తిరువనంతపురం దగ్గరలోనే అట్టుకల్ గ్రామంలో వెలసిన భగవతి అమ్మవారి వేడుకలు గిన్నిస్ బుక్ రికార్డు ల్లో నమోదయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలో 9వ రోజు మహిళలు అమ్మకు పొంగలి నైవేద్యం పెడతారు. ఈ కార్యక్రమాన్ని అట్టుకల్ పొంగల్ వేడుకగా పిలుస్తారు. ఈ వేడుకలో భాగంగా మహిళలు తిరువనంతపురంలోని మన కాడ ప్రాంతంలో ఉండే శ్రీధర్మశాస్త్ర ఆలయం వరకు భారీ ఊరేగింపు జరుపుతారు. 1997 లో ఈ పండుగలో 15 లక్షల మంది పాల్గొనడంతో తొలిసారి గిన్నిస్ బుక్ లో నమోదయింది. తరువాత 2009లో 25 లక్షల మంది మహిళలు తో ఇంకోసారి గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది.













