకు అలర్జీలు తెచ్చిపెడుతున్నాయి ప్లాస్టిక్ పాల సీసాలు,డైపర్లు,లోషన్లు, షాపుల్లో విషపూరితమైన రసాయనాలున్నాయి.ఘాటైన వాసన వచ్చే సబ్బులు ప్లాస్టిక్ పాల సీసాల వాడకం మానేయాలి.పిల్లలకు కొనే వస్తువుల పైనా పారా బెన్ ఫ్రీ సల్ఫేట్ ఫ్రీ బిబిఎ ఫ్రీ అని రాసిన వాటిని ఎంచుకోవాలి.వృక్ష ధారిత లోషన్లు చెక్క బొమ్మలే ఇవ్వాలి.కొత్త దుస్తులు,బొమ్మలు శుభ్రాంగా ఉతికి,కడిగిన తర్వాతనే పిల్లలకు వాడాలి.వస్త్రం తో తయారైన డైపర్లు వాడాలి.













