చండీగఢ్ కు చెందిన జాన్వి జిందాల్ 11 ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్నది.12వ తరగతి చదువుతున్న జిందాల్ ఆన్ లైన్ వీడియోలు,చూసి తండ్రి సాయంతో ఫ్రీస్టైల్ స్కేటింగ్ పైన పట్టు పెంచుకున్నది. జాతీయ పోటీల్లో మూడు స్వర్ణాలు, రెండు కాంస్య పతకాలు,రజిత పతకాలు గెలుచుకున్నది ఆమె తండ్రి మునిష్ జిందాల్ జాన్వి కి 8 ఏళ్ల వయసు నుంచే శిక్షణ ఇచ్చాడు. 30 సెకన్ల ఇన్‌లైన్ స్కేట్స్‌లో అధిక 360 డిగ్రీల భ్రమణాలు 30 సెకండ్లలో అత్యధిక వన్ వీల్‌డ్ 360 డిగ్రీల భ్రమణాలు ఇలా మొత్తం ఆరు కొత్త రికార్డులతో అత్యధిక గిన్నిస్ బుక్ రికార్డులు దక్కించుకున్నది జాన్వి.













