Tuesday, 22 Sep, 2026
శారీరిక ధారుడ్యాన్ని పరిశీలించుకునేందుకు 50 అధ్యయన నివేదికలను యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నాయకత్వాన ఒక నిపుణుల బృందం అధ్యయనం చేసి ఇచ్చిన సరికొత్త నివేదిక లో ఇప్పటి పిల్లల్లో శారీరిక సామర్ధ్యం తగ్గిపోతోంది. ఈ విశ్లేషణ ప్రకారం తిండి పుష్టి తగ్గిపోయింది. శారీరిక శ్రమ తగ్గింది . ఇళ్లల్లో వంట పాత్రల సైజు కూడా తగ్గింది. ఆరునుంచి 17 సంవత్సరాల మధ్య వయసుగల పిల్లలో తల్లితండ్రుల్లో ఉన్న ఫిట్ నెస్ కూడా లేకపోవటానికి కారణం ఎక్కువసేపు టీవీ చూడటం వీడియో గేమ్స్ శారీరిక శ్రమ ఎంత మాత్రం లేకపోవటం వ్యాయామాలు క్రీడలు ఏవీ లేకపోవటం వల్ల బరువుగా ఉండటం కారణాలంటున్నారు. 26 దేశాల నుంచి రెండు కోట్ల మంది పిలల్లపై ఈ అధ్యయనం జరిగింది. 5 నుంచి 15 నిమిషాల వ్యవధిలో ఈ పిలల్లు ఎంత దూరం పరిగెత్తుతారు? వారి వయసు తిండి వివరాలు పరిగెత్తే సమయంలో హృదయ స్పందన హృదయ నాళికలో పనిచేసే తీరు రికార్డు చేసారు. ఫిట్ నెస్ లో తల్లితండ్రుల కంటే 1. 5 శాతం తక్కువగా వున్నారని బాల బాలికల విషయం పెద్ద తేడా ఏమీ లేదని తేల్చారు. మానవ శక్తీ సామర్ధ్యాలకు సంబంధించి శాస్త్ర వెతలు ఎప్పటికప్పుడు నివేదికలు తయారుచేస్తూనే ఉంటారు.

పిల్లలకు ఆటలు తప్పనిసరి

చిన్న వయసులో వ్యాయామం ఎక్కువగా చేసే వాళ్ళలో పెద్దయ్యాక ఎముకల బలం బావుంటుందని దానితో ఆస్టియో పొరాసిస్ రాకుండా ఉంటుందని బ్రిస్టల్ విశ్వవిద్యాలయ నిపుణులు చెబుతున్నారు.పది పన్నెండేళ్ళ వయసు నుంచి మాట్లాడటం పరుగులు తీయటం చేసే వాళ్ళకి పాతిక సంవత్సరాలు వచ్చేసరికి ఎముకల్లో పటుత్వం పెరుగుతుంది. ఆటలు ఆడని వాళ్లలో ఎముకలు బలహీనంగా ఉన్నాయి. ఇందుకోసం 12 నుంచి 25 సంవత్సరాల వయసు వారిని ఎంపిక చేసి యాక్స్ లో మీటర్ల ద్వారా వారి శరీర కదలికలను గుర్తిస్తూ వస్తే యుక్తవయసులో కన్నా కౌమార దశలో శారీరక వ్యాయామం చేసే వాళ్లలో ఎముకలు దృఢంగా ఉన్నాయట.

Leave a Reply