• వెనిగర్ పేరు చాలా సార్లు వినబడుతూ ఉంటుంది. దీన్ని అనేక పదార్ధాల తయారీలో ఉపయోగిస్తారు. ఎన్నో ప్రయోజనాలుంటాయి కూడా. ఈ పల్చని ద్రవంలో సౌందర్య ఆరోగ్య గృహ ప్రయాజనాలున్నాయి. తెల్లని డిస్టిల్ట్ వెనిగర్ తో వారంలో కనీసం రెండు సార్లు పళ్ళు తోముకుంటే పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి. నోటి దుర్వాసన పోతుంది. ఒక బకెట్ నీళ్లలో అరకప్పు వెనిగర్ కలిపి స్పాంజ్లు పాత్రలు టోమ్ బ్రష్ లు రాత్రంతా నాననిస్తే క్రీములు మురికి పోతాయి. వాషింగ్ మిషన్ లో చివరి వాష్ సైకిల్ లో అరకప్పు వైట్ వెనిగర్ కలిపితే దుస్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి . నెయిల్ పాలిష్ వేసేముందర వెనిగర్ లో ముంచిన కాటన్ తో గోళ్లు తుడిస్తే చాలా రోజులు పాలిష్ చెక్కుచెదరదు. తలపులు కిటికీలు మూలల్లో వైట్ వెనిగర్ చల్లితే చీమలు రావు.

    వెనిగర్ తో సౌందర్య ఆరోగ్య ప్రయోజనాలు

    వెనిగర్ పేరు చాలా సార్లు వినబడుతూ ఉంటుంది. దీన్ని అనేక పదార్ధాల తయారీలో ఉపయోగిస్తారు. ఎన్నో ప్రయోజనాలుంటాయి కూడా. ఈ పల్చని ద్రవంలో సౌందర్య ఆరోగ్య గృహ…

  • పిల్లలు, పిల్లల దాకా ఎందులో యూత్ నోట్లో ఎప్పుడు నలిగేది చూయింగ్ గమ్. వాళ్ళు నమిలేటప్పుడు దాని రుచి సంగతి ఎలా వున్నా అది ఏ డ్రెస్ కైనా అంటితే మాత్రం ఒక పట్టాన వదలదు. ఏ వాషింగ్ కు ఇస్తామన్న దాన్ని చూడ కుండా ఇస్త్రీ చేస్తారేమో అనిపిస్తుంది. కొన్ని చిట్కాలున్నాయి. ఇలా చేస్తే చూయింగ్ గమ్ వుడి వచ్చేస్తుంది. చూయింగ్ గమ్ అంటుకున్న డ్రెస్ ని జిప్ బాగ్ లో పెట్టి డి ఫ్రిజ్ లో ఉంచితే దాన్ని బట్టు ఐస్ గడ్డ కడుతుంది. చూయింగ్ గమ్ అప్పుడు పొడిగా అయిపోతుంది. ఐస్ ముక్క తో కలిపి గట్టిగ లాగితే వుడి వస్తుంది. బాగా మరిగించిన వెనిగర్ లో ఈ గమ్ అంటుకున్నా వస్త్రాన్ని ముంచితే గం వుడి వస్తుంది. గమ్ అంటుకున్న వస్త్రం కింద ఒక పాత వస్త్రం పెట్టి ఇస్త్రీ చేస్తే ఆ గమ్ కింద వున్న పాత బట్ట కి అతుక్కు పోతుంది. హెయిర్ డ్రయ్యర్ తో గమ్ వున్న ప్రాంతం లో వేడి గాలి పెట్టి, అది వేడెక్క గానే చాకు తో తీసేస్తే గమ్ వుడి వస్తుంది.

    ఇలా చేస్తే గమ్ వుడి పోతుంది

    పిల్లలు, పిల్లల దాకా ఎందులో యూత్ నోట్లో ఎప్పుడు నలిగేది చూయింగ్ గమ్. వాళ్ళు నమిలేటప్పుడు దాని రుచి సంగతి ఎలా వున్నా అది ఏ డ్రెస్…