ప్రపంచంలోనే ఎత్తయిన చీనాబ్ రైల్వే వంతెన ప్రాజెక్ట్ లో జియో టెక్నికల్ అసిస్టెంట్ గా ఉన్నారు ప్రొఫెసర్ మాధవి లత. కాశ్మీర్ లోయను మిగతా ప్రాంతంతో అనుసంధానిస్తున్న ఈ వంతెన నిర్మాణం లో ఆమెదే కీలకపాత్ర. ప్రకాశం జిల్లాలోని ఏడు గుండ్లపాడు గ్రామంలో జన్మించిన మాధవి లత మద్రాస్ ఐ ఐ టి నుంచి పి హెచ్ డి చేశారు సస్టైనబుల్ సాయిల్ ది ఇన్ ఫోర్స్ మెంట్ జియో మెకానిక్స్ రాక్ ఇంజనీరింగ్ లో పరిశోధనలు చేశారు.సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆమె మొదటి మహిళా అధ్యాపకురాలు మహిళలకు ఇంజనీరింగ్ రంగంలో పెద్దగా ప్రోత్సాహం లేని రోజుల్లో ఆమె ఎంతో పనిచేశారు.













