Friday, 24 Jul, 2026

మిస్ యూనివర్స్ మణికా

పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ ఫైనల్ లో ఉన్న మణికా విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటం దక్కించుకుంది రాజస్థాన్ లోని గంగానగర్ లో పుట్టి పెరిగిన మణికా చిన్నతనం నుంచే నృత్యం నేర్చుకుంది. విశ్వవ్యాప్తంగా తన గళం వినిపించాలని కోరిక తో బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొన్నానని ఆటిజం తో బాధపడే చిన్నపిల్లలకు చేయూత ఇస్తానని చెబుతోంది. జైపూర్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్ లో కిరీటం సొంతం చేసుకున్న మణికా. జీవితంలో ఎదురయ్యే […]

170 గంటల పాటు నృత్యం

ఇరవై సంవత్సరాల మంగళూరు స్టూడెంట్ రెమోనా ఎవెట్ పెరీరా ఏకధాటిగా 170 గంటల పాటు భరతనాట్యం ప్రదర్శన ఇచ్చి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించింది. బి ఏ ఫైనల్ చదువుతున్న రెమోనా చిన్నతనం నుంచే భరతనాట్యం నేర్చుకుంది.ఫైటింగ్ ఇతర భారత నాట్య రీతులు కూడా సాధన చేసింది. ఆమె నాట్య ప్రయాణంలో తల్లి ఎంతో తోడుగా నిలిచింది ట్రాన్స్ జెండర్ పిల్లలకు భరతనాట్యం నేర్పే రెమోనా కు భరతనాట్యంలో పి హెచ్ […]

జాగ్వార్ పైలెట్ తనుష్క

ఫ్లయింగ్ ఆఫీసర్ తనుష్క సింగ్ వైమానిక దళం యొక్క ఫైటర్ జెట్ జాగ్వర్ స్క్వాడ్రన్‌ మొదటి మహిళా పైలట్ భూమిపై ఉన్న టార్గెట్స్ ధ్వంసం చేసేందుకు, యుద్ధభూమిలోకి దూసుకుపోయి శత్రుదేశాల సమాచారాన్ని సేకరించేందుకు ఈ జెట్ విమానాలు ఉపయోగిస్తారు. తనుష్క పుట్టింది ఉత్తర ప్రదేశ్,పెరిగింది చదువుకుంది అంతా మంగళూరు లోనే, తండ్రి, తాత ఇద్దరు మిలటరీ ఆఫీసర్లు. తనుష్క కూడా ఆర్మీ అధికారిణి కావాలని కలలు కన్నారు. బీటెక్ పూర్తి చేశాక వాయి సేవలో మహిళలకు అవకాశాలు […]

ఊర్వశి కి అవార్డ్

2023 జాతీయ పురస్కారాల్లో “ఉళ్ళోజుక్కు”  (అంతః ప్రవాహం) మలయాళ సినిమాకు ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్నది నటి ఊర్వశి ఈ సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రంగా కూడా పురస్కారం అందింది. ఈ సినిమాలో అత్తగారి పాత్ర లో ఊర్వశి కోడలిగా పార్వతి తిరువోతు నటించారు పెళ్లైన కుమారుడు కొన్నేళ్లకే జబ్బు పడి మరణిస్తాడు అతను దహన సంస్కారాలు జరిపించేందుకు అవకాశం లేకుండా వర్షం ప్రవాహం వరదలు అత్తా కోడలు తమ జీవితాల్లో ఏర్పడిన లోటుతో మానసిక […]

బామ్మల కో ఉద్యోగం

‘ఒకే గ్రాండ్’ మా పేరుతో జపాన్ లో బామ్మ లను అద్దెకు వ్యాపారం మొదలైంది వృద్ధుల అనుభవాలు వ్యాపారంగా మారుస్తున్నారన్నమాట. 60 నుంచి 94 ఏళ్ల బామ్మ లను మోరల్ సపోర్ట్ కోసం ఎంచుకొనేవారు ఉన్నారు. కస్టమర్ అవసరం గురించి చెబితే అందుకు తగిన బామ్మను సెలెక్ట్ చేసి పంపుతారు. ఈ కంపెనీ లో 100 మంది బామ్మలు ఉన్నారు. బామ్మ సర్వీస్ కు గంటకు రెండు వేలు తీసుకుంటున్నారు. పిల్లలకు కథలు చెప్పే బామ్మ,సంప్రదాయ వంట […]

