• బ్లీచింగ్ చేస్తే మొహం పైన మరకలు, మురికి పోతుంది కానీ అసలు బ్లీచింగ్ ప్రాబ్లం మొహం పొడిబరుతుంది. మరి కళ్ళ కింద నల్లని వలయాలు ఎలా పోవాలి అంటే ఇంట్లో వుండే వస్తువుల తో తేలిక అని చెప్ప వచ్చు. టొమాటో లో బ్లీచింగ్ గుణం వుంది. ఒకటిన్నర టీ స్పూన్ నిమ్మరసంలో ఒక టీ స్పూన్ టొమాటో రసాన్ని కలిపి కాళ్ళకింద నల్లని వలయాల పైన రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీళ్ళతో కడిగేసుకోవాలి. బంగాళ దుంప తరిగి జ్యూస్ పిండి కాటన్ ప్యాడ్స్ తో ముంచి కళ్ళ పైన పెట్టుకుంటే కళ్ళకింద చరల తో పాటు కళ్ళ వాపు కూడా పోతుంది. రోజ్ వాటర్ లో కాటన్ ప్యాడ్స్ నాన నిచ్చి, వాటిని కనురెప్పల పైన 15 నిమిషాలుంచితే కళ్ళ కింద వలయాలు పోతాయి. ఇలా రోజు రెండు మూడు వారాల పాటు చేస్తే కళ్ళ కింద చారలు కళ్ళ అలసట మాయం అవ్వుతాయి.

    నల్లని వలయాలు మాయం

    బ్లీచింగ్ చేస్తే మొహం పైన మరకలు, మురికి పోతుంది కానీ అసలు బ్లీచింగ్ ప్రాబ్లం మొహం పొడిబరుతుంది. మరి కళ్ళ కింద నల్లని వలయాలు ఎలా పోవాలి…

  • ఫేషియల్ చేయించుకొంటేనే ముఖం మెరుస్తుంది అనుకోవచ్చు. ముల్తానీ మట్టి వాడినా మొహం మెరవడమే కాదు, కొన్ని రకాల చర్మ సమస్యలు పోతాయి. రెండు చెంచాల గులాబీ నీళ్ళు కలిపి మెత్తగా చేయాలి. దాన్ని ముఖానికి రాసి పావు గంట తర్వాత కడిగేయాలి. ఈ పూత మొహం పై జిడ్డును తొలగించుతుంది. రెండు మూడు బాదాం గింజలు నానబెట్టి మెత్తగా చేసి అందులో పాలు కలిపి దీన్ని ముల్తానీ మట్టిలో మెత్తగా పేస్టులాగా అయ్యేలాగా కలిపేసి ఫేస్ ప్యాక్ వేసుకొంటే చర్మం మృదువుగా మారుతుంది. టొమాటో గుజ్జు, ముల్తనీ మట్టి, గంధం,పసుపు సమపాళల్లో తీసుకుని ముఖానికి పట్టించి గోరువెచ్చని వేడి నీళ్ళతో కడిగేయాలి. రెండు రోజులకోసారి ఈ ప్యాక్ వేస్తె ముఖం పైన మచ్చలు, మరకలు అన్నీ పోతాయి. అలాగే ముల్తాని మట్,టి పుదినా పొడి, పెరుగు మిశ్రమం కూడా ముఖం మెరిసేలాగా చేస్తుంది. ఇవన్నీ సహజమైనవి. ఏ రసాయినాలు కలవవని ముఖానికి మంచి రంగు, కళ తెచ్చి పెడతాయి.

