మెయిన్ యూనివర్సిటీ లో సైన్స్ ఫ్యాకల్టీ లో చేరి బ్యాచిలర్ డిగ్రీ సాధించుకుంది. 160 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ యూనివర్సిటీ లో ఆ వయసులో గ్రాడ్యుయేట్ అయిన ఏకైక విద్యార్థిని జోన్ అలెగ్జాండర్ మాత్రమే. 1956 లో ఆమె టీచర్ అవ్వాలనుకుని యూనివర్సిటీ చేరింది కాకపోతే ఆ సమయంలో ఆమె పెళ్లి చేసుకొని గర్భవతి అయి విద్యార్థి గా కొనసాగలేక పోయింది. వరుసగా నలుగురు పిల్లలు ఇక ఇంటి పని పిల్లల పెంపకం సరిపోయింది. ఆఖరి కూతురు ట్రేసీ తల్లి చదువుకోవాలనే కోరికను తెలుసుకొని, యూనివర్సిటీ వారిని సంప్రదించి అక్కడ తల్లికి సీటు సంపాదించింది. ఆమె డిగ్రీ తీసుకోవాలనుకునే కోరిక తీరింది.