88 ఏళ్ల విద్యార్థి

మెయిన్ యూనివర్సిటీ లో సైన్స్ ఫ్యాకల్టీ లో చేరి బ్యాచిలర్ డిగ్రీ సాధించుకుంది. 160 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ యూనివర్సిటీ లో ఆ వయసులో గ్రాడ్యుయేట్ అయిన ఏకైక విద్యార్థిని జోన్ అలెగ్జాండర్ మాత్రమే. 1956 లో ఆమె టీచర్ అవ్వాలనుకుని యూనివర్సిటీ చేరింది కాకపోతే ఆ సమయంలో ఆమె పెళ్లి చేసుకొని గర్భవతి అయి విద్యార్థి గా కొనసాగలేక పోయింది. వరుసగా నలుగురు పిల్లలు ఇక ఇంటి పని పిల్లల పెంపకం సరిపోయింది. ఆఖరి […]

ఈ అమ్మాయి మెకానిక్

మహారాష్ట్ర కు చెందిన 14 ఏళ్ల కార్తీక రాయల్ ఎన్ ఫీల్డ్ మెకానిక్. ఆ వయసు పిల్లల లాగా ఆమె ఆటల్లో కాలక్షేపం చేయకుండా స్థానిక గ్యారేజ్ లో పనిచేసేది. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటూ తన కుటుంబానికి కాస్త ఆసరాగా ఉండేందుకు ఆమె గ్యారేజ్ పనిలో చేరింది. ఇంజన్ ఫిక్సింగ్ చేయటం నుంచి బైక్ సమస్యలు పరిష్కరించటం వరకు ఆమె అనుభవం ఉన్న మెకానిక్ లాగా పనిచేయగలదు. ఎంతోమంది మెకానిక్ లు ఎన్ ఫీల్డ్ ను […]

కేక్ తో కథలు

కేక్ కళాకారిణి ప్రాచి ధబల్ దేబ్. కేక్ తయారీని కథలు చెప్పే సాధనంగా మలుచుకున్నారు.పెద్ద కట్టడాలు కోటలు అచ్చంగా ఆ శిల్ప శైలి లోని నిలువెత్తుగా తయారు చేస్తారామె. ‘డ్యూమో డి మిలానో’ ఇటాలియన్ కేథడ్రల్ బార్బీ రెప్లిక 6.4 అడుగుల ఎత్తులో 46 అడుగుల వెడల్పు తో చేసే అది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నది. 2021 లో ప్రాచీ స్వదేశ్ సమ్మాన్ పురస్కారం అందుకున్నారు. ఆమె తయారు చేసే తీయని […]

పువ్వులతో వ్యాపారం

డెకార్ ప్రొడక్ట్స్ పేరుతో అందమైన జెయింట్ ఫ్లవర్స్ తయారు చేసి వ్యాపారం చేస్తున్నారు విభా జైన్. బెంగళూరుకు చెందిన విభా కు ఆర్టిఫిషియల్ పువ్వుల తయారీ ఎంతో ఇష్టం ఎన్నో రకాల పేపర్స్ వివిధ మెటీరియల్స్ తో కొత్త థీమ్స్ లు వేడుకల కోసం పార్టీల కోసం పువ్వులు తయారు చేస్తారు విభా. ఒక ప్రముఖ సంస్థ లో హెచ్ ఆర్ గా పనిచేసే విభా ఇవ్వాళ తన వ్యాపార విస్తరణ కోసం ఉద్యోగం మానేశారు ఆమె […]

తల్లిపాల దాత

తమిళనాడులోని తిరుచ్చి కి చెందిన బృందం, తిరుచ్చి ప్రభుత్వ మహాత్మా గాంధీ స్మారక ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాల బ్యాంకుకు 300.17 లీటర్ల పాలు దానం చేసి రికార్డుల్లోకి ఎక్కారు.తిరుచ్చి కాటూరుకు చెందిన ఈ తల్లి సెల్వ బృందం ఇద్దరు పిల్లల తల్లి. పుట్టిన బిడ్డకు శక్తి ఇచ్చేది తల్లిపాలే. నెలలు తక్కువగా పుట్టిన బిడ్డలకు ప్రాణం పోసేందుకు బృందా తన పాలు దానం చేయడం మొదలుపెట్టారు బృంద. దాన గుణానికి మెచ్చి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, […]