    చర్మం తేటగా మృదువుగా మెరవాలంటే

    ఫేషియల్ చేయించుకొంటేనే ముఖం మెరుస్తుంది అనుకోవచ్చు. ముల్తానీ మట్టి వాడినా మొహం మెరవడమే కాదు, కొన్ని రకాల చర్మ సమస్యలు పోతాయి. రెండు చెంచాల గులాబీ నీళ్ళు…

  • ఎండ, గాలి, దుమ్ము ముఖచర్మం పైన ఎంతో ప్రభావం చూపెడతాయి. ఈ కాలంలో మురికి దుమ్ము ధూళి చర్మం పైన పేరుకు పోతాయి. అవి వెంటనే క్లీన్ చేయక పొతే చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. బొప్పాయిలో వుండే ఎంజైమ్స్ ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. రెండు చెంచాల గుజ్జు లో కొద్దిగా ఆలివ్ నూనె, చెక్కర కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకోని కడిగేస్తే ముఖం పై పేరుకున్న మురికి పోతాయి చెక్కని మెరుపు వస్తుంది. కొబ్బరి నూనెలో కొంచ చెక్కర , అర చెంచా ఆలివ్ నూనె కలిపి ముఖానికి, మెడకి మర్దనా చేసుకోవాలి. తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది. పావు కప్పు ఓట్స్ పొడిలో పెరుగు, పసుపు, గులాబీ నీళ్ళు కలిపి ఈ మిశ్రమంతో మొహం మర్దనా చేస్తే మృత కణాలు పోతాయి. రెండు చెంచాల కాఫీ పొడి లో బాదాం నూనె, కొబ్బరి నూనె కలిపి పూతలా వెయ్యాలి. తడి చేతుల్లో మర్దనా చేస్తే చల్లని నీళ్ళతో మొహం కడిగేసుకోవాలి. కాఫీ పొడి నిర్జీవంగా మారిన చర్మానికి జీవం ఇస్తే బాదాం నూనె తెమ అందిస్తుంది. బియ్యం పిండి, తేనె కలిపిన మిశ్రమంతో మాస్క్ వేసుకుని కడిగేసాక, మాయిశ్చురైజర్ రాస్తే చర్మం చాలా మృదువుగా కనిపిస్తుంది.

    ఇవన్నీ మంచి ఫేస్ ప్యాక్ లు

    ఎండ, గాలి, దుమ్ము ముఖచర్మం పైన ఎంతో ప్రభావం చూపెడతాయి. ఈ కాలంలో మురికి దుమ్ము ధూళి చర్మం పైన పేరుకు పోతాయి. అవి వెంటనే క్లీన్…

  • పచ్చడి, మురబ్బా, క్యాండీ పలు రూపాల్లో తీసుకున్నా ఉసిరి చేసే మేలు ఇంకే పండు చేయదు అనుకోవచ్చు. విటమిన్-సి నిల్వలు పుష్కలంగా వున్న ఉసిరి కాయ నేరుగా తినేసినా మంచిదే. డై ఆమ్లా క్యాండీలు వున్నాయి. గొంతు మంట జలుబు వుంటే రెండు టీ స్పూన్ల ఉసిరి పొడి, 2 టీ స్పూన్ల తేనె కలిపి తీసుకుంటే తగ్గిపోతుంది. పరగడుపున ఉసిరి రసం పుక్కిలి పడితే నోట్లోనుంచి వచ్చే పండ్ల నుంచి ఉపసమనం. ఆర్రైటిస్ వంటి కీళ్ళనొప్పుల నివారణకు ఉసిరి మంచిదే. బరువు తగ్గడం, జీర్ణ శక్తి పెంచడం ఉసిరి వల్ల సాధ్యం. దీని లో వుండే ఔషద గుణాల వల్ల ఇది సహజ స్థిరమైన కండీషనర్. ఉసిరి నూనె రెగ్యులర్ గా వాడితే జుట్టు తెల్ల బడటం తగ్గిస్తుంది. ఆరోగ్యవంతమైన కేశ సంపదను అందిస్తుంది. జుట్టు కుదుళ్ళకు బలాన్ని ఇస్తుంది. ఉసిరిని ఆహారంలో తీసుకుంటే చర్మానికి మంచి రంగోస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. బ్లడ్ షుగర్ అదుపులో వుంటుంది.

