చిత్తు కాగితాలకు పుస్తకం

చిత్తు కాగితాలకు పుస్తకం

చిత్తు కాగితాలకు పుస్తకం

వారణాసి లో పుట్టి పెరిగి, కామర్స్ చదువుకున్న ప్రీతు ‘లిటిల్ లీఫ్’ సంస్థ స్థాపించారు. 2014లో ఏర్పాటు చేసిన ఈ సంస్థ చెత్త కాగితాలు సేకరించి, వాటిని రీసైక్లింగ్ చేయించి నోట్ బుక్స్ తయారు చేస్తుంది. ఇంటింటా సేకరించిన లక్ష కిలోల చిత్తు కాగితాలను 50 వేలకు పైగా నోట్ బుక్స్ గా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద పిల్లలకు వాటిని పంచారు.పర్యావరణ స్పృహ ప్రజల్లో కలిగించాలనే ఉద్దేశంతో ఏర్పడిన ఈ సంస్థ కు ఎవరైనా చెత్తకుండీల్లో పడేయకుండా ఒక రెండు కిలోల కాగితాలు తెచ్చి ఇస్తే దానికి బదులుగా ఒక నోట్ బుక్ ఇస్తారు. వ్యర్థాల పట్ల రీసైక్లింగ్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తోంది లిటిల్ లీఫ్ సంస్థ.