దేశానికి గర్వకారణం

దేశానికి గర్వకారణం

దేశానికి గర్వకారణం

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా బరువే గ్రామంలో పుట్టిన కావ్య వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టింది పుట్టుకతోనే అందురాలు శారదా దేవి బ్లైండ్ డెవలప్మెంట్ సెంటర్ లో చదువుకుంది. అక్కడే క్రీడలతో పరిచయం అయింది. టీచర్ల శిక్షణతో పరుగు లాంగ్ జంప్ పోటీల్లో పాల్గొన్నది. అటు తర్వాత పదో తరగతి పూర్తి చేసి సమర్ధనం ట్రస్ట్ లో చేరింది. అక్కడే క్రికెట్ శిక్షణ పొంది టి-20 అంధ మహిళల క్రికెట్ జట్టులో చోటు సంపాదించుకున్నది. తనదైన ప్రత్యేక ప్రతిభ చూపెట్టి జట్టు గెలుపులో భాగం అయింది. దేశం గర్వించదగిన స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నది.