    కేశ రక్షణకు ఉసిరి

    పచ్చడి, మురబ్బా, క్యాండీ పలు రూపాల్లో తీసుకున్నా ఉసిరి చేసే మేలు ఇంకే పండు చేయదు అనుకోవచ్చు. విటమిన్-సి నిల్వలు పుష్కలంగా వున్న ఉసిరి కాయ నేరుగా…

  • మొటిమలు చుస్తే అమ్మాయిలకు కంగారే. అవి ఒక్క పట్టాన తగ్గవు. తగ్గినా మచ్చలు కనిపిస్తాయి. ఇందుకు రాసాయినాలు వుండే క్రిములు రాయొద్దు. ఇంట్లో వుండే వస్తువులే ఈ మొటిమలు రాకుండా కాపాడుతాయి అంటున్నారు. బాగా పండిన బొప్పాయిలో చెక్కెర, పెరుగు కలిపి ముఖానికి రాసి మర్దనా చేస్తే మొటిమలు తగ్గుతాయి. నారింజ తొక్కల పొడి లో పలు కలిపి ముద్దలా చేసి ముఖానికి రాసి ఆరె దాకా వుంచి కడిగేస్తే మొటిమలు తగ్గడమే కాకుండా మొహం కొత్త మెరుపు తో వుంటుంది. రెండు చెంచాల తేనె, ససిన్ని పాలు, దాల్చిన చెక్క పొడి కలుపుకోవాలి దీన్నీ ఫేస్ మాస్క్ లా వేసి ఆరాక కడిగేయాలి. ఈ మాస్క్ రోజు మర్చి రోజు వేసుకుంటే మొటిమలు తగ్గడమే కాదు మచ్చలు పోతాయి. అరటి పండు పై తొక్కలలో ల్యుటిన్ అనే ఎంజైమ్ వుంటుంది. ఇది కొత్త కణాల అభివృద్ధి కి సహాయపడుతుంది. ముఖం పైన వలయాకారంలో అరటి తొక్కతో రుద్దితే ఫలితం వుంటుంది. చర్మం కూడా తాజాగా వుంటుంది.

    ఇంటి చిట్కాల తో ఈ సమస్యలు మాయం

    మొటిమలు చుస్తే అమ్మాయిలకు కంగారే. అవి ఒక్క పట్టాన తగ్గవు. తగ్గినా మచ్చలు కనిపిస్తాయి. ఇందుకు రాసాయినాలు వుండే క్రిములు రాయొద్దు. ఇంట్లో వుండే వస్తువులే ఈ…

  • వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి . 30 ఏళ్ళు వచ్చేసరికి పెదాల ష్రిమ్కింగ్ మొదలవుతుంది. ఎదిగే కొద్దీ కొలాజెన్ ఉత్పత్తి తక్కువవుతుంది. కొలాజెన్ వల్లనే పెదవులు తేమతో నిగనిగలాడతాయి. సూర్య కిరణాలు కూడా కొలాజెన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. అంచేత ఎండలోకి వెళ్లేప్పుడు సన్ స్క్రీన్ లోషన్ పెదవులకు కూడా రాసుకోవాలి. పాతిక సంవత్సరాల వయస్సులో మూత్రాశయంలో ద్రవాన్ని ఎంతసేపైనా ఆపి ఉంచుకునే శక్తి ఉంటుంది. 65 సంవత్సరాలు వస్తే మూత్రాశయం ఆ శక్తి పోగొట్టుకుంటుంది . అంచేత బ్లాడర్ నియంత్రణను మెరుగు పరుచుకునేందుకు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్ సైజులు సహకరిస్తాయి కనుక ముందునుంచే ఏ ఎక్సర్ సైజులు ప్రారంభించాలి . అలాగే వయసు తో పాటే సాగిపోయే చర్మం విషయంలో దెబ్బతినే పలువరస విషయంలో శ్రద్ధ తీసుకుని తీరాలి . రాబోయే వార్ధక్యాన్ని ఆపలేకపోవచ్చు . కానీ ఆరోగ్యంగా ఉంచుకునే పద్ధతులను విస్మరించవద్దు.

