కాటన్,సిల్క్,చందేరి,షిఫాన్,టస్సర్,ఆర్గంజా రకాల చీరల పైన బాందిని డిజైన్స్ వస్తున్నాయి వీటికి జర్దోసి,ఎంబ్రాయిడరీ,కుందన్,అద్దాలు,పూసల వర్క్ జోడించి మరింత గ్రాండ్ గా తయారు చేస్తున్నారు డిజైనర్లు. బాంధీని అన్నది ఒక సాంప్రదాయ వస్త్ర కళ. సాదా చీర పైన దారాల సహాయంతో ముడులు చుడతారు. ముడుల తోనే రకరకాల డిజైన్లు రూపొందిస్తారు. అప్పుడు ఆ చీరను రంగులో ముంచి ఆరబెట్టి ముడులు విప్పదీస్తే బాందినీ చీరే తయారవుతుంది. ఇట్లా టై అండ్ డై విధానం తో చుక్కలు,చదరాలు,పూలు లతలు సమూహాలతో ఎన్నో విభిన్నమైన డిజైన్ లను రూపొందిస్తారు.