ఆమె క్వీన్

ఫోర్బ్స్ టైమ్స్ జాబితాలో తన రికార్డ్ ను పదిలం చేసుకున్న ప్రముఖ నటి దీపికా పదుకొనే తన 20 ఏళ్ల కెరీర్ లో అందుకున్న గౌరవాలకు లెక్కేలేదు ఆమె నటించిన సినిమాలు సూపర్ హిట్స్. ఆమె ఎన్నో అంతర్జాతీయ సంస్థ లకు గ్లోబల్ అంబాసిడర్ హాలీవుడ్ వార్ ఆఫ్ ఫ్రేమ్ స్టార్ 2026 కు ఎంపికైన తొలి భారతీయ నటి కూడా ఆమెనే. తాజాగా దీపిక ఇన్‌స్టా లో హిల్టన్ సంస్థతో కలిసి చేసిన యాడ్ ను […]

సేవకు గుర్తింపు

దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఆస్ట్రేలియా పర్యాటక రంగం చేస్తున్న క్యాంపెయిన్ కు భారత్ తరపున బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే అవకాశం దక్కించుకుంది. అందం, తెలివి, అనుకువ, సేవా భావంతో ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్ మాతా శిశు ఆరోగ్య రక్షణ, పోషణ వంటి విషయాల్లో ఆమె తీసుకునే శ్రద్ధ చూసిన తర్వాతనే ఆస్ట్రేలియా ‘కమ్ అండ్ సే గడే’ క్యాంపెయిన్ […]

తీయని వ్యాపారం

హోటల్ మేనేజ్మెంట్ చేసి పేస్ట్రీ షెఫ్ గా పనిచేస్తున్న కైనాజ్ మెస్మాన్ కిచెన్ లో జారిపడి వెన్నెముక దెబ్బ తగిలి నిలబడలేని స్థితి వచ్చింది.తల్లి తండ్రి అప్పటికే కెఫె కామ్ బేకరీ బిజినెస్ లో ఉన్నారు. కైనాజ్ తన చెల్లెలు టీనా మెస్మాన్ తో కలిసి ‘థియోబ్రోమా’ పేరుతో బ్రౌనీ లు, పేస్ట్రీ లు తయారు చేసే వ్యాపారం మొదలుపెట్టారు. టీనా చార్టెడ్ అకౌంటెంట్ ఈ పేస్ట్రీల రుచి అందరికీ నచ్చి, ఆ వ్యాపారం ఇవ్వాళా 225 […]

నేతకు చేయూత సూత

సుజాత, తానియా,బిస్వాస్ అక్కాచెల్లెళ్లు సుజాత ఐఐ ఎఫ్‌టి స్టూడెంట్. అందమైన చేనేత చీరలు అంటే ఆమెకు ఇష్టం కానీ చేనేత కార్మికులు తమ చీరలను మార్కెట్ చేసుకోలేక పోవడం చూడలేక, ఐ ఐ ఎమ్ గ్రాడ్యుయేట్ అయిన చెల్లెలు తానియా ను కలుపుకొని సూత పేరుతో అందమైన చీరల డిజైనింగ్ స్టార్టప్ మొదలుపెట్టింది. సంస్కృతంలో సూత అంటే దారాలు బెంగాలీ కుటుంబంలో పుట్టి పెరిగిన ఈ అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ చేనేత కార్మికులతో ప్రారంభించిన సూత ను […]

ఇద్దరు విజేతలు

రాణి ముఖర్జీ, వైభవి మర్చంట్ ఇద్దరూ జాతీయ అవార్డు గెలుచుకున్నారు. రాణి ముఖర్జీ నటి వైభవి కొరియోగ్రాఫర్. ఇద్దరు మంచి స్నేహితులు. ఎన్నో ప్రాజెక్ట్ లలో కలిసి పనిచేశారు మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో రాణి ముఖర్జీ అద్భుతమైన నటన ప్రదర్శించారు. “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ” సినిమాలో “ధింధోరా బజే రే” పాటకి వైభవి ఎంతో చక్కని కొరియోగ్రఫీ చేశారు ఇద్దరినీ ఒకేసారి జాతీయ అవార్డు వరించింది. రాణి ముఖర్జీ తొలిసారిగా […]

