దేశానికి తొలి మహిళల అంధుల వరల్డ్ కప్ ను అందించి సామాన్యుల నుంచి ప్రధాని మోదీ వరకు ప్రశంసలు అందుకున్నది. భారత జట్టు కెప్టెన్ రాయలసీమ అమ్మాయి దీపిక సత్యసాయి జిల్లా మడకశిర లోని తంబల హట్టి అనే గ్రామంలో వ్యవసాయ కూలీలుగా పనిచేసే కుటుంబంలో జన్మించిన దీపిక స్కూల్ టీచర్ల ప్రోత్సాహంతో క్రికెట్ నేర్చుకుంది. బాల్యంలోనే ప్రమాదంలో ఒక కన్ను పోగొట్టుకున్న దీపిక జాతీయ అంధుల క్రికెట్ బోర్డ్ లో స్థానం సంపాదించుకున్నది భారత జట్టుకు తొలి మహిళల టి-20 వరల్డ్ కప్ అందించింది. ముంబైలో ఇన్ కంటాక్స్ విభాగంలో పనిచేస్తున్న దీపిక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు దాటి తన ఆసక్తి క్రికెట్ ను కెరీర్ గా మార్చుకున్నది.













