• కైరో నగరంలో 93 శాతం మంది అమ్మాయిలు తమకు రక్షణ లేదనే చెపుతున్నారు. ఈ నేపథ్యంలో మహ్మద్ తాహర్ అనే ఫోటో గ్రాఫిక్ బ్యాలేరినాప్ ఆఫ్ కైరో ప్రాజెక్ట్స్ ని చేపట్టాడు. ఈ నగరంలోని ప్రధాన వీధుల్లో బాలే నృత్య కళాకారిణుల చేత నాట్యం చేయించి వాళ్ళ ఫోటోలు తీసి ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు . ఏ ఈఫోటోలో అందరి ఆదరణ పొందాయి. మంచుకురిసే వేళ వెచ్చని తెల్లని మెరిసే ఎండ ఎడారిలో నీటిచలమలు నగరంలో ఆకాశం అంటే అందమైన భవనాలు మధ్యలో చక్కని ఉద్యాన వనాలు. ఇంత అందమైన కైరో వీధుల్లో అమ్మాయిలు నృత్యం చేస్తుంది అసలా వాతావరణం ఉన్నా లేకున్నా మనకు అవే స్ఫురిస్తాయి. రక్తపాతం మధ్యనే చటుక్కున ఎగిరే పావురాలు గుర్తొస్తాయి. ఈ అమ్మయిలను చుస్తే. ఇందులోని ప్రతిఫాతో స్త్రీలోని స్వేచ్ఛ కేంద్రం ప్రతిబింబిస్తోంది. అందుకే ఈజిప్ట్ లోని అందరి ఆదరణ పొందాయి . సామజిక మాధ్యమాల్లో పత్రికల్లో వైరల్ గా మారాయి. వీటి స్పూర్తితో అప్పటిదాకా బయటకురాని మాములు అమ్మాయిలు కూడా తమ ఫోటోలకు ఇన్ స్టాగ్రామ్ లో పంచుకోవటం మొదలుపెట్టారు .

    ఎగిరే తెల్లని పావురాల్లా కైరో యువతులు

    కైరో నగరంలో 93 శాతం మంది అమ్మాయిలు తమకు రక్షణ లేదనే చెపుతున్నారు. ఈ నేపథ్యంలో మహ్మద్ తాహర్  అనే ఫోటో గ్రాఫిక్ బ్యాలేరినాప్ ఆఫ్ కైరో…

  • ఏడడుగులబంధం కోసం ఆచితూచి అడుగులేస్తున్నారు అమ్మాయిలు. తన చేయి పట్టుకుని జీవితాంతం తోడుగా నిలబడే వ్యక్తి వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారని విద్యావంతులైన మగవాళ్లనే పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారని ఒక మ్యారేజ్ వెబ్సైట్ సర్వేలో తేలింది. ఇందులో 6000 మంది వినియోగదారులు అభిప్రాయాలూ తీసుకున్నారు. ఆడపిల్లల అభిప్రాయాలను తీసుకుంటే ప్రతి ఇద్దరు ఆడపిల్లల్లో ఒకళ్ళు ఉమ్మడి కుటుంబాలకు చెందిన మగవాళ్ళని పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారు. 60 శాతం మంది అమ్మాయిలకు కులం గురించి పట్టింపే లేదు. ప్రతి పదిమంది ఆడపిల్లల్లో ఆరుగురు యువతులు చూడచక్కని వాళ్ళని ఎంచుకోకుండా వాళ్లే ప్రొఫైల్స్ చూస్తున్నారు. 40 శాతం మంది అమ్మాయిలు వాళ్ళ జీవిత భాగస్వాములను వాళ్లే ఎన్నుకుంటున్నారు. తమ గురించి చెప్పటంలో ఎదుటివాళ్ళ గురించి తెలుసుకోవడంలో అమ్మాయిలే మాట కలుపుతున్నారు. ముఖ్యమైన మాట 85 శాతం మహిళలు కనీసం బ్యాచిలర్ డిగ్రీ అన్నా ఉంటే తప్ప డబ్బు రూపం వున్నా వద్దులే అంటున్నారు.

    విద్యావంతులైతేనే సరే అంటున్నారు

    ఏడడుగులబంధం కోసం ఆచితూచి  అడుగులేస్తున్నారు అమ్మాయిలు. తన చేయి పట్టుకుని జీవితాంతం తోడుగా నిలబడే వ్యక్తి వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారని విద్యావంతులైన మగవాళ్లనే పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారని ఒక…