ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్ సోనా జె. ఒడియప్పన్ డిజైనర్ గా తన 14 ఏళ్ల అనుభవం తో సి వి అనే వర్చువల్ డిజైనర్ ని తీసుకువచ్చింది. ఈ సి వి కి సోనా చీఫ్ డిజైన్ ఆఫీసర్. ఈ సి వి ఎఐ తో యాడ్స్, బ్యానర్స్, సోషల్ మీడియా పోస్ట్ లు, యూట్యూబ్ థంబ్ నెయిల్స్ అన్ని సృష్టించుకోవచ్చు. 72 భాషల్లో రెండు నిమిషాల్లో ఈ సివి డిజైన్ చేసి ఇవ్వగలదు. ఈ వినూత్న ప్రయత్నాని కి ప్రశంసలతో పాటు పెట్టుబడులు అందాయి. ఈ సంస్థ ఫోర్బ్స్ గ్లోబల్ ప్రొటెన్షియల్ బిజినెస్ జాబితాలో చోటు సంపాదించుకుంది.