    వయస్సు తెచ్చే మార్పులు

    వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి . 30 ఏళ్ళు వచ్చేసరికి పెదాల  ష్రిమ్కింగ్  మొదలవుతుంది. ఎదిగే కొద్దీ కొలాజెన్ ఉత్పత్తి తక్కువవుతుంది. కొలాజెన్…

  • దాదాపుగా అందరి దినచర్య కాఫీ తోనే మొదలవుతుంది. కానీ కాఫీ మనల్ని చురుగ్గా ఉంచటమే కాదు ,ముఖ సౌందర్యానికీ ఎంతో ఉపయోగపడుతుందంటారు సౌందర్య నిపుణులు. పొడిచర్మం ఉన్నవాళ్లు కాఫీ డికాషన్ లో ఆలీవ్ నూనె కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే చర్మం సహజమైన మెరుపుతో తేమతో ప్రకాశిస్తూ ఉంటుంది . చెంచా ఓట్ మీల్ పొడి కొంచెం కాఫీ పొడి తేనే కలిపి ముఖం మర్దనా చేస్తే మృత కణాలు పోతాయి. కాఫీ పొడిలో తేనే పసుపు కలిపి రాసుకుని ఓ అరగంట తర్వాత కడిగేస్తే చర్మం శుభ్రంగా కనిపిస్తుంది. పాలు కాఫీ పొడి నెయ్యి కలిపి పూతలా వేసి కాస్సేపటికి కాటన్ తో ఆ పూతను తుడిచేస్తే ముఖం పైన మురికి మృతకణాలు పోయి బావుంటుంది . కాఫీ పొడి నిమ్మరసం కలిపి పూతలా వేసుకుంటే చర్మం ముడతలు లేకుండా ఉంటుంది . ఇది ప్రతి రోజు అన్ని చర్మ తత్వాలున్నవాళ్ళు ట్రై చేయచ్చు. ఇక కాఫీ పొడి మెత్తగా దంచిన దాల్చిన చెక్క పొడి పాలు తేనె కలిపి మెత్తని పేస్ట్ లా చేసి ఫేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు. వారానికి రెండుసార్లు ఈ ఫేస్ ప్యాక్ వేస్తె చర్మం కళగా ఉంటుంది.

    సొగసైన చర్మానికి ఫెస్ ప్యాక్

    దాదాపుగా అందరి దినచర్య కాఫీ తోనే మొదలవుతుంది. కానీ కాఫీ మనల్ని చురుగ్గా ఉంచటమే కాదు ,ముఖ సౌందర్యానికీ ఎంతో ఉపయోగపడుతుందంటారు  సౌందర్య నిపుణులు. పొడిచర్మం ఉన్నవాళ్లు…

  • ఎండ వేడికి మొహం కమిలితే

    ఎండా పెరిగితే చాలు ఆ ప్రభావం తో ముఖం నల్లగా అయిపోతుంది. ఇంట్లో దొరికే వస్తువులే రసాయన ఉత్పత్తుల కంటే బాగా పనిచేస్తాయి. ఎండలో తిరిగొచ్చాక ఒక…

  • డెస్క్ వర్క్ చేసినప్పుడు అస్తమానం మోచేతులు టేబుల్ కి ఆనించటం వల అక్కడంతా నల్లగా అయిపోతుంది. ఈ మోచేతుల నలుపు వదిలించటం కాస్త కష్టమే. కానీ రెగ్యులర్ గా ఈ ఇంటి చిట్కాలు ఉపయోగించి ఆ నలుపు పోగొట్టచ్చు. సెనగపిండి పెరుగు కలిపి ప్రతిరోజు స్నానం చేసే ముందర మోచేతులకు పట్టించి కాసెప్పాయాక కడిగేస్తే ఆ నలుపు నెమ్మదిగా తగ్గిచర్మంలో కలిసిపోతుంది . అలాగే దోసకాయ బొప్పాయి గుజ్జుగా చేసి రాసినా సరే. ఒక టేబుల్ స్పున్ గంధంలో రెండు స్పూన్ల తేనే వేసి పేస్టులా కలపాలి . దాన్ని ఆరిపోయే దాకా మోచేతులు రాసి వదిలేసి తర్వాత కడిగేస్తే ఫలితం బావుంటుంది. ఈ మిశ్రమం మోచేతులు రాసి కనీసం అరగంట ఉంచుకోవాలి . పంచదార ఆలివ్ ఆయిల్ పేస్ట్ లా చేసి ఆ మిశ్రమం తో నలుపు ఉన్న భాగంలో మస్సాజ్ చేస్తే ఫలితం ఉంటుంది. ఏ చిట్కాలు ప్రతి రోజు చేస్తే ,మంచి ఫలితం ఉంటుంది. నలుపు తప్పకుండా పోతుంది.

