అందిన అవకాశాలన్నీ గుప్పిట్లోకి తీసుకొని జీవితాన్ని సార్థకం చేసుకొన్నా వాళ్లలో ప్రముఖ నర్తకి,సినీనటి ఎల్.విజయలక్ష్మి పేరు చెప్పుకోవచ్చు.వంద సినిమాల్లో నటించిన విజయలక్ష్మి పెళ్లి తర్వాత భర్త సురజిత్ దత్తా తో కలసి ఫిలిప్పీన్స్ లో అడుగు పెట్టక చదువు మొదలు పెట్టారు.సి.ఎ చదివి యూనివర్సిటీ పరిపాలన విభాగం లో బడ్జెట్ మేనేజర్ గా ఉద్యోగం లో చేరారు.తెలుగు తమిళం బెంగాలీ,స్పానిష్ ఆంగ్లం తదితర భాషలను అనర్గళంగా మాట్లాడగలరమే.ఆమె వయసు ఇప్పుడు 80 ఏళ్ళు స్వదేశం నృత్య శిక్షణాలయం స్థాపించాలని ఆమె ఆకాంక్ష,కంచుకోట చిత్రంలో సరిలేరు నీకెవ్వరు అంటూ నృత్యం చేసిన ఆమె జీవితం ఆమెకు ఎవ్వరు సరిపోవరు ఆమె జీవితం.