రికార్డుల పరంపర

చండీగఢ్ కు చెందిన జాన్వి జిందాల్ చాలా ప్రత్యేకం యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫ్రీ స్టైల్ లో స్కేటింగ్ మెళకువలు నేర్చుకొని 17 ఏళ్లకే ఐదు గిన్నిస్ రికార్డులు సాధించింది. 8 ఏళ్ల వయసులో తండ్రి మనీష్ జిందాల్ సాయంతో రోలర్ స్కేట్స్ తో సాధన చేసింది జాన్వి. 2019లో తొలిసారి జాతీయ స్థాయి స్కేటింగ్ ఛాంపియన్ షిప్ లో తొలి పతకం సాధించింది జాన్వి. ఆ తర్వాత పలు జాతీయ స్థాయి పోటీల్లో స్వర్ణ,కాంస్య పతకాలు […]

టైగర్ ప్రిన్సెస్ లతికా

పులుల సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంటరీ చేసినందుకుగాను లతికా నాథ్ కు జియో గ్రాఫికల్ మ్యాగజైన్ నిర్వాహకులు టైగర్ ప్రిన్సెస్ అని బిరుదు ఇచ్చారు. మన దేశంలో పులుల సంరక్షణ మేనేజ్మెంట్ పై పరిశోధన చేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు తెచ్చుకున్నది లతిక. ఆమె వైల్డ్ లైఫ్ జియాలజిస్ట్ ఫోటోగ్రాఫర్ అడవులలో పులులు, ఇతర జంతు జాలాలు ఫోటోలు తీసుకున్న లతిక వాటిని హిడెన్ ఇండియా పుస్తకంగా పాఠకులకు చూపించింది. పిల్లల కోసం ఆమె రాసిన తక్దిర్ ది […]

గ్రాండ్ మాస్టర్ దివ్య

మహిళల చెస్ వరల్డ్ కప్ గెలిచి గ్రాండ్ మాస్టర్ హోదా సాధించింది 19 ఏళ్ల దివ్య దేశ్ముఖ్ వైద్య కళాశాల ప్రొఫెసర్ జితేంద్ర ఆమె తండ్రి తొలి కోచ్ ఆయనే. తర్వాత సుప్ర సిద్ధ కోచ్ రాహుల్ జోషి దగ్గర చదరంగం ఎత్తులు నేర్చుకుంది 2023 నాటికి ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా సాధించింది. ఆ ఏడాది ఆసియా ఉమెన్ ఛాంపియన్ షిప్ లో కోనేరు హంపి ని ఓడించింది. 2024 లో వాల్డ్ జూనియర్ గర్ల్స్ ఛాంపియన్ […]

అశోక్ చక్ర ఆమెకే

1939 లో క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్ గా ఏర్పడి ఆ తర్వాత 1949 నుంచి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గా సేవలు అందిస్తున్న సి ఆర్ పి ఎఫ్ లో ఇప్పటివరకు ఓకే మహిళ అశోక్ చక్ర అవార్డ్ పొందింది. ఆమె పేరు కమలేష్ కుమారి. ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజ్ కి చెందిన కమలేష్ కుమారి పార్లమెంట్ సమావేశాల్లో ఉమెన్ బెటాలియన్ లో సెక్యూరిటీ విధులు నిర్వహించేది ఢిల్లీలో పార్లమెంట్ పైన 2001, డిసెంబర్ […]

పాఠాలు చెప్తున్న డాక్టర్

కానూరులో వైకల్యాలు ఉన్న పిల్లల కోసం స్పెషల్ స్కూల్ ఏర్పాటు చేసింది దీప్తి తివారి. ఆమె కొడుకు భరత్ శారీరక మానసిక వైకల్యంతో బాధ పడడం చూడలేక వైద్య విద్య చదువుకున్న దీప్తి ప్రాక్టీస్ మానేసి సంకల్ప స్పెషల్ స్కూల్ ప్రారంభించింది. 2007 లో ప్రారంభించిన ఈ స్కూల్లో కొన్ని వందల మంది స్పెషల్ చిల్డ్రన్ ఎన్నో నైపుణ్యాలు నేర్చుకున్నారు వీలైనంత చదువు కూడా చదువుకున్నారు. హస్త కళలలో ప్రావీణ్యత సంపాదించారు. పరమైన లోపాలు ఉన్న పిల్లల […]