    మోచేతుల నలుపు సులువుగా పోతుంది

    డెస్క్ వర్క్ చేసినప్పుడు అస్తమానం మోచేతులు టేబుల్ కి ఆనించటం వల  అక్కడంతా నల్లగా అయిపోతుంది. ఈ మోచేతుల నలుపు వదిలించటం కాస్త కష్టమే. కానీ రెగ్యులర్…

  • వాతావరణంలో మార్పులకు ఎక్కువగా స్పందించేది చర్మమే . నెమ్మదిగా చలి తగ్గి మొహం పడుతోంది. చర్మం పేలవంతంగా అయిపోతుంది. క్యారెట్ చిన్న బీట్ రూట్ టమాటో కలిపి పేస్ట్ లాగా చేసి దీనికి పెరుగు కలిపి ఈ మిశ్రమం మొహానికీ మెదడు అప్లయ్ చేయాలి. అరగంట తర్వాత కడిగేస్తే ఖరీదైన మాస్క్ వేసుకున్నంత మెరుపుతో ఉంటుంది మొహం. పెరుగు పసుపు మిశ్రమం కూడా చాలా పనిచేస్తుంది. పాలలో మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి ముఖ్నైకి మాస్క్ లా వేసుకోవాలి. వేడి నీళ్లతో కడిగేస్తే మొహం మెరుపుగా ఉంటుంది. జీడిపప్పు పచ్చి పాలతో కలిపి మెత్తగా పేస్ట్ చేసి ఫెస్ మాస్క్ వేసుకోవచ్చు . ఆవ నూనె నిమ్మరసం కూడా మంచి ఫలితం ఇస్తుంది. బాదం పప్పు నాననిచ్చి రోజ్ వాటర్ పచ్చి పాలతో కలిపి పేస్ట్ చేసి ఈ మిశ్రమంతో మొహం నృదువుగా మర్దనా చేయాలి. తర్వాత మొహానికి ఆవిరిపెట్టి తుడిచేయాలి. మొహంతో మెరుపు ఎంతోసేపు ఉంటుంది. చర్మం నిగారింపు కోసం ఇలా ఇంట్లోవాడే వస్తువులు ట్రై చేస్తే మొహం ఫ్రెష్ గానూ ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్టులు వుండవు.

    పాలు జీడిపప్పు పేస్ట్ అప్లయ్ చేస్తే

    వాతావరణంలో మార్పులకు ఎక్కువగా స్పందించేది చర్మమే . నెమ్మదిగా చలి తగ్గి మొహం పడుతోంది. చర్మం పేలవంతంగా అయిపోతుంది. క్యారెట్ చిన్న బీట్ రూట్ టమాటో కలిపి…

  • చాలా మందికి చిన్న వయసులోనే పెదవుల చుట్టూ ముక్కు దగ్గర చెంపల పై సాగినట్లు పెద్దవాళ్లుగా కనిపిస్తాయి. ఇంట్లోనే ఈ సమస్య కో కొన్ని మంచి చికిత్సలున్నాయి. అనాస పండు యాంటీ ఏజింగ్ ఏజెంట్ రెండు ముక్కలు అనాస పండు మెత్తగా చేసి ఆ రసం ముఖానికి రాస్కుంటే ఫలితం ఉంటుంది. ఆముదంలో ప్లాటీ ఆమ్లాలుంటాయి. ఇవి సాగిన చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. ఏదైనా నూనెలో ఆముదం కలిపి మర్దనా చేస్తే ఫలితం ఉంటుంది. బాదం నూనె తోకూడా ఇదే ఫలితం. రెండు పూటలా బాదం నూనె తో మర్దనా చేయాలి. చక్కెర మెత్తగా పొడిగా చేసి అందులో తేనె కలిపి పూతలా వేసుకుంటే చర్మానికి తేమ అంది సాగిపోకుండా ఉంటుంది. గుడ్డులోని తెల్లసొన తో పూతలాగా వేసినా మంచిదే. కలబంద గుజ్జయితే ప్రతిరోజు వాడవచ్చు. ఫ్రెష్ గా ఉన్న కలబంద నుంచి గుజ్జు తీసి పూతలా వేసి మర్దనా చేస్తే మంచి ఫలితాలుంటాయి.

