• ఇటు ముఖ సౌందర్యం శిరోజాల రక్షణ కోసం చర్మం ఆరోగ్యంగా ఉండటంకోసం ఎప్పుడూ తేనె నిమ్మ కాంబినేషన్ ప్రస్తావన వస్తుంది తేనే నిమ్మలతో ఉన్నటువంటి యాంటీ బ్యాక్తీరియాల్ యాన్తి ఆక్సిడెంట్ లక్షణాల వల్ల ఇవి ప్రకృతి సిద్ధంగా చర్మ రక్షణ కు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి . శరీరం బరువు పై అదుపు విషయంలో తేనెలో ఫ్రక్టోజ్ వుంటుంది. యాడ్ ప్రకృతి సిద్ధంగా దొరికే పండ్ల చక్కెర నిమ్మరసం కడుపు నిండేట్లుగా చేస్తుంది. ఉదరం లోపల ఆల్కలైన్ వాతావరణాన్ని నిమ్మ ఎక్కువ జెసి బరువు తగ్గేందుకు సాయపడుతుంది. నిమ్మరసం తేనె సమాన భాగాలుగా చేసి ఆ మిశ్రమ మొహం పై రాసుకుంటే చర్మం రంగొస్తుంది. తేనె నిమ్మ పైనాపిల్ తో ముఖం పై ఉండే మొటిమలు మచ్చలు తొలిగిపోతాయి. నిమ్మ చెక్క పైన తేనె వేసి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రుద్దితే అవిపోతాయి. నిమ్మ తేనెల్లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ వయసుతో పాటు శరీరంలో మార్పులను ఆలస్యం చేస్తాయి. తేనె లో అధికంగా ఉండే చెక్కర వల్ల మైక్రోబ్స్ పోతాయి. నిమ్మలో ఉన్న ఆమ్లాల వల్ల బ్యాక్తీరియా వృద్ధి చెందదు.

    ఇవి ప్రకృతి ప్రసాదాలు

    ఇటు ముఖ సౌందర్యం శిరోజాల రక్షణ కోసం చర్మం ఆరోగ్యంగా ఉండటంకోసం ఎప్పుడూ తేనె  నిమ్మ కాంబినేషన్ ప్రస్తావన వస్తుంది తేనే నిమ్మలతో ఉన్నటువంటి యాంటీ బ్యాక్తీరియాల్…

  • నెమ్మదిగా విండో షాపింగ్ తో నడక మొదలుపెట్టండి తర్వాత గబగబా నడవటం అదే అలవాటవుతుంది అంటారు నిపుణులు. కొద్దిపాటి ప్రాక్టీస్ తో ప్రతి అడుగులో ఎంతో కొంత ఫలితాన్ని చూపిస్తుంది. స్పీడ్ వాక్ జాగింగ్ కంటే కూడా స్పీడ్ వాకింగ్ జాయింట్ల పై సులువుగా ఉంటుంది. జాగింగ్ కంటే సగం ఫోర్స్ చాలు స్పీడ్ గా నడిచేందుకు చక్కని వాకింగ్ షూ తో నడకను కొవ్వు కరిగించేదిగా కండరాలను టోనింగ్ చేసేదిగా మలుచుకోవాలి. చిన్న అడుగులు పెద్దవాటికంటే సమర్ధవంతంగా తక్కువ అలసటగా ఉంటాయి. సరైన పోశ్చర్ చాలా అవసరం. చుబుకం పైకెత్తి తిన్నగా ముందుకు చూస్తూ నడవాలి. ముందుకి వెనక్కి చేతులు బాగా కదిలిస్తూ నడవాలి. ఇలా చేతులు ఊపటం ద్వారా క్యాలరీలు ఖర్చవుతాయి. పై భాగం శక్తి పెరుగుతుంది. వేళ్ళ వాపులు కావు. ఉదర కండరాలు సరైన పొజిషన్ లో వుంటాయి. కాళ్ళ కండరాలకు నడక ఇంజన్ వంటిది. నడిచేటప్పుడు కండరాలు బిగించేలా నడవాలి. నడక వేగంగా కొనసాగించలేకపోతే మధ్యల;ఓ ఇంటెర్వెల్స్ తీసుకుంటూ ఉండచ్చు. త్వరగా సాగటానికి ఫిట్నెస్ కు ఇదే ఉపయోగం. క్యాలరీలు భారీగా ఖర్చు చేసే అవకాశం ఉన్న ఈ స్పీడ్ వాక్ తో శరీరం లోకోవ్వూ శుభ్రంగా కరిగిపోతుంది. నడక ఆరంభించి సూచనలు అనుసరిస్తూ వీలైనంత వేగం పెంచుకుపోతే ఏ అడుగుల సవ్వడి తగ్గే బరువుతో పెరిగే ఫిట్ నెస్ కనబడుతుంది.

    ఇది పవర్ వాక్

    నెమ్మదిగా విండో షాపింగ్ తో నడక మొదలుపెట్టండి తర్వాత గబగబా నడవటం అదే అలవాటవుతుంది అంటారు నిపుణులు. కొద్దిపాటి ప్రాక్టీస్ తో ప్రతి అడుగులో ఎంతో కొంత…

  • అన్నంలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరుగుతాం అనుకుంటాం గాని బరువు పెరిగేది కార్భోహైడ్రెట్ల వల్ల కాదు. శరీరంలో అదనంగా పెరుకుపోయే క్యాలరీల వల్ల శక్తినిచ్చేది పిండిపదార్థాలే.మెదడు,కండరాలు,కణాలు ఆరోగ్యం బావుండాలంటే అది పిండిపదార్థాల వల్లే సాధ్యం. చైనా,జపాన్,ఫిలిప్పీన్స్ దేశాల ప్రధాన ఆహరం అన్నమే. కాని ప్రపంచ సూచీ ప్రకారం వారిలో ఉబక కాయులు తక్కువే. అన్నంలో ఉండే గంజి పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా నిరోదిస్తుంది. పాలీష్ పట్టని బియ్యం లో పీచు పదార్దములు అధికంగా ఉండి మలబద్దకాన్ని నిరోదిస్తాయి. వంద గ్రాముల అన్నంలో 345 క్యాలరీలు ,78.2 గ్రాముల పిండిపదర్ధాలు, 6.5 గ్రాముల మాంస కృత్తులు, 0.2 పీచు ,0.5 పాస్పరస్ 160 గ్రాముల ఐరన్ 0.7 10 క్యాల్షియం ఉంటాయి. ఈ ప్రపంచంలో బలవర్ధకమైన ఆహారం అన్నమే.

    ఆరోగ్యానికి అన్నమే మిన్న…

    అన్నంలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరుగుతాం అనుకుంటాం గాని బరువు పెరిగేది కార్భోహైడ్రెట్ల వల్ల కాదు. శరీరంలో అదనంగా పెరుకుపోయే క్యాలరీల వల్ల శక్తినిచ్చేది…