మహిళా క్రికెట్ కు అంతగా ఆదరణ లేని రోజుల్లోనే క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకుని అమోఘమైన పోరాట స్ఫూర్తితో క్రీడల్లో ఎదురైన సవాళ్లను గెలిచి దేశంలో ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తి ఇచ్చింది మిథాలి రాజ్ తన నాయకత్వ ప్రతిభ తో మహిళల క్రికెట్ స్థాయిని పెంచింది. జాతీయ జట్టును నిర్మించటం కష్టమైన రోజుల్లోనే జట్టును ముందుకు నడిపించింది. 23 ఏళ్ల పాటు మిథాలి క్రికెట్ మైదానం లో బ్యాట్ తో గర్వంగా నిలిచింది. మహిళల క్రికెట్ లో ఒక సువర్ణాధ్యాయం లభించింది. కుటుంబం అండదండలు అభిమానుల ఆకాంక్షలే ఒక వరంగా తీసుకుని రాణించింది మిథాలీ దేశంలో క్రికెట్ క్రీడకు చిరునామా మిథాలి.