    కలబంద తో చర్మం బిగుతవుతుంది

    చాలా మందికి చిన్న వయసులోనే పెదవుల చుట్టూ ముక్కు దగ్గర చెంపల పై సాగినట్లు పెద్దవాళ్లుగా కనిపిస్తాయి. ఇంట్లోనే ఈ సమస్య కో కొన్ని మంచి  చికిత్సలున్నాయి.…

  • ఉదయపు వేళ శ్రద్ధ తీసుకుంటేనే

    మొహం కడుక్కునే విధానం మార్చుకుంటే ముఖం ఇంకెంతో కాంతి వంతంగా మారుతుంది. అంటున్నారు ఎక్స్పెర్ట్స్. రాత్రివేళ మేకప్ తీసివేసేందుకు ఉదయం నుంచి మొహానికి తగ్గితే కాలుష్యం వదుల్చుకునేందుకు…

  • ఒక కప్పు కాఫీ తో ప్రతి ఉదయం అద్భుతంగా మొదలవుతోంది. ఎలాంటి చికాకులు పరాకులు లేకుండా పనిమొదలు పెట్టచ్చు. కాపీ ఆ కాఫీ లోనే అందం రహస్యం ఉందంటున్నారు. ఎక్స్పెర్ట్స్. సింపుల్ గానే వుంది చిట్కా మంచి డికాషన్ కాఫీ ని ఐస్ క్యూబ్స్ ట్రే లో పోసి ఫ్రిజ్ లో పెడితే అవి ఉదయానికి కాఫీ క్యూబ్స్ గ చేతికొస్తాయి. ప్రతి రోజు ఉదయం ఈ క్యూబ్ తో మొహం పై మర్దనా చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి చర్మం నిగారింపు కు వస్తుంది. కండీషనర్ లో రెండు టీ స్పూన్ల గ్రౌండ్ కాఫీ ని కలిపి జుట్టుకు పట్టేస్తే ఐదు నిమిషాల పాటు ఉంచి కడిగేసినా చాలు మెత్తని పచ్చు కుచ్చు లాగా తయారవుతాయి శిరోజాలు. అలాగే నిద్రలేకపోవటం వల్ల కంటి పై వత్తిడి పడటం వల్ల మరే ఇతర కారణాల వల్ల కళ్ళ చుట్టూ డార్క్ సిర్కిల్స్ ఏర్పడితే అప్పుడు ఒక అర కప్పు కాఫీ దగ్గర పెట్టుకుని దాన్ని కళ్ళ కింద అప్లయ్ చేస్తే చాలు. కా కాస్సేపయ్యాక చల్లని నీళ్లతో కడిగిస్తే సరి. చర్మకణాల పునరుత్పత్తికి కాఫీ గ్రౌండ్స్ బాగా పని కొస్తాయి. దాన్ని స్క్రబ్ మాదిరిగా ఉపయోగించవచ్చు. ఈ పొడితో చర్మం పైన నిదానంగా గుండ్రంగా మర్దనా చేస్తే ఇందులో వుండే కెఫిన్ కొల్లాజైన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ పద్దతిలో చర్మం ఎంతో సున్నితంగా అందంగా తయారవుతోంది.

