మహిళా సంక్షేమం ధ్యేయం

మహిళా సంక్షేమం ధ్యేయం

మహిళా సంక్షేమం ధ్యేయం

షీలా కొచౌసెఫ్ 40 ఏళ్ళ వయసులో వ్యాపారం లోకి వచ్చి కొచ్చి కేంద్రం గా వి స్టార్ అనే పేరుతో ఇన్నర్ వేర్ అమ్మకాలు చేశారు.ఆమె భర్త కొచౌసెఫ్ చిట్టిల పిల్లి గ్రూప్ వి స్టార్ గ్రూప్       యజమాని.1995 లో ప్రారంభించిన ఈ సంస్థ అధిక నాణ్యత గల లోదుస్తుల బ్రాండ్ గా వెళ్ళాలనుకొన్నారు.టర్నోవర్ వంద కోట్ల పైనే ఉంటుంది.ఈ కుటుంబానికి చెందిన చిట్టిల పిల్లి ఫౌండేషన్ ద్వారా ప్రధానంగా సామాజిక సంక్షేమం విద్య ఆరోగ్య సేవల విభాగంలో కూడా షీలా పనిచేస్తున్నారు ప్రత్యేకించి మహిళా స్వావలంబన నిధులు అందిస్తున్నారు.ఈ ఐదేళ్ల లో ఈ ఫౌండేషన్ ద్వారా 181 కోట్ల విరాళం అందించారు.