రచయిత్రి, డాక్టర్, ఆర్టిస్ట్ అవ్వాలని ఎన్నో రకాల కలలతో ఉండే ప్రియాంక ఖీమాని లాయర్ అయిపోయింది. సొంతంగా లా ఫర్మ్ నెలకొల్పి బాలీవుడ్ సెలబ్రిటీ కేసులతో తీరిక లేకుండా అయిపోయారు. డిగ్రీ లో బయోటెక్నాలజీ తీసుకొని రైటర్ గా ఎన్నో స్క్రిప్ట్ లో రాసిన ప్రియాంక 2012 లో లా పూర్తి చేసి పూర్తిస్థాయి లాయర్ గా జీవితాన్ని తనే ఒక మలుపు తిప్పుకున్నారు. లతా మంగేష్కర్, సోను నిగమ్, అనురాగ్ కశ్యప్ మొదలైన బాలీవుడ్ ప్రముఖుల కేసులు వాదించారు.2014లో ఖీమాని అండ్ అసోసియేట్స్ ను ప్రారంభించారు. ఎన్నో కేసులు విజయవంతంగా వాదించి గెలుస్తూనే సంగీతం పట్ల ప్రేమతో ఉమెన్ ఆఫ్ మ్యూజిక్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ కూడా స్థాపించారు.