    కాఫీ లో అందం

    ఒక కప్పు కాఫీ తో ప్రతి ఉదయం అద్భుతంగా  మొదలవుతోంది. ఎలాంటి చికాకులు పరాకులు లేకుండా పనిమొదలు పెట్టచ్చు. కాపీ ఆ కాఫీ లోనే  అందం రహస్యం…

  • ఈ కాలంలో చలికి పెదవులు పగిలి బీటలు పడతాయి. ఒక్కసారి రక్తం కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో వుండే వస్తువులతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. గులాబీ నీళ్లు తేనె కలిపి పెదాలను రాసుకుని గంట తర్వాత దూదితో తుడిచేస్తూ ఉంటే ఈ పగుళ్లు పోతాయి . రాత్రి వేళ పడుకునే ముందర తేనె రాసుకున్న ప్రయోజనం ఉంటుంది. పొడి బారిన పెదవులకు ఇది మంచి మందు. అలాగే నెయ్యి రాసుకున్న ఫలితం ఉంటుంది. వేడి నీళ్లల్లో గ్రీన్ టీ బ్యాగ్ పడేసి తీసి దానితో పగుళ్లు వచ్చిన పెదవుల పైన రాసుకున్న నొక్కిపెట్టి ఆ రసం పగుళ్ళకు తగిలేలా చేసినా మంచిది. ఈ టీ లోని యాంటీ ఆక్సిడెంట్స్ పగిలిన పెదవులకు మేలు చేస్తాయి. కీరా దోస ముక్కల్ని గుజ్జుగా చేసి రసం తీసి అందులో దూది ముంచి పెదాలపై వుంచినా మంచి ఫలితం ఉంటుంది. పెదవుల పై చర్మ పొలుసులుగా ఎండిపోతే బేబీ బ్రెష్ తో సున్నితంగా రుద్దేసి ఆలివ్ నూనె తో చక్కెర కలిపి ఐదు నిమిషాల పాటు పెదవులపై మర్దనా చేసి తర్వాత లిప్ బామ్ రాసుకుంటే పెదవులు చక్కగా ఉంటాయి. గులాబీ రేకుల్ని పాలల్లో నానబెట్టి మెత్తగా నూరి పెదవులకు రాసుకున్న పెట్రోలియం జెల్లీ రాసిన పగుళ్లు చాలా వేగంగా తగ్గిపోతాయి.

    ఇలా చేస్తే పెదవులు గులాబీ రేకుల్లావుంటాయి

    ఈ కాలంలో చలికి పెదవులు పగిలి బీటలు పడతాయి. ఒక్కసారి రక్తం కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో వుండే వస్తువులతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. గులాబీ…

  • పది నిమిషాల పాటు ఏ పని మీదో బైక్ పైన బైటకు వెళ్ళొస్తే చేతులు మొహం మురిగ్గా అయిపోతాయి. అంత కాలుష్యం నిండి వుంటుంది. తప్పని సరిగా చేతులు, మొహం, కాళ్ళు కడుక్కొంటాం. నిపుణులు ఏం చెబుతున్నారంటే ముందస్తుగా చేతులు కడుక్కోండి. చేతులు శుభ్రంగా లేకపోతే ఆ చేతులకున్న బాక్టీరియా, ఇతర క్రిములు చర్మం లోకి వెళ్ళిపోయి మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. మేకప్ వేసుకొని వుంటే దాన్ని తప్పనిసరిగా తొలగించుకోన్నకే ముఖం కడుక్కోవాలి. మేకప్ ను క్లెన్సర్ తో తొలగించుకొని ఫేస్ వాష్ తో కడగాలి. ముఖం కడుక్కోనేందుకు వేడి నీళ్ళు వాడకూడదు. చర్మం పొడిబారిపోతుంది. ముఖానికి చన్నీళ్ళు వాడాలి. చలికాలంలో చర్మం అతిగా రుద్ది కడిగేయోద్దు. పొడిబారిన చర్మాన్ని స్క్రబ్ లు ఇబ్బంది పెడతాయి. రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్ వాడవచ్చు. పొడిచర్మం ఉన్నవాళ్ళు మొహానికి కడుక్కున్న వెంటనే మాయిశ్చరైజర్ కాస్త కొబ్బరినూనె అప్లయ్ చేయాలి లేదంటే మొహం ఇంకా పొడిగా అయిపొయింది.

    మొహం అస్తమానం కడిగినా నష్టమే

    పది నిమిషాల పాటు ఏ పని మీదో బైక్ పైన బైటకు వెళ్ళొస్తే చేతులు మొహం మురిగ్గా అయిపోతాయి. అంత కాలుష్యం నిండి వుంటుంది. తప్పని సరిగా…